వైసీపీ అధినేత జగన్ రెడ్డికి అత్యున్నత స్థాయిలో క్రిమినల్ తెలివితేటలు ఉంటాయి. కానీ తానేం తప్పు చేయలేదని వాదించడానికి చిన్న పిల్లల తరహాలో వాదిస్తూంటారు. నమ్మించాలని ప్రయత్నిస్తూంటారు. బాగా డబ్బులు కొట్టేసిన వ్యక్తి .. దొరికిపోయే పరిస్థితి వస్తే.. ఇల్లు గడవడానికి కూడా డబ్బుల్లేవని నాటకాలాడతాడు. ఎందుకంటే దోచుకుంటే ఉండేవి కదా.. దోచుకోలేదని నమ్ముతారని. జగన్ రెడ్డి కూడా అాలాంటి చీప్ టెక్నిక్ ప్లే చేశారు.
ప్రెస్మీట్ పెట్టి తాను వెళ్ల గక్కాలనుకున్న ఆవేదన అంతా వెళ్లగక్కిన తర్వాత.. పార్టీని నడపపడానికి డబ్బుల్లేవని ఎవరైనా చందాలివ్వాలని అనేశాడు. ఆయన ఆ మాట అంటారని జర్నలిస్టులు ఊహించలేకపోయారు. ఆయన గురించి తెలిసిన వారు నవ్వాపుకున్నారు. బయట ఈ మాటలు విన్న వైసీపీ నేతలు .. మా అన్న వ్యూహం అదుర్స్ అనుకున్నారు. జగన్ రెడ్డి తనకు పేపర్లు, టీవీలు లేవంటారు. ఇటీవల భారతి సిమెంట్ కూడా తనది కాదన్నారు. ఇళ్లు, ఆస్తులు కూడా తన పేరున ఉండవు. పార్టీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ మాయమయ్యాయి. ఇప్పుడు తన దగ్గర అసలు డబ్బుల్లేవని చెబుతున్నారు.
జగన్ రెడ్డి అన్నీ బినామీ కథలే నడుపుతారు. సూట్ కేసు కంపెనీల్లో.. బంగారాల్లో పెద్ద ఎత్తున దాచి పెట్టారు. ఇప్పుడు వాటిని బయటకు తీసే ప్రయత్నాల్లోనే సీఐడీ ఉంది. జగన్ రెడ్డి దగ్గర డబ్బులు ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం బయట పెడతారు. భారతి సిమెంట్స్ లోకి బాలాజీ గోవిందప్ప ఎంత తీసుకెల్లారు?. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి కుటుంబసభ్యుల కంపెనీల్లో ఎంత దాచారు?. కొనుగోలు చేసిన వందల కిలోల బంగారం ఏ కలుగుల్లో ఉంది ? . అన్నీ బయటపెడతారు.
విరాళాలు ఇవ్వకపోతే పార్టీని మూసేస్తానని చెప్పి బెదిరించి పార్టీ నేతల దగ్గర చందాలు తొందరపడి వసూలు చేయడం కన్నా.. సీఐడీ అధికారులు మొత్తం బయట పెట్టేవరకూ ఎదురు చూస్తే.. కళ్లు బైర్లు కమ్మే సంపాదన బయటపడుతుందని సెటైర్లు వినిపిస్తున్నాయి.