విజయవాడ ఉత్సవ్‌ను నిర్వహించాలని.. విజయవాడ ప్రజాప్రతినిధులు అనుకుని దాని కోసం ఓ కమిటీగా ఏర్పడి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో వెల్లంపల్లిని కలుపులోకోలేదు అనో..లేకపోతే హిందూ పండగుల్ని ఆ రేంజ్ లో సెలబ్రేట్ చేస్తారా అని వైసీపీ కడుపు మంటో కానీ దాన్ని ఆపేందుకు కోర్టులకు వెళ్తున్నారు. ఓ ఆలయానికి చెందిన భూమిని లీజుకు తీసుకుంటే..దానిపై కోర్టుకెళ్లి సింగిల్ బెంచ్ దగ్గర వ్యతిరేక ఉత్తర్వులు తెచ్చారు. డివిజన్ బెంచ్ ఆ ఉత్తర్వులను కొట్టేసింది. పెద్ద మొత్తంలో లీజు వస్తూంటే సమస్యేమిటని ప్రశ్నించింది.
వెంటనే వైసీపీ నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లారు. విజయవాడ ఉత్సవ్ నిర్వహించడానికి ఇచ్చిన స్థలం లీజును రద్దు చేయాలని అత్యవసరంగా పిటిషన్ వేశారు. సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇంత ఖర్చు పెట్టుకుని సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పెద్ద పెద్దలాయర్లతో మాట్లాడుకుని మరీ విజయవాడ ఉత్సవ్‌ను ఎందుకు ఆపాలనుకుంటున్నారన్నదే అసలు ప్రశ్న.
ఆలయ స్థలాన్ని చట్ట పరంగా లీజుకు తీసుకున్నారు. అదీ కూడా ఏళ్ల తరబడి కాదు. కేవలం యాభై రోజులు.. ఏర్పాట్ల కోసం.. ఉత్సవాల కోసం .. ఆ తర్వాత స్తలాన్ని మళ్లీ యథాతథ స్థితికి తీసుకు రావడానికి ఈ యాభై రోజుల లీజు తీసుకున్నారు. ఒక వేళ కోర్టుకెళ్లి దాన్ని ఆపేస్తే.. మరో ప్లేస్ చూసుకుని నిర్వహిస్తారు. కానీ ఇప్పటికే.. అక్కడ ఏర్పాట్లు ప్రారంభించారు. మొత్తంగా వైసీపీ నేతలు విజయవాడ ఉత్సవ్ మీద ఎందుకు కుట్ర చేస్తున్నారన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది.