చైతన్య : కాళేశ్వరం ఓపెనింగ్‌కు వెళ్లొచ్చి ఇప్పుడు అక్రమం అంటారా..?

బేసిన్లు లేవు.. బేషజాలు లేవని కేసీఆర్ ఏడాది కింద డైలాగ్ కొట్టారు. జగన్ మాటలతో కాదు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి వెళ్లి చేతలతో తన మాట కూడా అదే అని నిరూపించారు. ఎందుకంటే… కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే… ఏపీ, తెలంగాణ ఎప్పటికీ.. భారత్, పాకిస్తాన్‌లా అయిపోతాయని.. ఆయన ప్రతిపక్ష నేతగా దీక్షలు కూడా చేసి.. గంభీరస్వరంతో హెచ్చరికాలు జారీ చేశారు మరి. అలా ఓ ప్రాజెక్టుపై నిప్పుల చెరిగిన జగనే.. అధికారం అందిన తర్వాత… అదే ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వెళ్లడం ఊహించలేని ఘటన. అయితే.. ఏడాది తిరిగే సరికల్లా..ఆ ప్రాజెక్ట్ అక్రమం అంటూ.. అదే జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆరోపణలు ప్రారంభించింది.

కాళేశ్వరం అక్రమం అయితే.. ఓపెనింగ్‌కు ఎలా వెళ్లారు..?

కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డికి అత్యధిక ప్రాధాన్యం లభించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక అభ్యంతరాలను మొదటి నుంచి వ్యక్తం చేస్తోంది. అది అనుమతి లేని ప్రాజెక్ట్ అని.. గోదావరి రివర్ బోర్డ్ దగ్గర చాలా కంప్లైంట్లు పెట్టింది. నీటి కేటాయింపులు లేకుండా… నికర జలాల సంగతి లెక్కచూడకుండా… ఎగువ రాష్ట్రమైన తెలంగాణ సర్కార్ ఏకంగా 200 టీఎంసీల నీటిని తోడుకుంటోందని.. ఏపీ అనేక ఫిర్యాదులు చేసింది. అవన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. ఏపీ అభ్యంతరాలన్నీ రికార్డెడ్. వాటన్నింటినీ ఉపసంహరించుకోలేదు. అవన్నీ అలా ఉండగానే.. సీఎం హోదాలో జగన్ ప్రారంభోత్సవానికి వెళ్లారు. దాంతో ఆ ప్రాజెక్టుపై ఏపీకి అభ్యంతరం లేదన్న ఫీలింగ్ అందరికీ వచ్చేసింది.

ఇప్పుడు ఏపీ సీఎం రిబ్బన్ కటింగ్‌నే తెలంగాణ సాక్ష్యంగా చూపిస్తే..!?

కాళేశ్వరంపై ఏపీ చెప్పే అభ్యంతరాలకు.. తెలంగాణ ప్రభుత్వం.. సీఎం జగన్.. ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చిన దృశ్యాలనే సాక్ష్యాలుగా చూపించే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి.. శిలాఫలకం కాళేశ్వరం వద్ద పెట్టడం వల్ల… ఏపీ నుంచి టేకిట్ గ్రాంట్‌గా.. తెలంగాణ …నీటిని వాడుకోవడాన్ని ప్రారంభించినట్లయింది. ఇది ఒక్కసారితో ఆగేది కాదు..తరతరాలుగా జరుగుతుంది. సీఎమ్మే.. వచ్చి… ఓపెనింగ్ చేశారని.. తెలంగాణ వాదిస్తుంది. కోర్టుల్లో.. అయినా.. కేంద్రం దగ్గర అయినా.. ఏపీ వాదనకు విలువ లేకుండా పోయే ప్రమాదం ఏర్పడింది.

కేసీఆర్ నీళ్లిస్తున్నారని అసెంబ్లీలో చెప్పి ..ఇప్పుడేంటి..?

ఎగువ రాష్ట్రంతో సఖ్యతగా ఉంటే.. కిందకు నీళ్లొస్తాయని జగన్ అసెంబ్లీలో నిర్మోహమాటంగా చెప్పారు. కేవలం 12 శాతం గోదావరి నీళ్లు మాత్రమే ఏపీలోకి వస్తున్నాయని .. ఐదు టీఎంసీలు మాత్రమే మన ఆధీనంలోఉంటాయని ప్రసంగించారు. కేసీఆర్ ఏపీకి నీళ్లిస్తున్నారని.. అసెంబ్లీలోనే చెప్పారు జగన్. కేసీఆర్ నీళ్లిస్తూంటే.. ప్రతిపక్ష పార్టీ వద్దంటున్నాయని… విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఏపీ నీళ్లను కేసీఆర్ ఇవ్వనన్నారేమో కానీ.. మా నీటిని మేం వాడుకుంటామంటూ.. జగన్ మోహన్ రెడ్డి.. హెచ్చరికలు పొరుగు రాష్ట్రానికి పంపుతున్నారు. ఏడాదిలోనే ఎందుకీ మార్పు. మొదట్లో వేసిన తప్పటడుగులు ఏపీకి శాపంగా మారుతాయని అప్పుడు ఎందుకు ఊహించలేకపోయారు…?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మీడియా వాచ్ : టీవీ9 నుంచి ఇంకెంత మంది బయటకు..!?

తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టీవీ9పై ఇప్పుడు రాజకీయ రంగు పడింది. అధికారానికి మడుగులొత్తే చానల్‌గా మారిపోయింది. అదే సమయంలో పాత చార్మ్‌ను కొద్ది కొద్దిగా కోల్పోతూ.. వెలిసిపోతూ...

“సీఎంఆర్ఎఫ్ విరాళాల”పై రేవంత్ గురి..!

తెలంగాణ సర్కార్‌ను ఇరకాటంలో పెట్టడానికి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొత్త తరహాలో ఆలోచిస్తూ ఉంటారు. కేటీఆర్ .. ఫామ్‌హౌస్ విషయాన్ని ప్రజల్లోకి చర్చకు పెట్టి టీఆర్ఎస్ ను కాస్త...

కేసీఆర్‌కు రామ్‌మాధవ్ బెదిరింపులేంటో..!?

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ అధికార, రాజకీయ కార్యకలాపాలకు త్వరలోనే ముగింపు తప్పదంటూ... బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ చేసిన హెచ్చరికలు ఇప్పుడు హైలెట్ అవుతున్నాయి. కరోనా విషయంలో... కాళేశ్వరం నిర్మాణ...

జగన్ పట్టుబట్టినా కర్ణాటకకే “మందాకిని”..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం .. కేంద్రానికి ఎంతగా సహకరిస్తున్నా... ఢిల్లీ సర్కార్ మాత్రం.. ఏపీ ప్రయోజనాలను కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఏపీకి కేంద్రం కేటాయిస్తుందని ఆశలు పెట్టుకున్న మందాకిని బొగ్గు గనిని కర్ణాటకకు...

HOT NEWS

[X] Close
[X] Close