అవినాష్ రెడ్డి అరెస్టుపై సీబీఐదే చాయిస్ !

అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలా లేదా అన్నది సీబీఐ ఇష్టం. ఈ మేరకు దర్యాప్తు సంస్థలకు న్యాయపరంగా ఎలాంటి ఆటంకాలు లేవు. అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండానే జూన్ ఐదో తేదీకి వాయిదా వేసింది. విచారణ ప్రారంభమైన తర్వాత ఇప్పుడు వాదనలు పూర్తయినా ఆర్డర్ ఇవ్వలేమని.. విచారణ జరుపుతున్న న్యాయమూర్తి స్పష్టం చేశారు. అందుకే సీజే బెంచ్ ముందు మెన్షన్ చేసుకోవాలని సూచించారు. దీంతో అవినాష్ లాయర్లు హుటాహుటిన సీజే బెంచ్ ముందు మెన్షన్ చేశారు.

ఈ కేసు విషయంలో ఇప్పటికిప్పుడు చేయగలిగిదేమీ లేదని.. విచారణ చేపట్టడం కుదరదని సీజే స్పష్టం చేశారు. వెకేషన్ బెంచ్ ముందు మెన్షన్ చేసుకోవాలన్నారు. కనీసం రెండు వారాలు అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని అవినాష్ లాయర్లు .. సీజేని కోరారు. సుప్రీంకోర్టులో ఈ కేసు విషయంలో కామెంట్లు చూసిన తర్వాత కూడా ఇలా ఎలా ఒత్తిడి చేస్తారని సీజే అవినాష్ లాయర్లను ప్రశ్నించారు. అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమన్నారు. తర్వాత ఈ పిటిషన్ విచారణ జరుపుతున్న న్యాయమూర్తి విచారణను.. జూన్ ఐదో తేదీకి వాయిదా వేశారు. సీబీఐ తన పని తాను చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

ముందస్తు బెయిల్‌ ఇస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టి వేసింది . ఇప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఎలాంటి నిర్ణయం జరగలేదు పైగా సీబీఐ తన పని తాను చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అంటే సీబీఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే చేసుకోవచ్చని చెప్పినట్లయిందని న్యాయవర్గాలు అంచనా వేస్తున్నాయి. సాంకేతికంగా న్యాయపరంగా అవినాష్ అరెస్టును అడ్డుకునే ఉత్తర్వులేమీ లేవు. అందుకే .. సీబీఐ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకోవాలంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు..ఇక సీబీఐదే ఆలస్యం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ : బాలకృష్ణ

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై సినీ పరిశ్రమ స్పందన తీరుపై చాలా విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు పాలనలో ఎంతో అభివృద్ధి సాధించిన సినీ పరిశ్రమ, అలాగే లబ్దిపొందిన చాలా...

జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్లేది నిజం – మోదీ, షాలతో భేటీ డౌట్ !

లండన్ లో ఉండి చంద్రబాబును అరెస్టు చేయించి ఇండియాకు రాక ముందే ఢిల్లీ పర్యటన పేరుతో ప్రచారం చేసుకుని మోడీ , షాలతో భేటీ అవుతారని ప్రచారం చేయించుకున్న జగన్ రెడ్డి తాపత్రయం...

చంద్రబాబుకు డబ్బు ముట్టినట్లు ఆధారాలున్నాయా ?: ఏసీబీ కోర్టు జడ్జి

చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్, అలాగే బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్లపై విచారణ ఏసీబీ కోర్టులో జరిగింది. ఉదయం చంద్రబాబు తరపు లాయర్ దూబే, మధ్యాహ్నం...

సుధీర్ బాబుకి ‘హంట్’ నేర్పిన గుణపాఠం

సుధీర్ బాబు 'హంట్' సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ అయ్యింది. కెరీర్ లో పలు ప్రయోగాలు చేసిన సుధీర్ బాబు.. హంట్ కూడా తనకు మరో ప్రయోగాత్మక చిత్రం అవుతుందని బలంగా నమ్మాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close