జగన్ కీలక ప్రెస్మీట్ అని మంగళవారం వైసీపీ సోషల్ మీడియా ఓ పోస్టర్ వేసుకుంది. మామలు ప్రెస్ మీట్ అంటే ఎవరూ చూడరని.. “కీలక” అనే సోషల్ మీడియా అల్గారిధమ్ను అసువుగా వాడేసుకున్నారు. ఆ కీలక ప్రెస్మీట్లో ఏం ఉందయ్యా అంటే.. గత ప్రెస్ మీట్ నుంచి ఈ ప్రెస్ మీట్ వరకూ సాక్షి పేపర్ లో వచ్చిన తప్పుడు నేరెటివ్ స్టోరీస్ మరోసారి అప్పజెచ్పడం. అంతకు మించి ఏమీ లేదు.
ఈ మధ్య కాలంలో వైసీపీ చేసిన స్క్రిప్టెడ్ డ్రామాస్ అన్నీ ఫెయిలయ్యాయి. చివరికి గుడివాడ ఇష్యూలో పేర్ని నాని పరువు తీసి పడేశారు. ఎలా తప్పుడు ప్రచారం చేద్దామో ఫోన్లో చెప్పి బుక్కయిపోయాడు. అయినా సరే అదే ప్లాన్లు అమలు చేశారు. రోడ్డు మీద మామిడికాయలు పోయించిన షో స్కిట్ లా మారి నవ్వుల పాలు అయింది. దాన్ని కూడా సమర్థించుకున్నారు. కామెడీ ఏమిటంటే.. కేతిరెడ్డి, నల్లపురెడ్డి సహా కేసుల పాలైనా వాళ్లంతా మంచివాళ్లట. వాళ్లేమీ చేయకుండానే కేసులు పెట్టరాట. ఇలాంటి ఆణిముత్యాలతో ప్రెస్ మీట్ నడిచిపోయింది.
అయితే ఆయన తన సహజసిద్ధమైన సంఘ వ్యతిరేక శక్తులకు మద్దతిచ్చే స్వభావాన్ని మార్చుకోలేదు. ఏకంగా డీజీపీపైనే అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో డీఐజీ అనేవాడు మాఫియా డాన్… ఆయన కింద సీఐలు కలెక్షన్స్ చూసుకుంటారు. వారే ఎమ్మెల్యేలకు ఇస్తున్నారని ఆరోపించేశారు. పోలీసు వ్యవస్థ మీద ఆరోపణలతో ఒత్తిడి చేసి.. తమపై చర్యలు తీసుకోకుండా. చూసుకోవాలని జగన్ రెడ్డి పిచ్చిప్లాన్. అదే సమయంలో తమ పార్టీ నేతలు రప్పా రప్పా నరికేస్తామంటే.. సినిమా డైలాగులని సెన్సార్ చేయలేదు కాబట్టి..బయట కూడా వాడతామని అంటున్నారు. బాలకృష్ణ, పవన్ సినిమాల్లో అలాంటి డైలాగులు ఉంటాయని ఆ సినిమాలను నిషేధించాలని కూడా విచిత్రమైన వాదన వినిపించారు.
తన మానసిక వికారాన్ని చూపించుకునేందుకు జగన్ ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. చంద్రబాబు ప్రభుత్వం మూడేళ్లలో పోతుందని చెప్పడానికి.. చంద్రబాబు మూడేళ్లలో ఎగిరిపోతాడని కామెంట్ చేశారు. తనకు బాధలు చెప్పుకోవడానికి ప్రజలు వస్తున్నారని కవరింగ్ చేసుకున్నారు. వారానికి రెండు రోజులు మాత్రమే తాడేపల్లిలో ఉంటారు. రెండురోజుల్లో ఆయన సింగయ్య కుటుంబం లాంటి వాళ్లను మాత్రమే కలిసి చేయాల్సిన కుట్రలు చేసి పోతున్నారు.
ప్రతిపక్ష నేతగా ఏం చేయడం లేదని ప్రజలు అనుకుంటారని.. ఇలాంటి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఏ విషయంలో ఆయన ప్రజల కోసం పని చేస్తున్నారో చెప్పుకోలేకపోతున్నారు.