చైతన్య : తెలుగు మీడియంపై కాదు.. తెలుగు మీడియాపై కసి..!

వచ్చే విద్యా సంవత్సరం నుంచి.. ఏ స్టేజ్‌లోనూ… తెలుగు మీడియంలో చదివే విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌లో ఉండరు. ఓ సబ్జెక్ట్‌గా మాత్రమే తెలుగు చదువుతారు. ఇప్పుడు ఇంగ్లిష్‌ను ఎలా బట్టీ పడుతున్నారో.. అప్పుడు మాతృభాషను చదవడానికి అలా బట్టీ పడతారు.. ఓ పదేళ్ల తర్వాత… తెలుగు వచ్చిన వాళ్లు… అతి తక్కువగా ఉండే జనరేషన్.. స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత… తెలుగు మాట్లాడటమే కానీ.. చదవడం.. రాయడం వచ్చిన వాళ్లు అదృశ్యమవుతారు. దీని వల్ల ఏం జరుగుతుంది..? తెలుగు మీడియాకు గడ్డు కాలం ప్రారంభమవుంది. ఈ ముందు చూపుతోనే…ఇప్పుడు ఏపీలో అసలు కథ జరుగుతోంది.

తెలుగు మీడియా పీక పిసకడానికే ఇంగ్లిష్ మీడియం..!

జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా ఎందుకు.. ఇంగ్లిష్‌ మీడియంపై ఇంత ప్రేమ చూపిస్తున్నారు…? సరైన చర్చ లేకుండా.. ఎందుకు ఒక్క సారిగా హఠాత్తుగా నిర్ణయం ప్రకటించారు..? గతంలో చంద్రబాబు పరిమితంగా ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెడితేనే.. సొంత మీడియా దండెత్తేలా చేసిన ఆయన ఇప్పుడు.. ఆయన కంటే.. వేగంగా.. మొత్తం ఎందుకు ఇంగ్లిష్ మీడియం చేయాలనుకుంటున్నారు…?. వీటన్నింటికీ సమాధానం… వైసీపీ నేతలు చెప్పేది.. ప్రభుత్వ స్కూళ్లలో చదివే వారికి ఇంగ్లిష్ చదువులు కావాలని..! అసలు నిజం మాత్రం తెలుగు మీడియాకు భవిష్యత్ లేకుండా చేయడం. జగన్ మనస్థత్వాన్ని పరిశీలిస్తే.. దీన్ని ఎవరూ కాదనలేరు. జగన్మోహన్ రెడ్డికి తెలుగు మీడియా అంటే పడదు. సందు దొరికితే.. ఆయా మీడియా సంస్థల పీక పిసకడానికి సిద్ధంగా ఉంటారు. దాని కోసం ఆయన ఎంచుకున్న వినూత్న మార్గమే ఇంగ్లిష్ మీడియం.

భవిష్యత్‌లో ఎవరికీ తెలుగు చదవడం రాకూడదా…?

ప్రస్తుతం.. ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న వారిలో చాలా మందికి.. తెలుగు రాదు. ప్రైవేటు స్కూళ్లలో తెలుగు చదువును ఎప్పుడో వెనక్కి నెట్టేశారు. అంటే.. భావి ఓటర్లు .. తెలుగు పత్రికలు చదవడం అంతంతమాత్రమే. అలా చదువుతున్న వారు ఎవరైనా ఉన్నారా.. అంటే.. తెలుగు మీడియంలో చదువుతున్నవారు మాత్రమే. తెలుగు మీడియాలో.. దాదాపుగా ఎనభై శాతం రీడర్ షిప్ ఉన్న పత్రికలు.. జగన్ కు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇప్పుడు తెలుగు పేపర్లు చదవడం ప్రారంభించిన వారికి.. తన గురించి.. ఆ పత్రికలు రాసేవన్నీ.. కాబోయే ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అ విషయం అంచనా వేశారు. అందుకే.. ఎవరూ తెలుగు నేర్చుకోకూడదన్న పట్టుదల ప్రదర్శిస్తున్నారు.

