హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ బూమ్‌తో ఉంది. కానీ ఇ యంగ్ టెక్ ప్రొఫెషనల్స్ మాత్రం ఇళ్లు కొనేందుకు ఆసక్తి చూపించడం లేదు. నాన్-బ్రాండెడ్ 2-3 BHK అపార్ట్మెంట్లు రూ. 1.2-1.5 కోట్లకు చేరుకున్నాయి, ఇది సగటు సాఫ్ట్ వేర్ ఉద్యోగి జీతానికి అందడంలేదు. ఏడాదికిరూ. 10 నుంచి 15 లక్షలు సంపాదించేవారు కూడా ఇప్పుడు ఇళ్లు కొనాలంటే భయపడుతున్నారు. ఇల్లు కొంటే EMIకే రూ. 80,000 నుంచి లక్షకు పైగా కట్టాల్సి ఉంటుంది. అందుకే చాలా మంది ఇళ్ల కొనుగోలు ఆలోచన వదిలేస్తున్నారు.
2010 నుంచి 2025 వరకు రేట్లు రెట్టింపు కన్నా ఎక్కువగా పెరిగాయి. విషాదం ఏమిటంటే వారి శాలరీల కన్నా ఎక్కువగా ఇళ్ల రేట్లు పెరుగుతున్నాయి. మధ్యతరగతి ప్రజలుతో పాటు.. యంగ్ టెకీలకూ .. అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టుల అవసరం కనిపిస్తోంది. రియల్ ఎస్టేట్ అనలిస్టులు 2025లో ధరలు మరో 15 శాతం పెరగవచ్చునని అంచనావేస్తున్నారు. కానీ అఫోర్డబుల్ సెగ్మెంట్ తగ్గిపోతోంది. గవర్నమెంట్ ట్యాక్స్ రిలీఫ్, సబ్సిడీలు అందస్తే వాటి గురించి రియల్ ఎస్టేట్ కంపెనీలు ఆలోచించే ఆకాశం ఉంది.
ఇల్లు కొనుగోలుదారుడు అంటే కనీసం కోటిన్నర పెట్టాల్సిందే అన్న పరిస్థితిని బ్రాండెండ్ అపార్టుమెంట్ తెచ్చాయి. ఇప్పుడు వాటి రేట్లు మూడు కోట్లకు చేరాయి. అన బ్రాండెడ్ అపార్టుమెంట్లే కోటిపైన చెబుతున్నారు. ఈ ధరలు దిగిరాకపోతే..హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. అనుకున్నంతగా పుంజుకోవడం కష్టమే.