దానికి కూడా ఆధారాలు కావాలంటే ఎలా సార్‌?

తాము ఒక వాదనకు కట్టుబడి దానికి అనుకూలంగా మాట్లాడాలని ‘ఫిక్స్‌’ అయిపోయారంటే.. ఇక తాను పట్టిన కుందేలికి మూడేకాళ్లు అనేంత మూర్ఖంగా వాదించడంలో రాజకీయనాయకులకు మరెవ్వరూ సాటిరారు. ప్రతి సందర్భంలోనూ వారికి తెలిసిన వాస్తవాలు వేరే ఉంటాయి.. బయటకు రాజకీయం కోసం మాట్లాడే మాటలు మరో తీరుగా ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో.. ఇలాంటి బుకాయింపు మాటలు మాట్లాడుతున్న సమయంలోనే.. వారి తీరు, ఆ ద్వంద్వ వైఖరిని పట్టించేస్తూ ఉంటుంది. ఇప్పుడు సీపీఎంకు చెందిన సీనియర్‌ నాయకుడు సీతారాం ఏచూరి కూడా అదే రకంగా వ్యవహరిస్తున్నారు. రోహిత్‌ విషయంలో ఆయన తన మాటల గారడీ ని ప్రదర్శిస్తున్నారు.

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్య ఇంకా పార్లమెంటులోనూ ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయంపై సుదీర్ఘమైన ప్రసంగం చేసి.. దాని మీదే బోలెడు చర్చోపచర్చలకు ఆస్కారం కల్పించిన మంత్రి స్మృతి ఇరానీ ఆ ప్రసంగంలో ఏచూరి గురించి రోహిత్‌ చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావించిన సంగతి అందరికీ తెలుసు. ఏచూరి గురించి వేముల రోహిత్‌ తన ఫేస్‌బుక్‌ ఎకౌంట్‌లో నెగటివ్‌ వ్యాఖ్యలు గతంలో చేశారు. అయితే రోహిత్‌ మరణం తర్వాత.. సహజంగానే అన్ని పార్టీలు దీనిని రాజకీయం చేయడానికి ప్రయత్నించినట్లే.. యేచూరి కూడా విపరీతంగా రాద్ధాంతం చేశారు.

ఇరానీ ఈ వ్యాఖ్యల్ని ప్రస్తావించడంతో ఆయనకు గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లయింది. దాంతో డొంకతిరుగుడు మాటల బాటను ఎంచుకున్నారు. రోహిత్‌ ఎఫ్‌బీ ఖాతాలో యేచూరిపై దూషణలు ఉండగా, ఆ ఎఫ్‌బీ ఖాతా రోహిత్‌ దే అనడానికి ఆధారాలేంటంటూ… యేచూరి ప్రశ్నించడం విశేషం. దీనిపై బుకాయించడానికి రకరకాల మార్గాలు ఎంచుకోవచ్చు. అయితే.. ఏకంగా రోహిత్‌ తన వ్యక్తిగత ఎఫ్‌బీ ఖాతాలో పెట్టిన వ్యాఖ్యలకు సంబంధించి.. ఆ ఖాతా అతనిదేనా.? ఆ వ్యాఖ్యలు అతనే టైప్‌ చేశాడనడానికి ఆధారాలు ఏంటి? అని ప్రశ్నించడం చాలా డొంకతిరుగుడుగానే ఉన్నదని పలువురు అంటున్నారు. ఇంత దాకా వచ్చాక ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే తమ వాదనకు, అనుకూలంగా ఉండడం కోసం కొత్తగా ఆధారాలు అడగడం.. పలాయనవాదంగానే ఉన్నదని అనుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ సలహాదారులు కి కనీస అవగాహన లేదా ?

ఎస్‌ఈసీగా రమేష్‌కుమార్ తొలగింపు వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపధ్యలో ప్రతిపక్షపార్టీల నేతలు..జగన్మోహన్ రెడ్డి రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగ విరుద్దంగా ఆర్డినెన్స్ ఇచ్చి... రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని.. పదవిలో ఉండే అర్హత...

దేశం ఆశ్చర్యపోయేలా తెలంగాణ ప్రజలకు తీపి కబురు: కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్.. తెలంగాణ ప్రజలకు త్వరలో ఓ తీపి కబురు చెబుతానని ప్రకటించారు. ఈ మాట ఆయన మామూలుగా చెప్పలేదు. దానికో విశేషణం జోడించారు. అదేమిటంటే.. తాను చెప్పబోయే తీపి కబురు...

బాల‌య్య ఇష్యూ: కేసీఆర్‌పై నెట్టేశారుగా!

`ఇండ్ర‌స్ట్రీ స‌మావేశాల‌కు న‌న్ను పిల‌వ‌లేదు` అన్న బాల‌య్య మాట - ప‌రిశ్ర‌మ‌లో కొత్త వివాదానికీ, కాంపౌండ్ రాజ‌కీయాల‌కు కేంద్ర బిందువు అయ్యింది. బాల‌య్య‌ని పిల‌వ‌క‌పోవ‌డం త‌ప్పే అని ప‌రిశ్ర‌మ‌లో చాలామంది పెద్ద‌లు తేల్చేస్తున్నారు....

ద‌ర్శ‌కేంద్రుడి ‘కాన్సెప్ట్’ ఏమిటి?

న‌మోః వేంక‌టేశాయ త‌ర‌వాత మ‌ళ్లీ మెగాఫోన్ ప‌ట్ట‌లేదు ద‌ర్శ‌కేంద్రుడు. ఆయ‌న సినిమాల‌కు దూరంగానే ఉంటూ వ‌చ్చారు. ద‌ర్శ‌కేంద్రుడు రిటైర్ అయిపోయార‌ని, ఆయ‌న ఇక సినిమాలు చేయ‌ర‌ని వార్త‌లొచ్చాయి. కానీ ఓ మంచి సినిమా...

HOT NEWS

[X] Close
[X] Close