లిక్కర్ కేసు తన దగ్గరకు వస్తూండటంతో జగన్మోహన్ రెడ్డి టెన్షన్ కు గురవుతున్నారు. ఈ కేసులో భారతి పాత్ర కూడా ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తూండటంతో కేసు ఆ దిశగా మలుపు తిరుగుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. దీంతో ఏదో ఓ డీల్ చేసుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే జగన్ ఢిల్లీకి వెళ్తున్నారన్న ప్రచారం ప్రారంభించారు.
జగన్ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారన్నది వైసీపీ వర్గాలు చెప్పడం లేదు. తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని జంతర్ మంతర్లో తూతూ మంత్రం ధర్నా చేసి తనకు మద్దతుగా నేతల్ని పిలిపించుకుంటారా అన్నది చెప్పడం లేదు. వివిధ పార్టీల నేతల్ని కలిసి తమకు జరుగుతున్న వేధింపుల గురించి ఫిర్యాదు చేస్తారా అన్నదానిపైనా క్లారిటీ లేదు. కానీ ఢిల్లీ వెళ్తారని మాత్రం చెబుతున్నారు.
జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీకి పిసరంత పలుకుబడి లేదు. ఆయన తప్పుడు రాజకీయాల కారణంగా జాతీయ స్థాయిలో పాపం జగన్ అనేవారు లేరు . చివరికి మమతా బెనర్జీ కూడా ఆయనకు సపోర్టు చేసేందుకు సిద్ధంగా లేరు. తన పార్టీ నేతల్ని హత్యలు చేస్తున్నారని ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు ఇండియా కూటమి పార్టీలన్నీ వచ్చి సపోర్టు చేస్తే.. జగన్ కీలక సమయాల్లో వారికి హ్యాండిచ్చి ఎన్డీఏకు మద్దతు తెలిపారు. దీంతో జగన్ కు సపోర్టు చేస్తే తమ పరువు పోతుందని ఇతర పార్టీలు సైలెంటుగా ఉంటున్నాయి.
అధికారంలో ఉన్నప్పుడు జగన్ చేసిన నిర్వాకాలపై ఢిల్లీలోని ఇతర పార్టీల నేతలకూ అవగాహన ఉంది. అందుకే ఎవరికీ జగన్ పై సానుభూతి లేదు. రాజకీయాల్లో ఆయనో బ్యాడ్ ఎగ్జాంపుల్ అని.. ఆ నీడ పడకూడదని ఎక్కువ మంది అనుకుంటున్నారు. అందుకే జగన్ ఢిల్లీ వెళ్లినా తెర వెనుక డీల్స్ కోసం చీకట్లో చర్చలు జరపాల్సిందే కానీ ఒక్కరు కూడా బహిరంగ మద్దతు తెలియచేయరని అంటున్నారు. ఊరూ పేరూ లేని వారిని తీసుకొచ్చి సాక్షి పేపర్లో వేసుకోవాల్సిందేనని చెబుతున్నారు.