“ఆ చాటింగ్‌లు” నిజమైతే సుప్రీంకోర్టు అఫిడవిట్‌లో ఎందుకు చెప్పలేదు..!?

దేశంలో ఓ వైపు పెగాసుస్ ప్రకంపనలు కొనసాగుతూంటే.. ఏపీలో చంద్రబాబు, లోకేష్, రఘురామరాజు ఫోన్ చాటింగ్‌లంటూ.. స్క్రీన్ షాట్లను..జగన్మోహన్ రెడ్డికి చెందిన మీడియా అదే పనిగా ప్రచారం చేస్తోంది. అందులో అభ్యంతరక వ్యాఖ్యలు ఉన్నాయని.. వారు..జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు గురించి మాట్లాడుకున్నారని ఆ స్క్రీన్ షాట్లలో ఉంది. అయితే ఒక్క సారి కాదు.. రోజూ.. ఆ కథలను ప్రచురిస్తున్నారు. ప్రసారం చేస్తున్నారు. కొత్తగా న్యాయమూర్తుల గురించి కూడా చర్చించుకున్నారంటూ.. కొన్ని స్కీన్ షాట్లాను ప్రసారం చేయడం ప్రారంభించారు. ఆ ఫోన్ చాటింగ్‌లను విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ ఎకౌంట్‌లో పోస్ట్ చేసిన తర్వాత చాలా రియాక్షన్ వచ్చింది.

రఘురామకృష్ణరాజు ఫోన్ నుంచి ఆ స్క్రీన్ షాట్లను సీఐడీ తీసుకుందని చెప్పుకొచ్చారు. కానీ …రఘురామరాజు అనే పేరు నుంచి వచ్చిన మెసెజ్‌లను ప్రదర్శించారు. అంటే.. అవి చంద్రబాబు, లోకేష్ ఫోన్ల నుంచి స్క్రీన్ షాట్లు తీసి ఉండాలి. రఘురామరాజు ఫోన్ నుంచి తీసుకున్నట్లుయితే.. ఎవరితో చాటింగ్ చేశారో.. వారి పేరు పైన కనిపించాలి. కానీ రఘురామరాజు అని పెట్టుకున్నారు. దీంతో అవన్నీ ఫేక్ అని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయినప్పటికీ.. తర్వాతి రోజు.. అంటే బుధవారం.. న్యాయమూర్తుల గురించి మాట్లాడుకున్నారంటూ… ప్రచారం చేయడం ప్రారంభించారు. సాక్షి పత్రికలోనూ ఆ కథనాలను ప్రచురిస్తున్నారు.

నిజంగా రఘురామకృష్ణరాజు ఫోన్‌లో అలాంటి చాటింగ్‌లు ఉంటే… సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో సమర్పించి ఉండేవారు. సుప్రీంకోర్టులో.. అవేమీ ఇవ్వలేదు. జర్నలిస్టులు.. రఘురామకృష్ణరాజుకు సూపర్ అని మెసెజ్ చేశారన్న విషయాన్ని కూడా చెప్పిన ప్రభుత్వం… న్యాయమూర్తుల గురించి.. మాట్లాడుకుంటే చెప్పదా..?. ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి… రాజకీయంగా బురద చల్లాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి కథలు అల్లుతున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే.. నమ్మాల్సిన వాళ్లు నమ్ముతారని.. తమకు అదే కావాలని.. జగన్ మోహన్ రెడ్డి అండ్ టీం వ్యూహంగా టీడీపీ నేతలు భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోలీసులకిచ్చిన “ఆఫర్” కూడా జగన్‌ మార్క్‌దే !

సీఎం జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలీసులకు వీక్లీఆఫ్ ఇస్తున్నట్లుగా ప్రకటించారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన సీఎం జగ‌న్ అని దేశవ్యాప్తంగా గొప్పగా ప్రకటించారు. డీజీపీ గౌతం సవాంగ్ కూడా.. జగన్...

సజ్జల పరిశీలించారు.. ఇప్పుడు సీఎం వంతు !

సొంతజిల్లాను వరదలు అతలాకుతలం చేసినా పట్టించుకోలేదని విమర్శలు ఎదుర్కొంటున్న సీఎం జగన్ రెండు రోజుల పాటు పర్యటించాలని నిర్ణయించారు. రెండు, మూడు తేదీల్లో కడప జిల్లాతో పాటు నెల్లూరులోనూ క్షేత్ర స్థాయిలో పర్యటించి...

కేసీఆర్ అగ్రెసివ్ పాలిటిక్స్ వెనుక ప్రశాంత్ కిషోర్ !?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల రూటు మార్చారు. దారుణమైన తిట్లతో వివాదాస్పద రాజకీయం చేస్తున్నారు. ఎందుకిలా చేస్తున్నారో చాలా మందికి అర్థం కావడం లేదు కానీ.. ఆయనకు ప్రశాంత్ కిషోర్ అందించడం ప్రారంభమైందని...

ఏపీ పేదల్లో “ఓటీఎస్” అలజడి ! ప్రభుత్వానికి దయ లేదా ?

ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్న ఏపీ ప్రభుత్వం ఎక్కడకిక్కడ నిధులు సమీకరిస్తోంది. అప్పులు.. ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఇలా దేన్నీ వదిలి పెట్టడం లేదు. అయితే ఇప్పుడు ప్రజల్నీ బాదేయడం అనూహ్యంగా మారింది. నిరుపేదల్ని రూ....

HOT NEWS

[X] Close
[X] Close