జగన్మోహన్ రెడ్డి గురువారం హైదరాబాద్ లో సీబీఐ కోర్టుకు హాజరవుతున్నారు. షెడ్యూల్ ను వ్యక్తిగత సిబ్బంది విడుదల చేశారు. ఆ షెడ్యూల్ ప్రకారం జగన్ రెడ్డి ఉదయం తొమ్మిది గంటలకు తాడేపల్లిలో బయలుదేరారు. ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకుంటారు. అక్కడ్నుంచి నాంపల్లి కోర్టుకు పదకొండున్నరకు చేరుకుంటారు. పన్నెండున్నర వరకు కోర్టులో ఉంటారు. అంటే గంట సేపు మాత్రమే కోర్టుకు సమయం కేటాయించారు. కోర్టు ఎంత సేపు ఉంటుదో చెప్పడం కష్టం. కానీ జగన్ గంట మాత్రమే కేటాయించారు.
అక్కడ్నుంచి లోటస్ పాండ్ కు వెళ్తారు. జగన్ మోహనరెడ్డి ఎంతో ముచ్చటపడి కట్టుకున్న లోటస్ పాండ్ ఇంట్లో ఎక్కువ కాలం ఉండలేకపోతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి.. ఆ ఇంట్లో వారాంతాల్లో కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకునేవారు. గెలిచాక అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఓడిపోయాం కూడా మళ్లీ హైదరాబాద్ రాలేకపోయారు. బెంగళూరులో తన చెల్లికి రాసిచ్చిన ఇంటినీ మళ్లీ తానే స్వాధీనం చేసుకుని అక్కడే ఉంటున్నారు.
కోర్టు నుంచి లోటస్ పాండే కు వచ్చి గంట సేపు ఉండి..భోజనం చేసి.. మళ్లీ బేగంపేటకు వెళ్తారు. ప్రత్యేక విమానంలో విజయవాడకు కాకుండా బెంగళూరు వెళ్తారు. అక్కడి నుంచి యలహంక ఇంటికి వెళ్తారు. అంటే ఈ వారం ఏపీలో షెడ్యూల్ పూర్తయినట్లే అన్నమాట.

