ఎడిటర్స్ కామెంట్ : బలవంతుడైన రాజు మొండివాడైతే..?

మొండివాడు రాజు కన్నా బలవంతుడు.. మరి రాజే బలవంతుడైతే..!? ఆ మొండితనంతో కూడిన బలవంతుడైన రాజుకు.. పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే మనస్థత్వం ఉంటే.?.. ఇన్ని లక్షణాలున్న పాలకుల గురించి చరిత్రలో చదువుకున్నాం కానీ.. ఆధునిక చరిత్రలో కళ్ల వెంట చూడలేదు. ఇప్పుడిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి పరిస్థితి సాక్షాత్కరిస్తోంది. రాజ్యాంగం లేదు.. వ్యవస్థ లేదు… పద్దతి లేదు.. తాను అనుకున్నట్లుగా జరిగిపోవాలనే పంతం… అది చేయడానికి ఎంతకైనా తెగించడం.. చివరికి ఏమీ చేయలేక ఎక్కడ ప్రారంభించారో అక్కడికే రావడం… అంతా ఓ సైకిల్‌లా గడిచిపోతోంది. మొండితనంతో ఓ అడుగు ముందుకేయవచ్చు.. బలంతో మరో అడుగు ముందుకేయవచ్చు. కానీ… వాటితోనే తాను పట్టిన కుందేలుకు.. మూడే కాళ్లు అని నిరూపించడం సాధ్యం కాదు. ఒక చోట కాకపోతే.. ఇంకో చోట…నిజం వెలుగులోకి రావాల్సిందే. అప్పుడు అహం దెబ్బతినాల్సిందే.

మొండితనంతో ముందుకెళ్లి చక్కబెట్టిన పని ఒక్కటైనా ఉందా..?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా బలవంతుడు. ఆయన ఒక్క చాన్స్ అడిగితే ఇచ్చారో.. చంద్రబాబు కష్టాలు పెడితే విసిగిపోయారో తెలియదు కానీ.. ఊహించనంత మెజార్టీ ఇచ్చారు. అంటే కావాల్సినంత బలం ఇచ్చారు. ఆ బలంతో వచ్చిన మొండితనమో.. సహజసిద్దంగా ఉందేమో కానీ… ఆ లక్షణం… బలం కలిసి.. ఆయన తనకు ఎదురు లేదనే బలమైన నమ్మకాన్ని తెచ్చి పెట్టాయి. ఎంతగా అంటే… సీఎం నేనా.. ఎస్‌ఈసీ రమేష్ కుమారా..? అని వాదించేత. అంత వరకూ బాగానే ఉన్నా… తాను చేయాలనుకున్నది చేస్తున్నారు. కానీ.. ఒక్కటంటే.. ఒక్క దాంట్లో అయినా ముందడుగు వేశారా…? లేనే లేదు. అధికారం చేపట్టినప్పటి నుండి… ఇప్పటి వరకూ… చట్టం.. న్యాయం… రాజ్యాంగం లాంటివేమీ పట్టించుకోకుండా.. తీసుకున్న నిర్ణయాలన్నింటినీ.. మళ్లీ తానే వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. దీని వల్ల.. ఆత్రమే తప్ప.. విషయం లేదని.. విమర్శలు ఎదుర్కోవడం తప్ప… సాధించిందేమీ లేదు. పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్ల దగ్గర్నుంచి నిన్న రాజధాని తరలింపు బిల్లుల వరకు. అన్ని ఎపిసోడ్లలోనూ ఇదే స్టోరీ.

హైకోర్టును మారుస్తూ అసెంబ్లీ చట్టం చెల్లదని తెలీదా..?

రాజధాని తరలింపు సాధ్యం కాదని.. మూడు రాజధానులు కోర్టులో నిలబడవని.. సీఆర్డీఏ రద్దు చేస్తే.. గుల్లయిపోతారని.. న్యాయనిపుణులు చెబుతూనే ఉన్నారు. అసలు పాలనా వికేంద్రీకరణ బిల్లులో హైకోర్టును చేర్చడమే… తప్పిదం. హైకోర్టు న్యాయమూర్తులందరూ.. తీర్మానం చేసి సుప్రీంకోర్టుకు పంపితే.. సుప్రీంకోర్టు కొలిజియం నిర్ణయం తీసుకుని రాష్ట్రపతికి పంపుతుంది. ఫైనల్‌గా రాష్ట్రపతి ఆదేశిస్తారు. ఈ వ్యవహారంలో ఎక్కడా పాలనా వ్యవస్థ జోక్యం ఉండదు. అసలు కోర్టుల మీద.. ముఖ్యంగా కోర్టులు ఎక్కడ ఉండాలనేదాని మీద.. చట్టాలు చేస్తారని.. రాజ్యాంగ నిర్మాతలు కూడా ఊహించి ఉండకపోవచ్చు. ఎందుకంటే.. న్యాయవ్యవస్థకు అంతటి ప్రత్యేకమైన ప్రతిపత్తి ఉంది. ఎవరూ… జోక్యం చేసుకోలేరు. ఈ విషయం తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి పాలనా వికేంద్రీకరణ బిల్లు తీసుకు వచ్చారు. ఆయనకు తెలియదని అనుకోలేం. ఆయన చుట్టూ లబ్ద ప్రతిష్టులైన సలహాదారులు ఉన్నారు. వారైనా చెప్పి ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి తాను అనుకున్నది చేయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు… స్టేటస్ కో వచ్చి ఉండవచ్చు కానీ.. రేపోమాపో.. ఆ బిల్లుల్ని హైకోర్టు కొట్టి పడేస్తుందని.. న్యాయనిపుణులు చెబుతున్నారు. అంటే… రాజధాని తరలింపునకు కూడా… బ్రేక్ పడినట్లు అవుతుంది. తర్వాత నేను సీఎం ఎక్కడి నుంచి పాలన చేస్తే అదే రాజధాని అని విశాఖ తీరానికి పోయి కూర్చుంటే..ఏ కోర్టులు ఏం చేయాలేవు కానీ.. చట్టబద్ధంగా మాత్రం ముందడుగు వేయడం అసాధ్యం. ఈ విషయం.. న్యాయ, రాజ్యాంగ నిపుణుల వరకూ వెళ్లక్కర్లేదు.. జగన్ పక్కన ఉన్న సలహాదారులకు.. కాస్త నోరు తెరిచే చాన్సిస్తే చెప్పేస్తారు.

రాజ్యాంగం వల్లే జగన్‌కు అధికారం.. రాజ్యాంగమే గొప్ప.. !

మొండి తనంతో… తాను ఏం చేసినా.. చెల్లుతుందనుకునే భావనలో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ ఉన్నారు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా… తప్పని సరిగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను మళ్లీ నియమించాల్సి పరిస్థితి వచ్చిన తర్వాత కూడా.. ఆయన రియలైజ్ కాలేదని… మూడు రాజధానుల బిల్లులపై గవర్నర్ సంతకాలు.. ఆ వెంటనే గెజిట్ విడుదలతోనే తేలిపోయింది. నిమ్మగడ్డను.. మళ్లీ… ఎస్‌ఈసీ పోస్టులో కూర్చోనివ్వకూడదని.. జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారు. కానీ.. రాజ్యాంగం ముందు. ఏవీ నిలబడలేదు. జగన్మోహన్ రెడ్డికి 151 కాదు.. 175కి 175 వచ్చినా… రాజ్యాంగమే గొప్ప. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారం. ఎందుకంటే… జగన్‌కు ఆ ఆధికారం వచ్చింది రాజ్యాంగం వల్లనే మరి. ఒక్క ఎస్‌ఈసీ విషయంలోనే కాదు… ఫలానా విషయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయగలిగారని… చెప్పుకునేది ఒక్కటి కూడా లేదు. ప్రభుత్వ భవనాలపై రంగుల దగ్గర్నుంచి ఇంగ్లిష్ మీడియం వరకు.. ఒక్కటంటే.. ఒక్క దాంట్లోనూ సానుకూల ఫలితం లేదు. ఉండదు కూడా. ఎందుకంటే.. అవన్నీ… రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయి మరి.

దారుణంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్..!

పధ్నాలుగు నెలల కాలంలో… బలంతో వచ్చిన మూర్ఖత్వంతో కూడిన మొండితనం వల్ల… ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌ను జగన్మోహన్ రెడ్డి దారుణంగా దెబ్బతీశారని.. ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆయన తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల వల్ల పనులన్నీ ఎక్కడివక్కడ ఆగిపోయాయి. పరిశ్రమలు రాలేదు. వచ్చినవి కూడా వెనక్కి పోయాయి. ఫలితంగా.. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు… ఎక్కడ ఏ అభివృద్ధి పని జరుగుతుందో.. తెలియని పరిస్థితి. అప్పులు కుప్పలు కుప్పలుగా చేస్తున్నా… వాటితో ఏ సంపద పెంచుతున్నారో.. అంచనా వేయలేని దుస్థితి. ప్రతిపక్షంగా పగ తీర్చుకోవడమే… పాలన అన్నట్లుగా సాగిపోతున్న సీఎం… ఒక్క సారి వెనక్కి తిరిగి చూసుకుంటే… తనకు ఆ పగ – ప్రతీకారమే మిగిలింది తప్ప… ప్రజలు పెట్టుకున్న ఆశలను తాను మోయడం లేదని సులువుగా అర్థం చేసుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అధికారం మత్తులో ఉన్నారు. వెనక్కి తిరిగి చూసుకోవడాన్ని ఆయన నామోషీగా ఫీలవుతున్నారు. అందుకే.. ముందుకే దూసుకెళ్తున్నారు.

ప్రజల అసంతృప్తి లావా ఒక్క సారిగా బయటపడుతుంది..!

ఈ మొత్తం వ్యవహారంలో.. ఆంధ్రప్రదేశ్ దారుణంగా నష్టపోతోంది. దాంతో పాటు.. జగన్మోహన్ రెడ్డి కూడా నష్టపోతున్నారు. రాజకీయంగా నష్టపోతున్నారు. మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు అంటే.. ప్రజలు నెత్తిన పెట్టేసుకుంటారని అంచనా వేసుకుంటున్నారేమో కానీ.. ఆయన గతంలో చెప్పిన దానికి.. ఇప్పుడు చేస్తున్న దానికి పోలికలు ప్రజల్లో వస్తున్నాయి. గతంలో.. అమరావతి కోసం మాట్లాడిన మాటలు.. ఇప్పుడు చేస్తున్న చేతలు చూస్తున్న వారు… ప్రజల్ని నిలువుగా మోసం చేశారనే భావనకు వెళ్తున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఇప్పటికే అసంతృప్తి కనిపిస్తోంది. దీనికి కరోనా తోడవుతోంది. అంతిమంగా… ఇది పెరుగుతూనే పోతోంది. ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేసి రోడ్లెక్కడం లేదు కాబట్టి… తమ నిర్ణయానికి మద్దతు ఉందని ప్రభుత్వం భావిస్తుందేమో తెలియదు కానీ.. ఇప్పుడు ప్రజలు.. తమ ఆందోళనా తీరును మార్చుకున్నారు. ఒకప్పుడు రూపాయి పెట్రోల్ ధర పెంచితేనే… బంద్‌లు జరిగేవి. ఇప్పుడు పది రూపాయలు పెరిగినా ప్రజలు పట్టించుకోవడం లేదు. దానికి కారణం… తాము ఆందోళనలు చేసి టైమ్ వేస్ట్ చేసుకోవడం కన్నా.. ఎన్నికల్లో ఓటును ఉపయోగించడం మంచిదనే భావనకు రావడమే. ఏపీలోనూ అదే సూత్రం వర్తిస్తుంది. పైగా… చిన్న సోషల్ మీడియా పోస్టులు పెట్టినా అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి… ప్రజాభిప్రాయం బయటకు రాదు. అందుకే విపక్షం మళ్లీ ఎన్నికలకు డిమాండ్ చేస్తోంది.

ఇంకెక్కడి ” మాట తప్పను ” బ్రాండ్..!

అమరావతి విషయంలోనే కాదు… వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుండి సంక్షేమ పథకాల విషయంలో లబ్దిదారులకు కోత విధించేందుకు ప్రతీ విషయంలోనూ మాట మారుస్తున్నారు. పిల్లలను స్కూలుకు పంపే ప్రతీ అమ్మకు రూ. 15వేలు ఇస్తామని చెప్పి… ఇప్పుడు అందరు అమ్మల్లో కనీసం ఇరవై శాతం మందికి కూడా ఇవ్వడం లేదు. అన్నీ మాట తప్పుళ్లే.. మడమ తిప్పుళ్లే. ఇప్పుడు రాజధాని విషయంలో… 2014కి ముందు నుంచి చెబుతున్న మాటలు ప్రజల ముందు ఉన్నాయి. అవన్నీ అన్న జగన్ ఇప్పుడు.. చేతల్లో మాత్రం వేరే పనులు చేస్తున్నారు. మాట తప్పను అనే బ్రాండ్ ఇప్పుడు కామెడీ అయిపోయింది. అంటే.. ఆయన ఇమేజే… రిస్క్‌లో పడింది. అధికారం ఉంది కాబట్టి.. ఇప్పటికి బాగానే ఉంటుంది.. కానీ తర్వాతే పరిస్థితి మారిపోతుంది.. అప్పుడు ఎన్ని చెప్పినా… ప్రజలు ఓ సారి అనుభవించారు కాబట్టి… నమ్మే అకవకాశం ఉండదు..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వెంకయ్యనాయుడికి కరోనా ..!

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా సోకింది. అతి స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆయన కరోనా పరీక్ష చేయించుకున్నారు. దాంతో ఆయనకు పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతానికి హోమ్ ఐసోలేషన్‌లోనే వెంకయ్యనాయుడు ఉన్నారు. లక్షణాలు పెరిగితే...

‘ఆదిపురుష్`’పై అనుష్క క్లారిటీ

ప్ర‌భాస్ న‌టిస్తున్న మ‌రో బ‌హుళ భాషా చిత్రం `ఆది పురుష్‌`. రావ‌ణుడి పాత్ర‌కు సైఫ్ అలీఖాన్‌ని ఎంచుకున్నారు. సీత పాత్ర కోసం చాలామంది క‌థానాయిక‌ల పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. అందులో అనుష్క పేరు...

గ్యాప్ రాలేదు.. తీసుకున్నా: అనుష్క

బాహుబ‌లి త‌ర‌వాత‌.. అనుష్క మ‌రీ న‌ల్ల‌పూస అయిపోయింది. `భాగ‌మ‌తి` త‌ప్ప మ‌రే సినిమా ఒప్పుకోలేదు. నిశ్శ‌బ్దం.. సినిమాకి దాదాపుగా రెండేళ్లు కేటాయించాల్సివ‌చ్చింది. అనుష్క‌కి సినిమా అవ‌కాశాలు లేవా? వ‌చ్చినా చేయ‌డం లేదా?...

సోనూసూద్‌కి ఐరాస పుర‌స్కారం

నటుడు సోనూసూద్ కు అరుదైన పురస్కారం ప్ర‌క‌టించింది ఐక్య‌రాజ్య స‌మితి. ఐరాస అనుబంధ సంస్థ‌ యునైటెడ్‌ నేషన్స్ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యుఎన్‌డిపి) స్పెషల్‌ హ్యుమానిటేరియన్‌ యాక్షన్ అవార్డుని ఈ యేట...

HOT NEWS

[X] Close
[X] Close