పార్టీ నాయకులు కష్టాల్లో ఉంటే .. వరుసగా తన నిర్వాకాల వల్ల అరెస్టు అవుతూంటే కనీస న్యాయసాయం లేదా.. నైతిక మద్దతు లేదా.. కుటుంబానికి అండగా ఉండే ప్రయత్నం చేయని జగన్.. అప్పుడప్పుడు మాత్రం మనకూ టైం వస్తుందని.. మనం కూడా సినిమాలు చూపిద్దామని అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా చేసిన పరిపాలన వల్ల.. అదికారం ఉందనే అహంకారంతో చూసిన , చూపించిన సినిమాల వల్లే ఇప్పుడు ఈ గతి పార్టీ నేతలకు పట్టింది. మళ్లీ అధికారం వస్తుందో రాదో కానీ.. మనకూ టైం వస్తుందని టైంపాస్ కబుర్లు చెప్పి.. పార్టీ నేతల్ని సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తున్నారు.
జగన్ రెడ్డి ఓ సైకిల్ లో తనకు మళ్లీ అధికారం వస్తుందని గట్టి ఆశలు పెట్టుకున్నారు. ఏం చేయకపోయినా చాలని అనుకుంటున్నారు. ఇలాంటి రాజకీయ మనస్థత్వం ఉన్న వారికి లక్ బై చాన్స్ ఓ అవకాసం వస్తుంది కానీ..ఆ తర్వాత పాతాళం నుంచి రావడం అసాధ్యమని అనేక ఉదంతాలు చెప్పాయి. ఓ వైపు కేసులు ముంచుకొస్తూంటే.. మరో వైపు అక్రమాస్తుల కేసుల్లో శిక్షపడే అవకాశం కనిపిస్తూంటే.. మనకంటూ ఓ రోజు వస్తుందని అప్పుడు సినిమాలు చూపిద్దామని చెబుతున్నారు.
జగన్ రెడ్డి వ్యవస్థల్ని ఇప్పటికీ తక్కువ అంచనా వేస్తున్నారు. జరుగుతున్న పరిణామాలేమిటో.. గతంలో తాము ఏం చేశారో.. ఇప్పుడు ఎందుకు ఇలా తమ మెడకు చుట్టుకుంటున్నాయో ఆయనకు అర్థం కావడం లేదు. పదవులు ఇచ్చాం .. అనుభవించారు కాబట్టి.. ఇప్పుడు జైలుకు వెళ్తున్న వారెవరికీ సాయం చేయాల్సిన పని లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వంశీ సహా ఎంతో మంది జైళ్ల నుంచి బయటకు రాలేకపోతూంటే.. వైసీపీ అగ్రనేతలు నిస్సహాయులుగా ఉన్నారు. కాపాడేందుకు ఎలాంటి ప్రయత్నమూ చేయడం లేదు. కనీసం లాయర్ నిరంజన్ రెడ్డితోనూ వాదించేందుకు ఏర్పాట్లు చేయడం లేదు.