జ‌గ‌న్ చెబుతున్న ఈ బాకీల లెక్క‌ల లెక్కేంటి..?

ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర ప్ర‌స్తుతం విజ‌య‌న‌గ‌రం జిల్లాలో కొనసాగుతోంది. నెల్లిమ‌ర్ల‌లో జ‌రిగిన స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ… మ‌రోసారి టీడీపీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు చేశారు. ప్ర‌తీ ఇంటికీ ఉద్యోగం ఇస్తాన‌నీ, లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తాన‌ని చంద్రబాబు నాయుడు అన్నాడా లేదా అంటూ ప్ర‌జ‌ల‌ను అడిగారు! ఎన్నిక‌ల ముందు ఈ పెద్ద మ‌నిషి ఇచ్చిన హామీ ప్ర‌కారం ప్ర‌తీ ఇంటికీ చంద్ర‌బాబు నాయుడు రూ. 1.08 ల‌క్ష‌లు బాకీ ప‌డ్డార‌ని చెప్పారు. ఎన్నిక‌ల‌కు నాలుగు నెల‌ల ముందు ఈ పెద్ద మ‌నిషి నిరుద్యోగ భృతి అంటూ మోసం చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌నీ, రెండు వేలు ఇస్తామ‌ని గ‌తంలో చెప్పి, ఇప్పుడు వెయ్యి రూపాయ‌లే చేతులో పెడుతున్నార‌నీ, ఒక్కొక్క‌రి పేరు మీదా ఏడాదికి రూ. 12 వేల చొప్పున దోచుకుంటున్నార‌నీ, శిక్ష‌ణ పేరుతో నిధులు కాజేస్తున్నార‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు.

ఇంత‌కీ జ‌గన్ చెబుతున్న ఈ లెక్క‌లేంటీ..? ఈ లెక్క‌ల వెన‌క లాజిక్ ఏది..? ప‌్ర‌భుత్వ ప‌థ‌కాల అమ‌లు విష‌యంలో ఇలా కూడా ఆలోచిస్తారా.. అనే ఆశ్చ‌ర్యం ప్ర‌జ‌ల నుంచే వ్య‌క్త‌మౌతోంది. నిరుద్యోగ భృతి హామీ గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ ఇచ్చిందే. దాని అమ‌లుపై మంత్రుల‌తో క‌మిటీలు వేసి, వివిధ రాష్ట్రాల్లో అధ్య‌య‌నం చేసి, ప్ర‌భుత్వాలు మారినా స‌రే ఈ ప‌థ‌కం కింద నిరుద్యోగుల‌కు అందాల్సిన సాయం నిరంత‌రాయంగా అందుతూ ఉండే విధంగా డిజైన్ చేశారు. అంతేకాదు, ఇంకోప‌క్క నిరుద్యోగుల‌కు నైపుణ్యాల శిక్ష‌ణ ఇస్తున్నారు. 2014లో ఇచ్చిన హ‌మీని నెర‌వేరుస్తున్నారు క‌దా! అయినాస‌రే, ఇంకా నెల‌కి రూ. వెయ్యి చొప్పున చంద్ర‌బాబు బాకీ ప‌డ్డార‌ని ప్ర‌జ‌లు అనుకుంటున్నార‌ని జ‌గ‌న్ లెక్క‌లు చెప్ప‌డం మ‌రీ విడ్డూరం. ఒక ప్ర‌భుత్వ ప‌థ‌కం అమ‌లు మొద‌ల‌య్యాక‌, అర్హుల‌కు దాని ఫ‌లాలు అంద‌డం లేదంటే అదొక అర్థ‌వంత‌మైన విమ‌ర్శ అవుతుంది.

ఒక ప్ర‌భుత్వం ప‌థ‌కం అమ‌లు త‌రువాత కూడా… ఇలా బాకీలు ప‌డ్డారు, ఇంటికి రూ. 25 వేల చొప్పున ఇవ్వాల్సిన‌వి ఎగవేశారు అంటూ జ‌గ‌న్ త‌ప్ప దేశంలో ఏ నాయ‌కుడూ ఇలాంటి అర్థంలేని లాజిక్ తో విమ‌ర్శ‌లు చెయ్య‌డు. రానురానూ జ‌గ‌న్ విమ‌ర్శ‌లు ఎలా ఉంటున్నాయంటే… పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం ఇప్ప‌టికే అయిపోవాలి, కాలేదు కాబ‌ట్టి ఆ ప్రాజెక్టు ఆయ‌క‌ట్టు కింద‌కి వ‌చ్చే భూముల్లో పండాల్సిన పంట‌ల‌న్నీ రైతుల‌కు చంద్ర‌బాబు బాకీ ఉన్నార‌ని అంటారేమో..! రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి ప్ర‌జ‌ల‌కు తెలుసు. కేంద్రం మొండి వైఖ‌రిని క‌ళ్లారా ప్ర‌తీ నిత్యం చూస్తున్నారు. విభజిత ఆంధ్రాకు ఆదాయ వ‌న‌రులు లేవు. ఇన్ని అన‌నుకూల ప‌రిస్థితుల మ‌ధ్య కూడా ఇచ్చిన హామీలు ఒక్కోటిగా నిల‌బెట్టుకుంటూనే వ‌స్తున్నారు. వ‌న‌రుల స‌మీక‌ర‌ణ‌లో కొంత ఆల‌స్యం అవుతోంది కాబ‌ట్టి, కాస్త ఆల‌స్యంగా ప‌నులు జ‌రుగుతున్నాయి. ప్ర‌జ‌లు ఈ కోణం నుంచి ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకుంటున్నారే త‌ప్ప‌… జ‌గన్ ఆలోచ‌న తీరు మాదిరిగా బాకీల లెక్క‌లు వెయ్య‌డం లేదు. ప్ర‌జ‌లు ప్ర‌తీదీ డ‌బ్బుల రూపంలోనే ఆశిస్తారు, సుపరిపాలన అంటే తాత్కాలిక ఆర్థిక ప్ర‌యోజ‌నాల లెక్క‌ల్నే చూసుకుంటార‌ని మాత్ర‌మే జ‌గ‌న్ ఆలోచించ‌గ‌లుగుతున్నార‌ని చెప్ప‌డానికి ఈ కాకిలెక్క‌ల విమ‌ర్శ‌లే సాక్షం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. ‘లేడీస్ స్పెష‌ల్’

ముందు నుంచీ... విభిన్న‌మైన దారినే వెళ్తున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. త‌ను ఎంచుకొనే ప్ర‌తీ క‌థా... తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఓవ‌ కొత్త జోన‌ర్ ని ప‌రిచ‌యం చేసింది. 'హ‌నుమాన్' తో పాన్ ఇండియా క్రేజ్...

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close