సీబీఐ దూకుడుతో వైసీపీ సోషల్ మీడియాలో వణుకు..!

ప్రభుత్వ డిజిటల్ డైరక్టర్‌గా ప్రజాధనం జీతంగా తీసుకుంటున్న గుర్రంపాటి దేవేందర్ రెడ్డి .. అధికారికంగా నిర్వహించే విధులు మాత్రం వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్‌గా. ఆయన ట్వీట్లు… పోస్టులు ఎంత దారుణంగా ఉంటాయో… ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చంద్రబాబు దగ్గర్నుంచి రఘురామకృష్ణరాజు వరకూ ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా దూషించడంలో ఆయన పీహెచ్‌డీ చేశారు. ఆయన బాటలోనే ఆయన సోషల్ మీడియా టీం ఉంది. తమను ఎవరూ ఏమీ చేయలేరన్న ఉత్సాహంతో ..అదే దూకుడు న్యాయస్థానాలపైనా చూపించి ఇప్పుడు ఇరుక్కుపోయారు. ఆయనను సోమవారం దాదాపుగా ఎనిమిది గంటల పాటు సీబీఐ అధికారులు ప్రశ్నించారు.

న్యాయస్థానాలపై … న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులన్నీ.. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు పెట్టినవే. అన్నీ ఆర్గనైజ్డ్‌గా పెట్టారని.. సీబీఐ అనుమానిస్తోంది. ఓ పద్దతి ప్రకారం.. అందరికీ సూచనలు వెళ్లాయని.. అవి గుర్రంపాటి దేవేందర్ రెడ్డి నుంచే వెళ్లాయని భావిస్తున్నారు. ఎనిమిది గంటల విచారణలో గుర్రంపాటి నుంచి కీలకమైన సమాచారాన్ని సీబీఐ అధికారులు సేకరించారని అంటున్నారు. అసలు వైసీపీ సోషల్ మీడియా ఎలా నడుస్తుంది.. ఎంత ఖర్చు పెడుతున్నారు… పోస్టింగ్స్ పెట్టాలని ఎలా సందేశాలు పంపుతారు.. లాంటి వాటిని కూడా కూపీ లాగినట్లుగా తెలుస్తోంది. గుర్రంపాటి ఫోన్‌ను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకుని ఆయన సోషల్ మీడియా ఖాతాలను తెరిచి.. వివరాలను అడిగినట్లుగా కొంత మంది వైసీపీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.

పరిస్థితి సీరియస్‌గా ఉందని తేలడంతో.. గుర్రంపాటి దేవేందర్ రెడ్డికి తోడుగా సీబీఐ విచారణకు ఇద్దరు ఎమ్మెల్యేను వైసీపీ హైకమాండ్ పంపింది. అయితే.. వారిని సీబీఐ అధికారులు కార్యాలయంలోకి అనుమతించలేదు. దాంతో వారు వెళ్లిపోయారు. మళ్లీ ఆయన విచారణ పూర్తయిన తర్వాత బయటకు వచ్చే సమయంలో రిసీవ్ చేసుకోవడానికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు వచ్చారు. మీడియాతో మాట్లాడిన గుర్రంపాటి టీడీపీనే తమపై సీబీఐతో తప్పుడు కేసులు పెట్టించిందని ఆయన ఆరోపించి వెళ్లిపోయారు. ఈ కేసు అంత తేలికగా వదిలేది కాదని.. చాలా మంది చిక్కుల్లో పడబోతున్నారన్న ఓ అభిప్రాయం మాత్రం వైసీపీ సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close