తన ఆస్తిలో ప్రతి పైసా తాను సంపాదించుకున్నదే అని జగన్మోహన్ రెడ్డి తన తల్లి, చెల్లికి తేల్చి చెప్పారు. ఎన్సీఎల్టీలో ఉన్న కేసు విచారణలో జగన్ తన తరపు వాదనలు వినిపించారు. ఈ వాదనల్లో ఆయన చాలా క్లియర్ తాను సంపాదించుకున్నానని అందులో .. అంతా తన స్వార్జితమే కాబట్టి తల్లి, చెల్లికి వాటాలు అడిగే హక్కు లేదన్నారు. కేవలం ప్రేమతో కొన్ని ఆస్తులు ఇచ్చేందుకు ఎంవోయూ చేసుకున్నామని కానీ తర్వాత తన చెల్లి తనకు వ్యతిరేకంగా రాజకీయాలు చేయడంతో ఆ ప్రేమ పోయిందని అందుకే ఆ ఎంవోయూ రద్దు చేసుకున్నానని చెబుతున్నారు. ఆయన వాదనపై ఎన్సీఎల్టీ ఎలాంటి తీర్పు ఇస్తుందో కానీ ఈ కేసు ఆయనలో ఉన్న వికృతాన్ని అదే పనిగా బయటపెడుతోంది.
జగన్ ఎలా సంపాదించారు?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యే వరకూ జగన్ రెడ్డి ఓ సబ్ కాంట్రాక్టర్. ఆయన వ్యాపారం చేయడానికి డబ్బుల్లేవు. వైఎస్ అప్పుల పాలై హైదరాబాద్ లో ఉన్న ఇల్లు అమ్ముకోవడానికి ప్రభుత్వాన్ని పర్మిషన్ అడిగారు. ఆ స్థలం కమర్షియల్ గా అమ్ముకోవాలంటే ప్రభుత్వ అనుమతి అవసరం. అలాంటి పరిస్థితుల నుంచి సీఎం అయిన తర్వాత జగన్ కుబేరుడయ్యాడు. సండూర్ పవర్ అనే కంపెనీ నుంచి కంపెనీల మీద కంపెనీలు పుట్టించి.. ఊహించనంత మొత్తం సంపాదించారు. అన్నీ పెట్టుబడుల రూపంలో వచ్చి పడినవే. అంటే ప్రజా ఆస్తులను వారికి కట్టబెట్టి.. ప్రతిఫలంగా జగన్ పెట్టుబడుల రూపంలో లంచాలు తీసుకున్నారన్నమాట. అలా సంపాదించుకుని ఇప్పుడు.. అందులో తల్లి, చెల్లికి వాటా ఇవ్వాల్సి వస్తుందని తానే సంపాదించానని చెప్పుకుంటున్నారు.
తండ్రికి మాట ఇచ్చి తప్పుతున్న కుమారుడు
తన పదవిని అడ్డం పెట్టుకుని జగన్ దోచుకోవడానికి సహకరించిన వైఎస్.. అన్నీ కుమారుడికే కాదు.. కుమార్తెకూ సగం వాటా ఉండాలని అనుకున్నారు. ఆ ఆస్తుల వ్యవహారాలు చూస్తున్న విజయసాయిరెడ్డికి ఈ విషయం తేల్చి చెప్పారు. ఆయన కూడా టెక్నికల్ సమస్యల వల్ల అన్నీ జగన్ పేరు మీదే పెడుతున్నామని..షర్మిలకు సమాన వాటా వచ్చేలా చూస్తామని చెప్పారు. వైవీ సుబ్బారెడ్డి కూడా దీనికి సాక్ష్యంగా ఉన్నారని షర్మిల చెప్పారు. ఆ మేరకు ఇవ్వడానికి ఎంవోయూ చేసుకున్నారు. కానీ ఎక్కడ తేడా కొట్టిందో కానీ ఇవ్వడానికి నిరాకరించారు. ఫలితంగా షర్మిల పోరాటం చేస్తున్నారు.
నిజాయితీగా సంపాదించిన ఆస్తులు కాకపోయినా ఇదేం పద్దతి
జగన్ రెడ్డి నిజాయితీగా సంపాదించి ఉంటే.. తల్లి, చెల్లికి వాటా ఇవ్వాలా వద్దా అన్నది ఆయన కుటుంబ వ్యవహారంగా భావించేవారు. కానీ అక్రమంగా సంపాదించిన సొమ్మును కూడా ఆయన తల్లి, చెల్లికి ఇవ్వకుండా కోర్టుల చుట్టూ తిప్పడాన్ని .. కోర్టుల్లో వింత వాదనలు వినిపించడాన్ని అందరూ నోరెళ్లబెట్టి చూస్తున్నారు. ప్రజా జీవితంలో ఉన్న జగన్ మనస్థత్వం ఈ కేసుతో మరింతగా ఎక్స్ పోజ్ అవుతోంది.
