శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జ్ కోట వినుత, ఆమె భర్త తమ డ్రైవర్ ను హత్య చేసిన కేసులో చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. వెంటనే జనసేన పార్టీ స్పందించింది. వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించింది. ఇయితే ఇదే చాన్స్ అన్నట్లుగా వైసీపీ సోషల్మీడియా కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. చివరికి వైసీపీ అధికారిక హ్యాండిల్ లోనూ మైక్ ముందు దాడులు, హత్యల గురించి తెగ శుద్ధపూస కబుర్లు చెప్తావు.. ఇప్పుడు మీ పార్టీ శ్రీకాళహస్తి ఇంఛార్జ్ చేసిందేంటి పవన్ కల్యాణ్ అని ప్రశ్నించారు.తెలిసిన వెంటనే వాళ్లను పార్టీ నుంచి బయటకు పంపేశారు. మరి వైసీపీ ఏం చేసింది..?
ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేస్తే.. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసింది. విచారణ చేయనివ్వలేదు. చార్జిషీటు దాఖలు చేయనివ్వకుండా సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చేలా చేశారు. స్వయంగా నేరం ఒప్పుకున్నా.. విచారణ చేయలేదు. ఒక్కడే హత్య చేయడం శవాన్ని తీసుకు రావడం సాధ్యం కాదని తెలిసినా.. మిగిలిన నిందితులు ఎవరో కూడా తెలియకుండా జాగ్రత్తపడ్డారు. అనంతబాబు జగన్ పక్కనే ఎన్ని సార్లు ఉన్నాడో లెక్కే లేదు. పార్టీ సమావేశం ఉంటే అనంతబాబు ముందే తాడేపల్లిలో జగన్ నివాసంలో ఉంటారు. అతడిని పక్కనే పెట్టుకుని చర్యలు తీసుకున్న జనసేన పార్టీపై విమర్శలు చేయడం విచిత్రంగా మారింది.
పార్టీలో ఉన్న నేతల రోజువారీ వ్యవహారాలను.. వారు చేసే నేరాలను పార్టీ అధినేతకు చెప్పి చేయరు. వారి గురించి నిజాలు తెలిసిన రోజున పార్టీ నుంచి బహిష్కరిస్తారు. కానీ దొంగ సస్పెన్షన్లు చేసి మళ్లీ పార్టీలోనే తిప్పుకుని అదీ కూడా అధినేత మంచి పలుకుబడి ఇస్తే.. దాని కన్నా.. నేరస్తులకు అండగా ఉండటం ఉండదు. నేరస్తుల పార్టీ వైసీపీ.. దీని గురించి ఎంత ఎక్కువగా మాట్లాడితే.. అంతగా అనంతబాబు వ్యవహారం తెరపైకి వస్తుంది. జగన్ రెడ్డి నీతి గురించి చర్చించుకుంటారు.