రైతు భరోసా పథకం పేరు మారింది..!

రైతులకు పెట్టుబడి సాయం అందించే పథకానికి వైఎస్ఆర్ రైతు భరోసా అంటూ… విస్తృత ప్రచారం కల్పించిన ఏపీ సర్కార్ ఒక్క రోజు ముందుగా పేరు మార్చింది. ” వైఎస్ఆర్ రైతు భరోసా – పీఎం కిసాన్ సమ్మాన్” పేరుతో పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. రైతులకు పెట్టుబడి సాయంగా ఇవ్వాలనున్న మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వడంలేదు. కేంద్ర ఇప్పటికే అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ పథకాన్ని … రైతు భరోసాలో కలిపేసి.. ఆ సొమ్ములు కూడా తామే ఇస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. నికరంగా ఏపీ సర్కార్ ఇచ్చేది రూ. 7,500 మాత్రమే. దీంతో… బీజేపీ నేతల నుంచి తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. కేంద్రం ఇచ్చే సాయాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు గుప్పించారు. వైఎస్‌ఆర్‌తో పాటు మోడీ పేరు పెట్టాలని.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ లాంటి వాళ్లు లేఖలు కూడా రాశారు. కేంద్రానికి కూడా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో.. ఒక్క రోజు ముందు.. పథకం పేరులో “పీఎం కిసాన్” పేరు చేర్చారు.

భారతీయ జనతా పార్టీ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిని స్టిక్కర్ సీఎంగా అభివర్ణించడం ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇస్తున్న పథకం క్రెడిట్‌ను కూడా.. జగన్ కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ… విమర్శలు గుప్పిస్తోంది. ప్రధానితో జగన్మోహన్ రెడ్డి భేటీకి ఢిల్లీకి వెళ్లిన సమయంలో.. కన్నా కూడా.. ఏపీలో పరిస్థితులపై ఓ నివేదికను బీజేపీ అధ్యక్షుడు నడ్డాకు ఇచ్చారు. అందులో.. ఏపీ సర్కార్ తీరును వివరించారు. రైతు భరోసా పథకం పేరుపై ఫిర్యాదు చేశారు. ఈ విషయలాను జేపీ నడ్డా.. ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానితో జగన్ భేటీ ముగిసిన తర్వాత ఢిల్లీ నుంచి జగన్ సర్కార్.. పేరు మార్చాల్సిందేనని సూచన వచ్చినట్లుగా చెబుతున్నారు. దాంతో ఏపీ సర్కార్ వెనక్కి తగ్గలేదు. పేరు మార్చితే.. కేంద్రం ఆదేశాలను పాటించామని… విధేయంగా ఉంటామని… నమ్మకం కలిగించవచ్చని… వైసీపీ వర్గాలు ఆశ పడినట్లుగా తెలుస్తోంది.

అయితే… పీఎం కిసాన్ అనే పేరును.. రైతు భరోసాలో కలపడాన్ని ఏపీ సర్కార్… మనస్ఫూర్తిగా చేయలేదని మాత్రం స్పష్టమవుతుంది. ఒక్క రోజు ముందుగా.. పై స్థాయిలో వచ్చిన ఒత్తిళ్లు… కేంద్రంతో ఇప్పుడున్న సంబంధాలను మరింతగా దిగజార్చుకోలేని పరిస్థితులు ఏర్పడటం వల్లే తప్పనిసరిగా పేరును, పోస్టర్‌లో మోడీ ఫోటోను చేర్చాల్సి వచ్చింది. కానీ రోజువారీ వ్యవహారాల్లో.. ఇందులో కేంద్రం సాయం కూడా ఉందని.. చెప్పడానికి.. వైసీపీ అంగీకరించకపోవచ్చు. ఎందుకంటే.. జగన్ 2015లోనే రైతు భరోసా పథకాన్ని ప్రకటించారు. అప్పట్లోనే అధికారంలోకి వస్తే ఒకే సారి రూ. 12500 ఇస్తానని ప్రకటించారు. అప్పట్లో కిసాన్ సమ్మాన్ లేదు. ఇప్పుడు ఆ పథకంతో సంబంధం లేకుండా.. రూ. 12500 ఇవ్వాల్సిఉంది. కానీ భారాన్ని తగ్గించుకోవడానికి కేంద్ర పథకాన్ని వాడుకుటున్నారు. పథకంలో ప్రధాని పేరు కనిపించినప్పుడల్లా… లబ్దిదారులకు అదే గుర్తుకు వస్తుంది. అందుకే.. వీలైనంత వరకూ.. వైఎస్ఆర్ రైతు భరోసా పేరునే ప్రభుత్వ వ్యవహారాల్లో ఉపయోగించే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మరో మూడు నెలలు సీఎస్‌గా సహాని..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానికి మరో మూడు నెలల పొడిగింపు లభించింది. మామూలుగా ఆమెకు జూన్ 30వ తేదీతో రిటైర్ కావాల్సి ఉంది. అయితే.. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి...

ప్రజల కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తానంటున్న ఆనం..!

ప్రజల కోసం ప్రభుత్వాన్ని... అధికారులను నిలదీయడానికి సిద్దమని ప్రకటించారు వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి. అధికారులను సరే కానీ..ప్రభుత్వాన్ని నిలదీస్తామనే మాటే నెల్లూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అంతటితో వదిలి...

సుప్రీంకోర్టులోనూ ఏపీ సర్కార్‌కు మళ్లీ “రంగు పడింది”..!

ప్రభుత్వ కార్యాలయాలపై రంగుల విషయంలో ఎక్కడా లేని పట్టుదలకు పోయిన ఏపీ సర్కార్‌కు.. రెండో సారి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. నాలుగు వారాల్లో ప్రభుత్వ కార్యాలయాలపై రంగులు తొలగించకపోతే.. కోర్టు ధిక్కరణ చర్యలు...

డాక్టర్ సుధాకర్‌పైనా సీబీఐ కేసు..!

నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసు దర్యాప్తులో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. సీబీఐ ఆయనపైనా కేసు నమోదు చేసింది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు, బాధ్యత కలిగిన ఓ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రభుత్వ...

HOT NEWS

[X] Close
[X] Close