మాజీ సీఎం రోశయ్యతో పాటు వంగవీటి రంగా జయంతి నేడు. ఈ విషయాన్ని మాజీ సీఎం జగన్ రెడ్డి ప్రత్యేకంగా గుర్తు పెట్టుకుని సోషల్ మీడియాలో గుర్తు చేసుకున్నారు. వారిద్దరూ మహనీయులు అన్నారు. జగన్ రెడ్డి ట్వీట్లు ట్రోలింగ్ గురవుతున్నాయి. ఎందుకంటే వారి విషయంలో జగన్ రెడ్డి వ్యవహరించిన తీరును ఎవరూ అంత వేగంగా మర్చిపోలేరు మరి.
వైఎస్ చనిపోయాక రోశయ్యను సీఎంను చేశారని ఆయనపై జగన్ పగబట్టారు. ఆయనను కుదురుగా పదవిలో ఉండనివ్వలేదు. చివరికి తన వల్లా కాదని ఆయన రిటైర్ అయిపోవాల్సి వచ్చింది. తర్వాత ఆయన చనిపోయినా పట్టించుకోలేదు. సంతాపం తెలుపలేదు. వెళ్లి చూడలేదు. అసెంబ్లీలో గౌరవసూచకంగా తీర్మానం కూడా చేయలేదు. ఆయనను చనిపోయిన తర్వాత కూడా శత్రువుగానే చూశారు. అది జగన్ మైండ్ సెట్. ఇక వంగావీటి మోహన రంగాను.. వైసీపీ నేత గౌతంరెడ్డి అత్యంత ఘోరంగా కించ పర్చితే.. దొంగ సస్పెండ్ చేసి.. పార్టీలో పదవుల్ని ఇచ్చారు. తర్వాత టిక్కెట్ ఇచ్చారు. అధికారంలో ఉన్న కాలంలో పదవి కూడా ఇచ్చారు. వంగవీటి రంగా కుమారుడు రాధాను తీవ్రంగా అవమానించి.. రాజకీయ జీవితాన్ని రోడ్డున పడేశారు.
ఇలాంటి ఘోరమైన వ్యక్తిత్వం ఉన్న ఆయన.. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం మహనీయులు అనేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. అందుకే నెటిజన్లు జగన్ రెడ్డి రోశయ్య, వంగవీటి రంగా విషయంలో చేస్తున్న అతి చూసి.. ట్రోలింగ్ చేస్తున్నారు. తన వ్యక్తిత్వాన్ని కప్పి పుచ్చుకునేందుకు చేసే ఇలాంటి ట్వీట్ల వల్ల కామెడీ అవుతారు కానీ.. మంచోడని ఎవరూ అనుకోరని వైసీపీ వర్గాలు కూడా అంటున్నాయి.