రాజకీయం కోసం మాతృభాషను చంపేసే మహానుభావుడు..!

జగన్మోహన్ రెడ్డికి ఫ్యాక్షనిస్టు మనస్థత్వమని.. ఆయన శైలిని చూసిన వారు ఎవరైనా చెబుతారు. ఆయనకు.. వ్యక్తిగతం..ఏమీ ఉండదు. అంతా రాజకీయ పరమైన వ్యవహారాలే. వాటిని వ్యక్తిగతంగా తీసుకుంటారు. అలా తీసుకుని.. వారిని సర్వనాశనం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తారంటారు. ఏపీలో ఓ సామాజికవర్గాన్ని అలాగే చేస్తానంటూ.. ఆయన అధికారుల ముందే శపధాలు చేస్తున్నట్లుగా సెక్రటేరియట్‌లో ప్రచారం కూడా జరుగుతోంది. ఈ క్రమంలో.. తెలుగు మీడియాపై కసితో.. అసలు ఆ మీడియాకు రీడర్లు లేకుండా చేసే ఉద్దేశంతోనే… తెలుగు మీడియంపై తొలి వేటు వేస్తున్నారని..అర్థం చేసుకోవచ్చు. వచ్చే ఏడాది నుంచి తెలుగు మీడియం లేకపోతే.. తెలుగు చదవడం, రాయడం వచ్చే వారు.. పదేళ్ల తర్వాత ఎవరూ ఉండరు. అప్పటికి జగన్ తాను అనుకున్న లక్ష్యంలో సగం సాధించగలుగుతారు. అదే జరిగితే.. తెలుగు మీడియం మాత్రమే కాదు.. తెలుగు మీడియా కూడా అంతమవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోడీకి నర్సాపురం ఎంపీ పొగడ్తలు వయా ఆంధ్రజ్యోతి..!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రధాని నరేంద్రమోడీపై తన భక్తిని ఆరాధన స్థాయికి తీసుకు వెళ్తున్నారు. వైసీపీలోఇమడలేనని నిర్ణయించుకున్న ఆయన.. మెల్లగా.. ప్రజాస్వామ్య బద్ధంగానే ఆపార్టీపై విమర్శలు.. పథకాల్లో లోపాలను వెల్లడిస్తూ..దూరం అవుతున్నారు. ఈ...

ఏపీలో జీతాలు ఇంకా రాలే..! కారణం “బిల్లు” కాదా..?

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు జీతాలు, రిటైరైన వారికి పెన్షన్లు ఇంకా అందలేదు. ద్రవ్యవినిమయ బిల్లును టీడీపీ అడ్డుకోవడంతోనే జీతాలు ఆలస్యమయ్యాయని ఒకటో తేదీన సలహాదారు, మంత్రి మీడియా ముందుకు వచ్చి దుమ్మెత్తిపోశారు. అయితే.. అదే...

పాత సచివాలయం కూల్చివేత షూరూ..!

తెలంగాణ పాత సచివాలయాన్ని క్వారంటైన్ కేంద్రంగా మార్చాలని వస్తున్న డిమాండ్లను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. కోర్టు నుంచి అనుకూల తీర్పు వచ్చిన .. మూడు, నాలుగు రోజుల్లోనే కూల్చివేత ప్రారంభమయింది. మంగళవారం ఉదయం.....

కరోనా కట్టడిపై తెలంగాణ గవర్నర్ దృష్టి..!

కరోనా కట్టడి విషయంలో తెలంగాణ సర్కార్ పెద్దగా పని చేయడం లేదంటూ వస్తున్న విమర్శల నేపధ్యంలో.. కొత్త పరిణామం చోటు చేసుకుంది. గవర్నర్ తమిళశై.. ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను పిలిపించుకుని పరిస్థితిపై సమీక్ష...

HOT NEWS

[X] Close
[X] Close