షర్మిల 3 వేల కి.మీ నడక పూర్తి – ఎవరైనా పట్టించుకున్నారా?

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన పాదయాత్ర మంచిర్యాల జిల్లాలో మూడు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. గత ఏడాది జూలై 8న షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో రాజకీయ పార్టీ స్థాపించారు. అ గత సంవత్సరం అక్టోబర్ 20న రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల నుంచి ఆమె ఈ యాత్రను ప్రారంభించారు. తెలంగాణలోని హైదరాబాద్ మినహా అన్ని ఉమ్మడి జిల్లా మీదుగా షర్మిల యాత్ర కొనసాగుతోంది. ఇప్పటికి మూడు వేల కిలోమీటర్లు అయింది. వెయ్యి..రెండు వేల కి.మీ మైలు రాయి దాటినప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడూ అంతే.

ఎప్పట్లాగే మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా విజయమ్మ వెళ్లారు. తన కుమార్తెకు ఒక్క చాన్స్ ఇవ్వాలన్నారు. రాజశేఖర్ రెడ్డి స్వర్ణయుగాన్ని తెలంగాణలో మళ్లీ తేవాలన్న ఉద్దేశంతోనే షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టిందని చెప్పుకొచ్చారు. యాత్ర ఆపాలని ఎన్నో కుట్రలు చేసినా..షర్మిల తలవంచలేదు..తలదించలేదన్నారు. సంకల్పంతోనే పాదయాత్ర చేస్తూ…ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటోందని చెప్పారు.

పాదయాత్రను ఎవరూ పట్టించుకోకపోవడంతో విపక్ష నేతలపై తిట్ల దండకం అందుకుంటున్నారు. వారు స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తే నన్ను చంపేస్తారా అంటూ డ్రామాలాడే ప్రయత్నంచేశారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పటీకీ ప్రధాన రాజకీయ పార్టీల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరు వినిపించడం లేదు. పార్టీ పెట్టిన తర్వాత రెండు సార్లు ఉపఎన్నికలు వచ్చాయి. హుజూరాబాద్‌లో పాటు మునుగోడు ఉపఎన్నికలు వచ్చినా.. షర్మిల పోటీ చేయలేదు. తమ బలం ఎంతో ప్రదర్శించాలని అనుకోలేదు. పార్టీలో షర్మిల తప్ప గుర్తుంచుకునే మరొక నేత లేకపోవడం కూడా మైనస్ అవుతోంది. షర్మిల కోసం ఆమె తల్లి పని చేస్తున్నారు. కానీ ఎంత వరకు వర్కవుట్ అవుతుందనేది అంచనా వేయడం కష్టమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సెకండాఫ్ మార్చేసిన విశ్వ‌క్‌

విశ్వ‌క్‌సేన్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తూ, ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం దాస్ కా ధ‌మ్కీ. ఈ చిత్రానికి ప్ర‌స‌న్న కుమార్ బెజ‌వాడ క‌థ అందించాడు. త‌ను ఇప్పుడు ఓ కాస్ట్లీ రైట‌ర్‌. ధ‌మాకా చిత్రానికీ త‌నే...

సుహాస్‌కి ఇంత డిమాండా..?

చిన్న చిన్న సినిమాల్లో, చిన్న చిన్న పాత్ర‌ల‌తో ఎదిగాడు సుహాస్‌. యూ ట్యూబ్ నుంచి.. వెండి తెర‌కి ప్ర‌మోష‌న్ తెచ్చుకొన్నాడు. హీరో అయ్యాడు. క‌ల‌ర్ ఫొటోతో త‌న‌కు మంచి గుర్తింపు వ‌చ్చింది. ఆ...

తమ్మినేని సీతారాం LLB వివాదం !

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తాను పదవి చేపట్టిన తరవాత న్యాయపరిజ్ఞానం ఉండాలనుకుంటున్నారేమో కానీ ఎల్ఎల్‌బీ చదవాలనుకున్నారు. హైదరాబాద్‌లో ఓ లా కాలేజీలో చేరారు. మూడేళ్లు దాటిపోయింది. కానీ ఆయన...

“లీక్‌” రాజకీయం – బీఆర్ఎస్‌ రాంగ్ స్టెప్ ?

టీఎస్‌పీఎస్సీ లీక్ వ్యవహారాన్ని రాజకీయ రంగు పులమడానికి బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అసలు విషయాల కన్నా కొసరు విషయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. రాజకీయ ఆరోపణలకు సిట్ కేసులు పెట్టించే ప్రయత్నం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close