జగనన్న రాజ్యం శాంపిల్స్ : మహా టీవీ ప్రసారాలు నిలిపివేత, ఈసీకి ఫిర్యాదు

అధికారంలోకి వచ్చేస్తున్నామన్న ధీమా తో వైఎస్ఆర్ సీపీ నేతలు జగనన్న రాజ్యం ఒకవేళ వస్తే ఎలా ఉంటుందో ప్రజలకు శాంపిల్స్ చూపిస్తున్నారు. ఇంకా అధికారం లోకి రాకముందే తమకు నచ్చని మీడియా పై ఉక్కుపాదం మోపుతున్నారు. కర్నూలు, కడప జిల్లాలోని చాలా ప్రాంతాలలో మహా టీవీ ప్రసారాలు నిలిచిపోయాయి. వైఎస్సార్సీపీ నేత లో ఎమ్ ఎస్ వో ల మీద, కేబుల్ ఆపరేటర్ ల మీద ఒత్తిడి తెచ్చి ప్రసారాలు ఆపివేశారు అంటూ మహా టీవీ పొలిటికల్ ఎడిటర్ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై ఈ ఛానల్ లో ఈరోజు ప్రైమ్ టైం డిబేట్ కూడా నిర్వహించబడింది.

తెలుగు రాష్ట్రాల్లోని చాలా మీడియా చానళ్లు కొన్ని రాజకీయ పార్టీలకు వంతపాడుతూ పక్షపాతంతో వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. సరిగ్గా ఎన్నికలకు రెండు నెలల ముందు నుండి దాదాపు చాలా ఛానల్ లు వైఎస్సార్సీపీపై, జగన్ పై పాజిటివ్ కథనాలు ఇస్తూ, ఆ పార్టీ మీద వస్తున్న ఆరోపణలను, ఆ పార్టీ చేస్తున్న నెగటివ్ పనులను చూపించడం మానివేయడం పై కూడా రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్సీపీ నేత జగన్ మిగతా చానల్స్ లో కొన్నింటిని ప్రలోభ పెట్టిన కారణంగానే ఆ చానల్స్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటూ మీడియా సర్కిల్స్ లో కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

కర్నూలు, కడప జిల్లాలోని చాలా ప్రాంతాలలో నిలిచిపోయిన మహా టీవీ ప్రసారాలు , ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు:

అయితే మహా టీవీ లో మాత్రం, వైఎస్సార్ సీపీ అభ్యర్థుల నేర చరిత్ర , వారి మీద అధికారికంగా ఉన్న కేసులకు సంబంధించిన కథనాలు ప్రసారమయ్యాయి. దీంతో వైఎస్సార్సీపీ పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ, తాము బలంగా ఉన్న కర్నూలు కడప జిల్లాలలో రాజకీయ నాయకుల ద్వారా ఎమ్ ఎస్ వో ల మీద ఒత్తిడి తీసుకువచ్చి మహా టీవీ ప్రసారాలను నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. కీలకమైన ఎన్నికల సమయంలో ఒక ఛానల్ ప్రసారాలను ఒక రాజకీయ పార్టీ నిలిపివేయడం ఎంతవరకు సమంజసం అంటూ మహా టివి వైయస్ఆర్సీపీ కి వ్యతిరేకంగా ఎన్నికల కమిషన్ను ఆశ్రయించింది. ఎన్నికల కమిషన్ తో పాటు డీజీపీ కి కూడా ఫిర్యాదు చేసినట్లు మహా టీవీ పొలిటికల్ ఎడిటర్ చెప్పుకొచ్చారు.

ఏది ఏమైనా ఒకవేళ వైయస్ఆర్సీపీ గెలిస్తే, పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అన్నదానికి వైఎస్ఆర్ సీపీ నేతలు ముందుగానే శాంపిల్స్ చూపిస్తున్నట్లుగా అర్థమవుతుంది.

ఇప్పటి వరకే చూపించిన జగనన్న రాజ్యం శాంపిల్స్ మరికొన్ని ఈ విధంగా ఉన్నాయి:

– నరసాపురం వై ఎస్ ఆర్ సి పి ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు ఫుల్లుగా మద్యం సేవించి భీమవరం లో ఇచ్చిన స్పీచ్ కి సంబంధించిన వీడియో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అయింది

– ఇదేం రఘురామకృష్ణంరాజు కులాల మీద అ వెటకారంగా వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడిన మరొక వీడియో కూడా రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అయ్యింది.

– వైఎస్ఆర్ సీపీ గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి, వైఎస్సార్సీపీ తరపున ఎంపీ గా పనిచేసిన వరప్రసాద్ ఫుల్ గా తాగి, రోడ్ల మీద వెళుతున్న వాళ్లను విచిత్రంగా ఓట్లు అడుగుతున్న వైనం కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.

– భీమడోలు లో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, పార్టీ సభ పూర్తయిన అనంతరం మద్యం పంపకాల్లో తేడా వచ్చి రోడ్ల మీదే కొట్టుకున్న వీడియో రాష్ట్ర ప్రజలని అవాక్కయ్యేలా చేసింది.

– విశాఖలో ఒక గర్భిణిని వైయస్సార్సీపి పార్టీకి ఓటు వేయను అని చెప్పినందుకు వేధించిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

– వైఎస్ఆర్సిపి నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఒక సభలో మాట్లాడుతూ, ” మన ముందున్న ఆప్షన్ చంపడమా , చావడమా అన్నది మాత్రమేనని, జగనన్న ఒక్క సైగ చేస్తే, ఎవరూ మిగలకుండా చేస్తామని” ఆవేశపూరితంగా వ్యాఖ్యానించిన వ్యాఖ్యల కి సంబంధించిన వీడియో కూడా అ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

– ఇక ఆరు వేల కోట్లకు కాదు కేవలం 300 కోట్లకు మాత్రమే బ్యాంకుల కి ఎగనామం పెట్టానని, నరసాపురం వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు ( ఈమధ్య ఈయనని నరసాపురం మాల్యా అంటున్నారు) టీవీ9 ఇంటర్వ్యూలో చెప్పిన విషయం వైరల్ అవుతూ ఉండగానే, వై ఎస్ ఆర్ సి పి లో ఇటీవలే చేరిన మోహన్ బాబు కి చెక్ బౌన్స్ కేసులో కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది.

ఏది ఏమైనా కీలకమైన ఎన్నికల సమయంలో, గెలుస్తామన్న ధీమాతో వైయస్సార్ సిపి నాయకులు చూపిస్తున్న శాంపిల్స్ జనాలకు దడ పుట్టిస్తున్న మాట మాత్రం వాస్తవం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close