వాస్తు మార్పులు – ముహుర్తాల తతంగాలు..! జగన్‌నూ నమ్మకాలే నడిపిస్తున్నాయి..!

రాష్ట్ర పరిపాలనకు కేంద్ర బిందువైనా సచివాలయంలో నూతన సీఎం వైఎస్ జగన్‌ తొలిసారి అడుగుపెట్టేందుకు ముహుర్తం ఖరారు అయింది. జూన్ 8న ఉదయం 8:39కి తన ఛాంబర్‌లోకి జగన్ ప్రవేశించనున్నారు. ఇప్పటికే సచివాలయంలో వాస్తు మార్పులు చేస్తున్నారు. మొదటి బ్లాక్ లో సీఎం చాంబర్, ఇతర బ్లాక్ లు, జగన్ వచ్చే మార్గం వంటి అంశాలను రెండు రోజుల క్రితం వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. సీఎం చాంబర్ కు కూడా వెళ్లి కలియ తిరిగారు. ప్రమాణ స్వీకారం గురువారం చేశాక… శుక్రవారం జగన్‌ సచివాలయానికి వస్తారని అందరూ భావించారు. కానీ కొన్ని వాస్తు కారణాలతో జగన్‌ సచివాలయానికి వెళ్లలేదు. సోమవారం సచివాలయానికి వెళ్లాలంటే అదే రోజు అమావాస్య కావడంతో….మంచిరోజు చూసుకుని వెళ్లాలని పండితులు సలహా ఇచ్చారు.

జగన్ శుక్రవారం ఇంటివద్దనే ఉన్నప్పటికీ కొంతమంది అధికారులు మాత్రమే జగన్‌ను కలిశారు. నూతన డీజీపీగా నియమితులైన గౌతమ్ సవాంగ్, ఆర్థిక శాఖ అధికారులతో జగన్ సమావేశమయ్యారు. శని, ఆది రోజుల్లో సచివాలయానికి సెలవు కావడంతో అధికారులను ఇబ్బందిపెట్టడం ఎందుకనే భావనలో జగన్‌ ఉన్నారు. రేపటి నుండి ఆరు శాఖలపై ఇంట్లోనే సమీక్ష చేయనున్నారు. ఏపీలో అనేక భారీ ప్రాజెక్ట్ ల ప‌నులు, అమ‌రావ‌తి రాజ‌ధాని ప‌నులు, జ‌ల‌వ‌న‌రుల శాఖ‌లో అనేక కీల‌క ప్రాజెక్ట్ లు వంటి ప‌నులు న‌డుస్తున్నాయి. అదే స్థాయిలో ఎపి తీవ్ర అర్థిక ఇబ్బందులు ఎదుర్కోంటుంది. వేల కోట్లతో చేసిన ప‌నుల‌కు బిల్లులు చెల్లింపులు చేయాల్సి ఉంది. అలాగే నవరత్నాలపైనా దృష్టి పెట్టాల్సి ఉంది. ఆరో తేది వ‌ర‌కు వ‌రుస‌గా శాఖ‌ల వారిగా స‌మీక్షల షెడ్యూల్‌ను ఖరారు చేశారు. శనివారం రాష్ట్ర అర్ధిక ప‌రిస్థితుల‌పై స‌మ‌గ్రంగా ఆర్ధిక శాఖ‌తో చర్చించనున్నారు. ఆదాయార్జన శాఖలైన ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్, మైనింగ్, అట‌వీ, క‌మ‌ర్షియ‌ల్ టాక్స్ శాఖలపై స‌మీక్షించ‌నున్నారు. ఆరో తేదీన సీఆర్డీఏపై సమీక్ష చేస్తారు.

రాజధాని నిర్మాణం, ఆర్థిక శాఖ, పోలవరం పురోగతి, జలవనరుల శాఖ కింద చేపట్టిన ప్రాజెక్టులు, పెండింగ్ బిల్లుల విడుదల, అంశాలపైనే సీఎం జగన్‌ తొలుత సమీక్షలు చేయనున్నారు. ఆ తర్వాత నవరత్నాల అమలు, ఆగస్టు 15వ తేదీ నాటికి గ్రామాల్లో 50 ఇళ్లకు ఒకరు చొప్పున వాలంటీర్ల నియామకంపై దృష్టిపెట్టనున్నారు. మొత్తానికి వచ్చే వారంలో.. పాలనా యంత్రాగాన్నీ గాడిలో పెట్టడంతో పాటు అసెంబ్లీ సమావేశాల్లో శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం కోసం రెండు మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో జగన్‌ ఉన్నారు. అన్నీ నమ్మకల ప్రకారమే చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close