ఫాదర్స్ డే సందర్భంగా పులివెందుల ఎమ్మెల్యే జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని స్మరించుకున్నారు. అన్ని విషయాల్లో మీరు ఆదర్శం..రోల్ మోడల్. నా ప్రతి అడుగులో మీరే స్ఫూర్తి.. హ్యాపీ ఫాదర్స్ డే అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు జగన్. వైఎస్సార్ ను గుర్తు చేసుకున్న ఆయన..తల్లికి మాత్రం ఈ ఏడాది కనీసం పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా చెప్పలేదని గుర్తు చేస్తున్నారు నెటిజన్లు.
జగన్.. తండ్రి చరిష్మాను రాజకీయ అవసరాల కోసం మాత్రమే వాడుకుంటున్నారన్న విమర్శలు సొంత చెల్లి షర్మిల ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఫాదర్స్ డే రోజు తండ్రిని గుర్తు చేసుకున్న జగన్ వై, వైఎస్సార్ కు వారసుడు మాత్రమే. ఆయన రాజకీయ వారసత్వానికి కాదంటూ చురకలు అంటిస్తున్నారు నెటిజన్లు.
ఆస్తి కోసం సొంత తల్లిపై కోర్టుకెక్కిన జగన్…తండ్రిని ఎలా స్మరించుకుంటారు? ఆయనకు ఆ అర్హత ఉందా? అనే ప్రశ్నలను తెరమీదకు తెస్తున్నారు. ఓ వైపు ఆస్తి కోసం తల్లిని అవమానిస్తూ, మరోవైపు తండ్రిని ప్రార్థిస్తున్నారు అంటే అదంతా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే అంటూ జగన్ వైఖరిని తూర్పారబడుతున్నారు.
జగన్ కు రక్తసంబంధాల గురించి ఏమాత్రం తెలియదని, తెలిసిందిల్లా రాజకీయమేనని ఇటీవల షర్మిల చేసిన కామెంట్స్ ను ఉదాహరిస్తూన్నారు.