వైసీపీ సోషల్ మీడియా సైలెన్స్ – ఐ ప్యాక్‌ను వదిలించుకున్నారా ?

వైసీపీ సోషల్ మీడియా ఒక్క సారిగా మూగబోయింది. మామూుగా అయితే ఈ పాటికి ఫేక్ ఎగ్జిట్ పోల్స్ తో హడలెత్తించాలి. కానీ పోలింగ్ రోజు మధ్యాహ్నానికి చేసిన ఫేక్ సర్వే వీడియోల తర్వాత చప్పుడు లేకుండా పోయింది. పోలింగ్ సరళిపై ఎలాంటి అంచనాలు ఫేకులు రాలేదు. ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలే తమకు తోచిన ట్వీట్లు పెడుతున్నారు. వైసీపీ సోషల్ మీడియా కూడా ఎఫెక్టివ్ గా లేకుండా పోయింది. దీనికి కారణం ఐ ప్యాక్ టీమ్ తో కాంట్రాక్ట్ ను రద్దు చేసుకోడవమేనని వైసీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

ఐ ప్యాక్ ప్రశాంత్ కిషోర్ స్థాపించిన సంస్థ. ఆ సంస్థ కార్యకాలాపాల్లో పీకే పాత్ర లేకపోయినప్పటికీ వాటా ఉంటుంది. రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అయినా ప్రశాంత్ కిషోర్ తమకు వ్యతిరేకంగా పని చేయడంపై జగన్ ఫీలయ్యారని అంటున్నారు. మధ్యలో వదిలించుకోవడం ఇష్టం లేక పోలింగ్ అయిపోయే వరకూ పని చేయించుకున్నారని ఇక అసవరం లేదని ప్యాకప్ చెప్పేశారని అంటున్నారు. కనీసం కౌంటింగ్ వరకూ అవసరం లేదని.. సర్దుకోవాలని చెప్పేశారని అంటున్నారు.

మామూలుగా ఐ ప్యాక్.. పోలింగ్ తర్వాత వైసీపీకి హైప్ ఎక్కించేందుకు ప్రయత్నిస్తుంది. కానీ అలాంటి ప్రయత్నాలు జరగలేదు. కూలీ మీడియా సాయంతో కొంత హైప్ ఎక్కించుకుంటున్నారు కానీ.. సోషల్ మీడియా లో మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు. ఎన్నికలకు ముందు ఎవైనా ఆన్ లైన్ పోల్స్ కనిపిస్తే.. బాట్స్ ను ఉపయోగించుకుని ఓటింగ్ అదరగొట్టేవారు. ఇప్పుడు అలాంటి ప్రయత్నమే చేయకపోవడంతో ఐ ప్యాక్ ఇనాక్టివ్ అయిపోయిందన్న అభిప్రాయానికి వస్తున్నారు.

ఐ ప్యాక్ వల్ల గతంలో ఎంత లాభం జరిగిందో.. ఈ సారి అంత నష్టం జరిగిందన్న వాదన వైసీపీ వర్గాల్లో ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆఫ్రికాకు పెద్దిరెడ్డి జంప్ – చెప్పకనే చెప్పారుగా !?

మంత్రి పెద్దిరెడ్డి ఆఫ్రికాలో కాంట్రాక్టులు చేస్తున్నారట.. అందుకని ఇక్కడి తన వాహనాలన్నింటినీ ముంబై పోర్టు నుంచి ఆఫ్రికాకు ఎక్స్ పోర్టు చేసేస్తున్నారు. ఆఫ్రికాలో మైనింగ్ చేయాలనుకుంటే... ఇక్కడి నుంచే ఎందుకు...

జగన్ కు విధించబోయే మొదటి శిక్ష ఇదేనా..?

ఏపీలో కూటమే ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని జోరుగా ప్రచారం జరుగుతోన్న వేళ మరో ఆసక్తికర చర్చ జరుగుతోంది. శాసన సభాపతి చైర్ లో ఎవరిని కూర్చోబెట్టనున్నారు..? అనే దానిపై బిగ్ డిస్కషన్ కొనసాగుతోంది....

రూట్ మార్చిన అధికారులు – ఏపీ రాజకీయాల్లో కొత్త పరిణామం

ఏపీ రాజకీయాల్లోనే కాదు అధికార వర్గాల్లోనూ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదనే సంకేతాలతో టీడీపీ అధినేత చంద్రబాబుతో టచ్ లోకి వెళ్లేందుకు చాలామంది అధికారులు ప్రయత్నాలు చేస్తుండటం...

మంచు మ‌నోజ్‌… మోస్ట్ డేంజ‌రెస్

మంచు మ‌నోజ్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభ‌మైంది. త‌ను వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నాడు. ఈ ఇన్నింగ్స్ లో వెరైటీగా విల‌న్ పాత్ర‌ల‌పై మోజు పెంచుకొన్నాడు. త‌న‌కు అలాంటి అవ‌కాశాలు ఇప్పుడు బాగా వస్తున్నాయి. 'మిరాయ్‌'లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close