జగన్ మోహన్ రెడ్డి చూసి చదివే స్క్రిప్టులో పదాలు తప్పు దొర్లితే తడబడ్డాడు అనుకోవచ్చు. కానీ సీఎంగా చేసి విధానాల పరంగా కూడా ఆయన తప్పులు మాట్లాడితే ఆయన కావాలని అలా మాట్లాడుతూ అయినా ఉండాలి లేకపోతే ఆయన స్క్రిప్ట్ రైటర్ జగన్ కు ఏమీ తెలియదు అని బయట ప్రపంచానికి తెలిసేలా కుట్ర చేశాడని అని అయినా అనుకోవాలి. ప్రతీ సారి జగన్ విషయంలో అదే జరుగుతోంది. ఇవాళ కూడా అదే జరిగింది.
తాడేపల్లి క్యాంప్‌కు వచ్చినట్లుగా తెలియాలంటే కొంత మందితో సమావేశం ఏర్పాటు చేసి ప్రసంగించడం అనేది ఓ కామన్ కార్యక్రమంగా పెట్టుకున్నారు జగన్. ఆయన తాడేపల్లికి వచ్చారని.. కడప నుంచి కొంత మంది నేతల్ని పిలిపించి మాట్లాడారు. అందులో ఆయన ప్రసంగం విని ఇది కూడా తెలియదా .. అని అందరూ ఆశ్చర్యపోయారు. పరిశ్రమలకు భూములు టెండర్లు వేసి ఇస్తారని చెప్పుకొచ్చారు. లులుకు ఇచ్చిన భూమి విషయంలో ఈ కామెంట్లు చేశారు. జగన్ ఎన్ని కంపెనీలకు టెండర్లు వేసి భూములిచ్చారో గుర్తుందా?. లులు గ్రూప్ ఏదో అనామక కంపెనీ అయినట్లుగా మాట్లాడారు.. లులు అని లిల్లి అని సెటైరిక్ గా మాట్లాడానని అనుకున్నారు. కానీ ఆయనను చూసి పారిశ్రామిక వర్గాలే కాదు కాస్త తెలివి ఉన్న వాళ్లు కూడా జాలి పడతారని ఆలోచించలేకపోయారు.
ఇంకా టీసీఎస్ కంపెనీని ఊరూపేరూ లేని కంపెనీ అని చెప్పుకొచ్చారు. రూపాయికే భూమి ఇచ్చేస్తున్నారని అన్నారు. అదే పేరుతో కోటి రూపాయలకు భూమి ఇచ్చినా.. ఉర్సా కంపెనీకి కూడా రూపాయికి భూమి ఇచ్చారని అబద్దాలు చెప్పేశారు. ఈ సమావేశంలోనే జగన్ ఎప్పుడూ చెప్పే కబుర్లు చెప్పారు. టీడీపీ నేతలు బయట తిరగలేకపోతున్నారని కూడా చెప్పారు. అదే తాడేపల్లిలో కూర్చుని పదే పదే ఆ మాటలు చెబుతున్న ఆయన మాత్రం జనాల్లోకి రావడం లేదు.
టీడీపీ కార్యకర్తలకు కూడా.. ఆయన మాటల్ని ఎన్ని సార్లు ట్రోల్ చేయాలని లైట్ తీసుకునే పరిస్థితి వచ్చింది. బాగా మాట్లాడితే పొగిడేలా జగన్ తీరు మారిపోయింది. కనీసం స్క్రిప్ట్ రైటర్ని మార్చి.. మాజీ సీఎం అనే హుందాతనం తెచ్చుకోవాలన్న సలహాలు సొంత పార్టీ నేతల నుంచి వస్తున్నాయి. కానీ అవి జగన్ దగ్గరకు చేరవు.