జగన్ రెడ్డి సర్వం కోల్పోయారు. ఆయనకు జన్మనిచ్చిన తల్లి అండగాలేదు. పార్టీ కోసం పని చేసిన చెల్లి లేదు. తోబుట్టువు లేదు. తనను కుబేరుడ్ని చేసిన ఆడిటర్ విజయసాయిరెడ్డి లేరు.. చివరికి జగన్ రెడ్డికి వ్యక్తిత్వమూ లేదు. ఒక్క సారి జగన్ రెడ్డి తాను ఏంటి.. తన పరిస్థితి ఏంటి.. ఎక్కడి నుంచి ప్రారంభించి.. ఎక్కడికి వచ్చాను అని వెనక్కి తిరిగి చూసుకుంటే తన మీద తానే “ ఛీ నా మొహం మీ కాకి రెట్ట వెయ్య” అని తిట్టుకుంటారు. ఎందుకంటే ఆయన సర్వం కోల్పోయారు.
ఏం మిగిల్చుకున్నావ్ జగన్ రెడ్డీ !
తండ్రి హఠాత్తుగా చనిపోయాడు. ఆ మరణంతో రాజకీయం చేశారు. అయినా అది రాజకీయం అని సరి పెట్టుకున్నారు. వైఎస్ పెద్దరికాన్ని ఆయన చేతుల్లో పెట్టారు.కానీ ఏం చేశాడు.. మొత్తం నిర్వీర్యం చేసుకున్నాడు. అంతా తనకే కావాలన్న అత్యాశతో కుటుంబ పునాదుల్ని చెల్లా చెదురు చేసుకున్నాడు. ప్రజా జీవితంలో ఎవరూ చేయడానికి సాహసించని తప్పుల్ని చేశాడు. అక్రమాస్తుల కోసం..అప్పటికే ఒప్పందంగా రాసిచ్చిన వాటి కోసం తల్లి, చెల్లిపై కోర్టుకెళ్లాడు. తోడునీడలా ఉండి.. ఇంత పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టుకోవడానికి కారణం అయిన విజయసాయిరెడ్డిని కూడా కోల్పోయారు. ఇప్పుడు ఆయనకు భార్య , సజ్జల మాత్రమే ఉన్నారు. సజ్జల ఇక జగన్ తో లాభం లేదనుకుంటే రేపట్నుంచి అటు వైపు కనిపించరు. జగన్ జైలుకెళ్తే పార్టీని నడిపించుకోవాలని ఆయన భార్య ఆసక్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అంటే జగన్ రెడ్డి ఏం కోల్పోయారో అర్థం అవదా ?
అందర్నీ చంద్రబాబు ఖాతాలోకి వేసి వ్యక్తిత్వమూ కోల్పోయిన జగన్
తన కోసం పని చేసిన వారిని, తల్లిని, చెల్లిని, విజయసాయిరెడ్డిని జగన్ సరిగ్గా చూసుకోకపోవచ్చు. వారు బయటకు వెళ్లిపోయి ఉండవచ్చు. కానీ ప్రజా జీవితంలో ఉన్న నాయకుడిగా వారిని గౌరవించాల్సిన బాధ్యత జగన్ రెడ్డిపై ఉంది. వారిని గౌరవించినట్లుగా అయినా కనిపించాలి. కానీ జగన్ రెడ్డి నిస్సంకోచంంగా సిగ్గుపడకుండా.. వారంతా చంద్రబాబు మనుషులని వాదిస్తున్నాడు. తల్లి, చెల్లి, విజయసాయిరెడ్డి జగన్ రెడ్డి కోసం ఏం చేశారో బయటకు తెలిసింది మాత్రమే కాదు.. బయటకు తెలియనిది కూడా జగన్ కు తెలుసు. అయినా వారిపై చంద్రబాబు ముద్ర అంత తేలికగా ఎలా వేయగలిగారు?. ఇలా చేసి జగన్ రెడ్డి వ్యక్తిత్వం ఏమిటో అందరికీ తెలిసేలా చేశారు.
చివరికి అక్రమాస్తుల సొమ్ము కూడా మిగలదు !
జగన్ రెడ్డి తనకు ఆస్తులన్నాయని చాలని అనుకుంటారమో.. చివరికి ఆయన సర్వం కోల్పోతారు. ఇప్పటికే పోగొట్టుకోకూడని మానవ సంబంధాలను.. వ్యక్తిత్వాన్ని పోగొట్టుకున్నారు. ఆస్తులు కూడా ఆయన వద్ద ఉండవు. ఎందుకంటే అవన్నీ బినామీల పేర్ల మీద సూట్ కేసు కంపెనీల పేర్ల మీద ఉన్నాయి. చట్టాలను మరీ తక్కువగా అంచనా వేయలేరు. ఆస్తులు కూడా కోల్పోయి రోడ్డు మీద పడే రోజు ఉంటుంది. అప్పుడు కూడా జగన్ తానేం కోల్పోయానో తెలుసుకుంటారో లేదో ?. తెలుసుకున్నా ప్రయోజనం ఉండదు. ఎవరు జాలి కూడా చూపించరు.