షర్మిల పార్టీ రేంజ్‌ని డిసైడ్ చేయనున్న పాదయాత్ర !

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అక్టోబర్ 20వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ పాదయాత్రకు ప్రజాప్రస్థానం అని పేరు పెట్టారు. వైఎస్ పాదయాత్రను ప్రారంభించిన చేవెళ్ల నుంచే షర్మిల కూడా ప్రారంభిస్తారు. అలాగే ముగింపు కూడా చేవెళ్లలోనే ఉంటుంది. 90 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ పాద‌యాత్ర సాగుతుంద‌ని షర్మిల తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంక్షేమ పాలన అందిస్తామన్న నమ్మకాన్ని పాదయాత్ర ద్వారా ప్రజలకు కల్పిస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు. అలాగే ఇప్పుడు చేస్తున్నమంగళవారం దీక్షలు కూడా చేయాలని నిర్ణయించారు.

షర్మిల పార్టీకి నిర్మాణం లేదు. పార్టీలో చేరేందుకు కూడా ఎవరూ ఆసక్తి చూపించడంలేదు. ఉన్న నేతలు ఒక్కొక్కరు మొహం చాటేస్తున్నారు. ఇలాంటి సమయంలో షర్మిల ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. పాదయాత్ర చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. జాతీయ పార్టీలే ఖర్చులో పోటీ పడలేని పరిస్థితి ఉంటుంది. అయినా షర్మిల మాత్రం ధైర్యంగాఅడుగు ముందుకేస్తున్నారు. ఆమె పాదయాత్రకు జనం వెళ్లకుండా కట్టడి చేయడానికి అన్ని పార్టీలు ప్రయత్నిస్తాయి. అందులో సందేహం లేదు. ఈ కారణంగా ఆమె పాదయాత్ర వెలవెలబోతే అది పార్టీ ఇమేజ్‌పై ప్రభావం చూపుతుంది.

ఇప్పటికే రాజకీయాల్లో పాదయాత్రలు రొటీన్ అయిపోయాయి. తెలంగాణలో బిజెపి అద్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు. టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. వైఎస్ఆర్ అభిమానులే తన బలం అనుకుంటున్న షర్మిల తనది ప్రత్యేకమైన పాదయాత్రగా భావిస్తున్నారు. ఈ పాదయాత్రనే ఆమె పార్టీ పరిస్థితిని డిసైడ్ చేసే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘పుష్ప’లో రంగమ్మ మంగమ్మ మ్యాజిక్

https://www.youtube.com/watch?v=C70GJYVoZ4Y ''రంగస్థలం' లాంటి క్లాసిక్ తర్వాత సుకుమార్ చాలా గ్యాప్ తీసుకున్నారు. అల్లు అర్జున్ డేట్స్ దొరికేవరకూ వేరే ప్రాజెక్ట్ ముట్టుకోలేదు. చాలా హార్డ్ అండ్ గ్రౌండ్ వర్క్ చేసి ‘పుష్ప' ని సెట్స్...

బీ టౌన్ టాక్ : అల్లు అర్జున్ రాక్ స్టార్

అల్లు అర్జున్ పేరు బాలీవుడ్ న్యూస్ లో హాట్ టాపిక్ అయ్యింది. నిర్మాత కరణ్ జోహార్ అల్లు అర్జున్ ని రాక్ స్టార్ గా పిలిచారు. బుధవారం జరిగిన 'వరుడు కావలెను' ప్రీ...

వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయ ఇన్నింగ్స్ !?

హైదరాబాద్ వెరీ వెరీ స్పెషల్ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయనతో తాము ఇప్పటికే సంప్రదింపులు జరిపామని చేరేందుకు అంగీకరించారని అంటున్నారు. సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి,...

ఆఫీసర్ “మమత” అంటే మజాకానా ?

తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాల్లోని ముఖ్య నేతలు టీఆర్ఎస్‌లో చేరి పదవులు అందుకున్న తర్వాత ఉద్యోగ సంఘాల్లో ద్వితీయ శ్రేణి నాయకత్వం వచ్చింది. అలాంటి వారిలో టీజీవో అధ్యక్షురాలిగా ఉన్న మమత...

HOT NEWS

[X] Close
[X] Close