అంతా షర్మిలే.. బండి సంజయ్‌ పాదయాత్ర కనిపించనివ్వలే !

తెలంగాణ రాజకీయాల్లో ఒక రోజు మొత్తం షర్మిల డామినేట్ చేశారు. అది వ్యూహాత్మకమా.. లేకపోతే రాజకీయమా.. లేకపోతే.. అలా జరిగిపోయిందా అన్నది మనం చెప్పుకోలేం కానీ.. షర్మిల ధర్నా అరెస్ట్ ఎపిసోడ్ అంతా స్క్రిప్టింగ్ ప్రకారమే జరిగిందని అనుకోవడానికి చాలా ఉదాహరణలు మనకు కనిపిస్తూ ఉంటాయి.

షర్మిల ప్రగతి భవన్ వద్ద నిరసన చేయడానికి ప్లాన్ చేసుకున్నారని.. ఆమెను హౌస్ అరెస్ట్ చేసినట్లుగా ఉదయం పోలీసులు మీడియాకు చెప్పారు. లోటస్ పాండ్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. కానీ పదకొండు గంటల తర్వాత ఆమె పోలీసుల కన్నుగప్పి ప్రగతి భవన్‌కు బయలుదేరారని మీడియాకు సమాచారం వచ్చింది. అలా ఎలా సాధ్యమబ్బా అనుకునేలోపే.. అసలు డ్రామా పంజాగుట్ట దగ్గర ప్రారంభమైంది.

నర్సంపేటల దాడుల్లో ధ్వంసమైన వాహనాలను తీసుకుని షర్మిల ప్రగతి భవన్ వైపు వెళ్తూంటే పోలీసులు అడ్డుకున్నారు. కిందకు దిగేందుకు షర్మిల నిరాకరించారు. కాసేపు తోపులాటల తర్వాత క్రేన్‌ను తీసుకొచ్చి.. కారుతో సహా ఆమెను లిఫ్ట్ చేసి ఎస్ఆర్ నగర్‌ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ కూడా ఓ అరగంట డ్రామా నడిచింది. చివరికి బలవంతంగా కారు డోర్లు తెరిచి.. పోలీస్ స్టేషన్‌లోకి తరలించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినందుకు మూడు సెక్షన్ల కింద కేసులు పెట్టారు.

తర్వాత లోటస్ పాండ్ నుంచి వైఎస్ విజయలక్ష్మి బయలుదేరారు. అయితే పోలీసులు ఇంటి దగ్గరే అడ్డుకున్నారు. తర్వాత ఆమె కూడా కళ్లు గప్పి వెళ్లి కుమార్తెను పరామర్శించే సన్నివేశం ఉంటుందో లేదో సాయంత్రానికి తెలుస్తుంది.

ఈ వ్యవహారంలో మొత్తం గట్టిగా యాభై మంది వైఎస్ఆర్‌టీపీ కార్యకర్తలు లేనప్పటికీ.. కావాల్సినంత తోపులాటను క్రియేట్ చేయగలిగారు. మీడియా ప్రతినిధులు దృశ్యాల కోసం చిత్రీకరణ కోసం తోసుకున్నారు.

ఇలా షర్మిలనే మొత్తం మీడియా కవరేజీలో కనిపించారు. నిజానికి ఈ రోజు బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర నిర్మల్ జిల్లా భైంసా నుంచి ప్రారంభించారు. కానీ ఆ విషయం ఎవరికీ తెలియదు. సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్ కాలేకపోయింది. మొత్తం షర్మిలే కనిపించారు.

దీంతో ఇదంతా టీఆర్ఎస్ నేతలు వ్యూహాత్మకంగా చేసిన రాజకీయం అన్న అభిప్రాయం వినిపిస్తోంది.షర్మిలకు తెలుసో లేదో కానీ.. ఆమెను లోటస్ పాండ్ నుంచి బయటకు వదిలి పెట్టి.. స్ట్రీట్‌లో ధర్నా చేయడానికి అవకాశం కల్పించారని.. అక్కడ్నుంచి బండి సంజయ్ పాదయాత్రపైఎవరి దృష్టి పడకుండా చేసుకోవడంలో సక్సెస్ అయ్యారన్న అభిప్రాయం సహజంగానే వస్తోంది. కారణం ఏదైనా.. షర్మిల మాత్రం రోజంతా హైలెట్ అయ్యారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టైటిల్ దొరకలేదా త్రివిక్రమ్ ?

ఉగాదికి కొత్త సినిమా కబుర్లతో టాలీవుడ్ సందడిగా మారింది. కొత్తగా ప్రారంభమైన సినిమాలతో పాటు సెట్స్ పై వున్న చిత్రాలు వరుస అప్డేట్ లతో ఫ్యాన్స్ ని ఖుషి చేశాయి. అయితే మహేష్...

పవన్ పని వారం రోజులే…

డేట్లు ఇచ్చే ముందు కాస్త ఆలోచిస్తారు కానీ ఒకసారి డేట్లు ఇచ్చిన తర్వాత చాలా వేగంగా పని చేస్తారు పవన్ కళ్యాణ్. వకీల్ సాబ్ కూడా ఇలానే చాలా ఫాస్ట్ గా...

క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వారిపై సరైన సమయంలో చర్యలు : సజ్జల

వైసీపీ నుంచి టీడీపీకి క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వారెవరో గుర్తించామని కానీ వెంటనే చర్యలు తీసుకోబోమని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. వెంటనే చర్యలు...

ఖుషీ.. ఏమిటా రెండు ప్రపంచాలు ?

నిన్ను కోరి, మజిలీ చిత్రాలతో సెన్సిబుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు శివనిర్వాణ. ఇప్పుడు విజయ్ దేవరకొండ, సమంత తో ఖుషీ సినిమా రూపొందిస్తున్నాడు. సెప్టెంబర్ 1న రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close