విపక్షం అన్నాక రాజకీయం చేయడం కామన్. ప్రభుత్వం చేసే కొన్ని మంచి పనులను తన ఖాతాలో వేసుకోవడం రొటీన్. కానీ, అన్ని సందర్భాల్లో అలా చేయొచ్చా? అంటే చేయవద్దు. సున్నితమైన , భావోద్వేగాలతో కూడిన విషయాలపై మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. రాజకీయాన్ని వదిలేయాలి. కానీ, పులివెందుల ఎమ్మెల్యే జగన్ ఇందుకు పూర్తి భిన్నం.
ఎవరైనా చనిపోతే అక్కడికి పరామర్శ పేరుతో వెళ్లి రాజకీయం చేయడం పట్ల జగన్ పై ఇప్పటికే తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రతి చోట రాజకీయం చేయాలనుకునే స్వభావాన్ని విడిచిపెట్టాలని డిమాండ్లు వచ్చాయి. పైగా ఓదార్చాల్సిన చోట నవ్వుతూ ఉండటం కూడా జగన్ పై ఆగ్రహావేశాలకు మరో కారణం. తాజాగా మురళీ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన జగన్ అక్కడ అలాగే వ్యవహరించారు.
సరే , అదంతా ఆయన సహజ స్వభావం అని అనుకున్నారు. అంతలోనే ప్రెస్ ముందుకు వచ్చిన జగన్ రెడ్డి..అక్కడ కూడా రాజకీయం చేయడమే స్టార్ట్ చేశారు. మురళీ నాయక్ కుటుంబానికి 25లక్షలు పార్టీ తరఫున ప్రకటిస్తానని చెప్పి.. అంతలోనే కూటమి ప్రభుత్వం మురళీ కుటుంబానికి ప్రకటించిన 50లక్షల ఆర్థిక సాయం క్రెడిట్ ను కొట్టేసే ప్రయత్నం చేశారు.
గతంలో వీరజవాన్లకు ఆర్థిక సాయం ప్రకటించే సంప్రదాయాన్ని వైసీపీ అమల్లోకి తీచ్చిందని, దాన్ని కూటమి ప్రభుత్వం కొనసాగించడం సంతోషం అంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వకపూర్వం ఈ సంప్రదాయమే లేదని అబద్దాలు చెప్పుకున్నారు. అయినా పరామర్శకు వెళ్లి అక్కడ క్రెడిట్ కోసం ఆరాటపడటం, రాజకీయ అంశాలను ప్రస్తావించడం ఏంటని జగన్ పై విమర్శలు వస్తున్నాయి.