జగన్ రెడ్డి సీబీఐ కోర్టుకు హాజరైనప్పుడు తోలుకొచ్చిన కార్యకర్తల్ని చూపించి ఎలివేషన్లు ఇస్తున్నారు వైసీపీ నేతలు. జగన్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా అలా తండోపతండాలుగా వచ్చేస్తూతంటారని అందులో వింతేం లేదని అంబటి రాంబాబు.. ఇలా ఎందుకు చేస్తున్నారని సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలకు కౌంటర్ గా సమాధానాలిచ్చారు. ఆయన మాటల ప్రకారం చూస్తే..తెలంగాణలో పార్టీ పెట్టినా .. సీఎం అయిపోతారు జగన్.
జగన్ ఎవరో తెలంగాణ ప్రజలు గుర్తు పడతారా?
డబ్బులు ఖర్చు పెట్టుకుని సమీకరించకపోతే.. వచ్చిన వాళ్లు అంతా తెలంగాణ కార్యకర్తలే అయితే ఇక .. జగన్ క్రేజ్ అక్కడ సూపర్ గా ఉందని.. అక్కడ కూడా పార్టీని యాక్టివేట్ చేసుకోవచ్చు. వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత శవాలను వెదుక్కుని… ఆదిలాబాద్ నుంచి చిత్తూరు వరకూ ఓదార్పు యాత్ర చేశారు. ఆ సమయంలో ఆయనపై సానుభూతి ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత జగన్ అనే వ్యక్తి ఎవరు అన్నది కూడా తెలంగాణ ప్రజలు మర్చిపోయారు. ఎందుకంటే ఆయనకు రాజకీయంగా తెలంగాణతో ఎలాంటి అనుబంధం లేదు. ఇక కేసీఆర్ తో లొల్లి ఎందుకని.. ఉమ్మడి రాష్ట్రంలో ఖమ్మంలో గెలిచిన ఎంపీ సీటు, ఎమ్మెల్యే సీట్లను బీఆర్ఎస్ కు అమ్మేసి అసలు ఆ సైడ్ చూడటమే మానేశారు . ఇక కార్యకర్తలు ఎక్కడి నుంచి వస్తారు?
మోకాళ్ల దండాలు పెట్టేందుకు అదనపు పేమెంట్ ఇస్తారా ?
జగన్ రెడ్డికి వచ్చింది నిజంగా హైదరాబాద్ కార్యకర్తలే అయితే..స్వచ్చందంగా వచ్చి ఉంటే ఆయన తన పార్టీని తెలంగాణలో యాక్టివేట్ చేయాలి. లేకపోతే ఆ కార్యకర్తలందర్నీ అన్యాయం చేసినట్లు అవుతుంది. విచిత్రం ఏమిటంటే.. కొంత మంది యువత ఎక్కడికెళ్లినా ఆయన కాన్యాయ్ ముందు.. మోకాళ్ల దండాలు పెడుతూంటారు. వాళ్లను రకరకాల యాంగిల్స్ లో ఫోటోలు తీస్తారు.
జగన్ పర్యటనకు కార్యకర్తల్ని ఎలా సేకరించారో అందరికీ తెలుసు. జగన్ రెడ్డికి ఉన్న మానసిక సమస్య కారణంగా తాను ఎక్కడికి వెళ్లినజనం రాకపోతే.. జనం తనను పట్టించుకోవడంలేదని ఆయన ఫీలవుతారు. అందుకే ఎక్కడిక్కడ అవసరం అయినప్పడల్లా ఇలా షో చేస్తారు. అందుకే ఏ కార్యక్రమం అయినా చివరికి వారం రోజులు తర్వాతే ప్లాన్ చేసుకుంటారు. జైల్లో పరామర్శకూ అంతే. ఎందుకంటే అప్పటికి జనాల్ని సమీకరిస్తారన్నమాట.
ఎందుకీ డ్రామాలు ?
జగన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీక్షలు చేసేవారు. ఆ దీక్షలకు కట్ట కట్టుకుని లీడర్లు వెళ్లేవారు. ఎక్కడికి వెళ్లినా వాళ్లే. చివరికి కార్యకర్తలు కూడావాళ్లే. అలా రొటేట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు అలా దీక్షలు చేయలేకపోయారు కానీ.. ఎక్కడికి వెళ్లినా వాళ్లను పిలిపించుకుని మోకాళ్ల దండాలు పెట్టించుకుంటున్నారు. యువత జీవితాలతో ఆడుకుంటున్నారు. ఆయన మానసిక రుగ్మత అలా పెరుగుతోందేమో కానీ రియాలిటీలోకి రావడంలేదు. అందరి ముందు చులకన అవుతున్నారు.

