జగన్మోహన్ రెడ్డి తాను మరోసారి పాదయాత్ర చేస్తానని ఇంతకు ముందే చెప్పారు. తన అనుకూల మీడియాలో వేల కిలోమీటర్లు అని ప్రచారం చేయించుకున్నారు. కానీ కార్యకర్తల వద్దకే వెళ్లడం లేదు. కానీ ఇప్పుడు మళ్లీ యువజన వైసీపీ నేతల్ని పిలిపించుకుని మరోసారి అలాంటి కబుర్లే చెప్పారు. మీరంతా అద్భతంగా పని చేసుకుని .. మీ పనితీరును మీరే అసెస్ మెంట్ చేసుకుంటే.. మిమ్మల్ని పైకి తీసుకు వస్తానని హామీ ఇచ్చారు. పెరగాలంటే మీ చేతుల్లోనే ఉందని.. ఎదిగేలా తాను చేస్తానని జగన్ చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంలోనే తన పాదయాత్ర గురించిచెప్పారు. ఎన్నికలకు ముందు పాదయాత్ర ఉంటుందని.. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పర్యటనలు కూడా ఉంటాయన్నారు. అక్రమాస్తుల కేసుల్లో శిక్ష పడే సమయం వస్తే ఆయన పాదయాత్ర ప్రారంభమవుతుంది.. వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు దర్యాప్తు పూర్తి చేయడానికి సీబీఐకి సమయం ఇస్తే.. జిల్లాల యాత్రలు ప్రారంభమవుతాయి.. లిక్కర్ కేసులో ఈడీ అక్రమ సొమ్ము గుట్టురట్టు చేసి కొత్త కేసులు పెడితే.. జనంలోకి వెళ్లి రభస చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి తెలివి తేటలు అలాగే ఉంటాయి.
ఒక సారి షర్మిలతో పాదయాత్ర చేయించిన జగన్.. మరో సారి తాను చేశారు. ఆ పాదయాత్రను కూడా.. మూన్ వాక్ లా చేశారు. వారానికి ఐదు రోజులు చేసేవారు. కోర్టు వాయిదాలకు వెళ్లారు. మరో ఐదేళ్ల పాటు కోర్టు వాయిదాలకూ వెళ్లలేదు. ఇప్పుడు మళ్లీ పాదయాత్ర అంటున్నారు. అవసరం వచ్చినప్పుడు ఈ పాదయాత్ర అంశాన్ని తెరపైకి తెచ్చి.. లోపలేస్తారనుకున్నప్పుడు ఆయన జనంలో ఉంటానని హంగామా చేసే అవకాశాలు ఉన్నాయని యువనేతలు కూడా ఇట్టే కనిపెట్టేశారు.