వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తన స్వార్థపూరిత, కుట్ర పూరిత రాజకీయాలు తన కుటుంబంపైనా చేసుకుంటున్నారు. అందుకే ఇప్పటికే రెండుగా కుటుంబం చీలిపోయింది. ఇప్పటి వరకు రాజకీయంగా మాత్రం ఇంకా మెజార్టీ వైఎస్ కుటుంబీకులు ఇంకా తాము జగన్ వెంటనే ఉన్నామన్న సంకేతాలు పంపించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోతోంది. యెడుగూరి.. సందింటి వాళ్లు రెండు వర్గాలవుతున్నారు. అత్యధిక మంది వేరే దారి చూసుకుంటున్నారు. చివరికి అవినాష్ రెడ్డి ఫ్యామిలీ తప్ప ఎవరూ జగన్ వెంట ఉండే అవకాశాలు కనిపించడం లేదు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ కుటుంబీకులతోనే టీడీపీ పాచికలు
పులివెందులలో టీడీపీ ప్రత్యేకమైన రాజకీయం చేస్తోంది. 2014-19 మధ్య సతీష్ రెడ్డి అనే లీడర్ ను నమ్ముకున్న టీడీపీ.. వందల కోట్లు పెట్టి అభివృద్ధి పనులు చేయించింది. ఆ లీడర్ .. నీళ్లు ఇచ్చే వరకూ జుట్టు తీయనని ముడేసుకుంటే…ఆ బాధ్యత చంద్రబాబు తీసుకుని గండికోట ప్రాజెక్టు పూర్తి చేశారు. అయితే ఆ సతీష్ రెడ్డి జగన్ తో కుమ్మక్కయ్యారు. ఫలితంగా పులివెందులలో టీడీపీ బలం పెరగలేదు. ఇప్పుడు టీడీపీ కూడా కేవలం అభివృద్ధినే కాదు.. రాజకీయాలు కూడా అవసరం అని భావిస్తోంది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ కుటుంబసభ్యులనే పాచికలుగా ఉపయోగించడానికి రెడీ అయింది.
జగన్కు గుడ్ బై చెప్పేందుకు సగం మంది రెడీ!
జగన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్న చాలా మంది ఇప్పటికే ఆయనకు దూరమయ్యారు. జగన్ కు సోదరుడు వరుస అయ్యే..గతంలో కమలాపురం ఇంచార్జ్ గా పని చేసిన దుష్యంత్ రెడ్డి అనే లీడర్ ఇప్పటికీ టీడీపీ ఫోల్డ్ లోకి వచ్చారు. ఆయన చాలా కాలంగా టీడీపీతో కలిసి నడుస్తున్నారు. ఇటీవల ఆయన కు డబ్బులివ్వాల్సిన వాళ్ల కోసం ఓ పోలీసు అధికారి కేసులు నమోదు చేయడం సంచలనంగా మారింది. జగన్ రెడ్డి సోదరుడికి ఇలా చేస్తారా అని పోలీసులపై విమర్శలు వచ్చాయి. అయితే ఆయన జగన్ రెడ్డి సోదరుడే అయినా టీడీపీ కోసం పని చేస్తున్నారని అందుకో లోకల్ నేతలు ఆ చాన్స్ ఇప్పించారని అంటున్నారు. దుష్యంత్ రెడ్డితో పాటు.. జగన్ కోసం ఇప్పటి వరకూ పని చేసిన చాలా మంది టీడీపీ పంచన చేరేందుకు రెడీ అయ్యారు.
మున్సిపల్, స్థానిక ఎన్నికల్లో జగన్ పరువు ఉండదు !
పులివెందుల అంటే జగన్మోహన్ రెడ్డి పరువు లాంటిది. ఆయన తండ్రి .. కంచుకోటగా మార్చి నియోజకవర్గాన్ని ఇచ్చిపోయారు. అన్నింటిని కుప్పకూల్చుకున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ఈ కోటను కూడా నిర్వీర్యం చేసుకుంటున్నారు. మున్సిపల్, స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. గట్టి షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందుకు జగన్ కుటుంబసభ్యులే కీలకం కానన్నారు. అదే జరిగితే..ఇప్పటికే పగుళ్లిచ్చినా జగన్ రెడ్డి రాజకీయ పునాదులు కదిలిపోతాయి. కనీసం కుటుంబాన్ని కలిపి ఉండలేని నాయకత్వం రాజకీయ పార్టీని ఏమి నడిపిస్తుంది. ఇప్పటికే నీటి సంఘాల ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు.