ఐఏఎస్‌లకే అగౌరవం – వాళ్లు సర్వీస్‌కు అర్హులేనా !?

ఐఏఎస్‌లు అంటే సమాజంలో ఓ గౌరవం ఉంటుంది. కానీ జగన్ రెడ్డి పాలనలో ఐఏఎస్‌లు అంటే పరమ అవినీతి పరులు, ఐపీఎస్‌లు అంటే ప్రజల్ని పీడించేవాళ్లు, దొంగ కేసులు పెట్టే వాళ్లు అన్నట్లుగా మారిపోయింది. చివరికి దొంగ ఓట్ల స్థాయికి ఓ కలెక్టర్ దిగిపోయాడంటే.. అంతకంటే అవమానం ఏముంటుంది ?. వారికి అసలు నైతికత అనేది ఉంటే తక్షణం తమ సర్వీస్ కు రాజీనామా చేసి వెళ్లిపోవాలి. కానీ ఎప్పుడైతే నేరస్తులతో చేతులు కలిపి అడ్డగోలు పనుల చేయడానికి సిద్ధమయ్యారో.. చివరికి ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేయడానికి కూడా వెనుకాడలేదో అప్పుడే వారు అన్నీ వదిలేశారని అర్థమవుతుంది. వారికెవరికీ సిగ్గూ ఎగ్గూ ఉండవు. దొరికినంత దోచుకోవడమే.

తిరుపతి ఉపఎన్నికల్లో చేసిన దొంగ ఓట్ల సాయానికి గిరీషా అనే ఐఏఎస్‌కు జగన్ రెడ్డి సొంత జిల్లాలో కలెక్టర్ పోస్టింగ్ వచ్చింది. ఇలా తప్పుడు పనులు చేసిన అనేక మందికి మంచి పోస్టింగ్‌లు వచ్చాయి. కానీ దొరికిపోయినప్పుడు తల దించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు జగన్ రెడ్డి పంచన చేరి ఓ క్రిమినల్ ఆలోచనల్ని అమలు చేసిన అందరికీ శంకరగిరి మాన్యాలు పట్టే సమయం వచ్చింది. ఇవాళ గిరీష ఒక్కడే కావొచ్చు. ఆయన పాపం పండిందని అనుకోవచ్చు. మిగిలిన వారూ ఆ కలుగులో ఎంతో దాక్కోలేరు. పొగపెట్టి బయటకు తీసుకు వచ్చి మరీ వేటు వేస్తారు. దానికి ఎంతో కాలం అవసరం లేదు.. రోజుల్లోనే ఉన్నాయి.

దారి తప్పిన ఐఏఎస్, ఐపీఎస్‌లకు ఏపీలో కొదవ లేదు. ఓటర్ల జాబితాలను ట్యాంపర్ చేయడం అంటే ప్రజాస్వామ్యం పై దాడి చేయడమే. రాజ్యాంగాన్ని అవమానించడమే. ఇలాంటి పనులు చేసిన వారికి సర్వీస్‌లో ఉండే అర్హత ఉంటుందా ?. దేశ ద్రోహానికి పాల్పడిన వారికి ఐఏఎస్ అవసరమా ?. ఇలాంటి వారందరికీ బుద్ది చెబితేనే ప్రజల్లో వ్యవస్థలపై నమ్మకం పెరుగుతుంది. లేకపోతే.. ఏం చేసినా ఏమీ చేయలేదన్న ఉద్దేశంతో ఆ వ్యవస్థ మరింత కుళ్లిపోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘భీమా’ ట్రైలర్ టాక్ : బ్రహ్మ రాక్షసుడు

https://www.youtube.com/watch?v=P3t--CmbibE మార్చిలో వస్తున్న సినిమాల్లో గోపీచంద్‌ 'భీమా' ఒకటి. కన్నడ దర్శకుడు ఎ.హర్ష దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ బయటికి వచ్చింది. ట్రైలర్ అంతా యాక్షన్, ఎలివేషన్స్ తో నిండిపోయింది. ట్రైలర్ లో...

జనసేనను రెచ్చగొట్టే ప్లాన్ ఫెయిలయిందని వైసీపీ గగ్గోలు !

టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదరకూడదని.. పొత్తు కుదిరినా రెండు పార్టీల సీట్ల పంచాయతీ పెట్టాలని చాలా కాలంగా వైసీపీ వ్యూహకర్తలు చేస్తున్న ప్రయత్నాలన్నీ తేలిపోయాయి. సీట్ల సర్దుబాటు .. అభ్యర్థుల ప్రకటన...

ఇలాగైతే ర‌ధ‌న్‌కి క‌ష్ట‌మే!

టాలీవుడ్ లో ప్ర‌తిభావంతులైన సంగీత ద‌ర్శ‌కుల‌కు కొద‌వ లేదు. కీర‌వాణి, త‌మ‌న్‌, దేవిశ్రీ‌ల‌తో పాటు భీమ్స్, మిక్కీ జే మేయ‌ర్ లాంటివాళ్లు అందుబాటులో ఉన్నారు. ర‌ధ‌న్ పేరు కూడా బాగా పాపుల‌ర్‌. చిన్న‌,...

ఫస్ట్ లిస్ట్ : టీడీపీ – జనసేన యుద్ధానికి సిద్ధం !

సిద్ధం సిద్ధం అని జగన్ రెడ్డి అరుస్తూనే ఉన్నారు. జాబితాల మీద జాబితాలు విడుదల చేస్తున్నారు. ఒక జాబితాలో ఉన్న వారి పేరు మరో జాబితాలో మార్చేస్తున్నారు. ఒక్క ఎంపీ అభ్యర్థి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close