మీడియా వాచ్ : రాధాకృష్ణతో షర్మిల స్పెషల్ ఇంటర్యూ..!

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ… మరో సిక్సర్ కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైఎస్ కుటుంబానికి బద్దశత్రువుగా మొదటి నుంచి అందరూ చూసే రాధాకృష్ణ…అతి త్వరలోనే వైఎస్ షర్మిలతో స్పెషల్ ఇంటర్యూ ప్లాన్ చేస్తున్నారు. షర్మిల టీం నుంచే ఈ మేరకు వచ్చిన సూచనకు.. రాధాకృష్ణ అంగీకారం తెలిపారని మీడియా వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఏబీఎన్‌లో గతంలో వేమూరి రాధాకృష్ణ ప్రతీ వారం ఇంటర్యూలు చేసేవారు. ఓహెన్ హార్ట్ విత్ ఆర్కే పేరుతో ఆ ఇంటర్యూలు వారాంతాల్లో ప్రసారమయ్యేవి. మొదట్లో వివాదాస్పద ప్రశ్నలతో ఆప్రోగ్రాంకు ఆర్కే మంచి క్రేజ్ తెచ్చి పెట్టారు. చాలా కాలం పాటు నడిచిన ఆ ప్రోగ్రాం.. సరైన సెలబ్రిటీల్లేక ఆగిపోయింది. మళ్లీ ఇప్పుడు ప్రారంభించాలనే ఆలోచన చేస్తున్నారు.

షర్మిలతోనే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాంను రీలాంఛ్ చేయాలనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయని అంటున్నారు. రాధాకృష్ణతో ఇంటర్యూ అంటే… షర్మిల కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. వైఎస్ కుటుంబంలో విబేధాలు ఉన్నాయని చెప్పేందుకు ఆయన ఈ ఇంటర్యూను ఉపయోగించుకుంటారు. అయితే షర్మిల మొత్తంగా రాజకీయ నేతగా మారారు కాబట్టి.. ఆమె ఎలాంటి ప్రొజెక్షన్ కోరుకుంటుందో..,. అదే ఇంటర్యూలో వెల్లడించే అవకాశం ఉంది. కుటుంబంలో గొడవలు ఉన్నాయని బయట పెట్టాలనుకుంటే పెడతారని అంటున్నారు. అయితే ఇతర మీడియాలకు కాకుండా షర్మిల ఆంధ్రజ్యోతికి ప్రాధాన్యం ఇవ్వడమే ఆసక్తి రేపుతోంది.

షర్మిల తెలంగాణలో తన రాజకీయ పార్టీకి మీడియా సహకారం ఎంతో అవసరం అని నమ్ముతున్నారు. సోదరుడి మీడియా కవరేజీ ఇవ్వడం లేదు. ఇతర మీడియాలు కవరేజీ ఇస్తున్నా.. వాటి అజెండా వేరు. తమ తమ యజమానులకు అవసరమైన పెద్దలకు ఉపయోగపడేంత వరకూ షర్మిలకు హైప్ ఇస్తాయి. తర్వాత కాడి కింద పడేస్తాయి. అందుకే షర్మిల తెలంగాణలో ఆంధ్రజ్యోతిని నమ్ముకుంటున్నట్లుగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రమేష్ ఆస్పత్రికి రఘురామ..! హైకోర్టు ఆదేశాలనైనా పాటిస్తారా..?

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అయినా రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించకూడదనుకున్న సీఐడీ అధికారులు.. ప్రభుత్వానికి షాక్ తగిలింది. సీఐడీ కోర్టు ఆదేశించించినట్లుగానే.. రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించాలని స్పష్టం చేసింది. గుంంటూరు ప్రభుత్వాసుపత్రిలో...

జైలుకు ఆర్ఆర్ఆర్.. కోర్టును లైట్ తీసుకున్న సీఐడీ..!

ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు కోర్టులను లెక్క చేయలేదు. ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్యం అందించాలని ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టేసి.. జిల్లా జైలుకు తరలించేశారు. ఆయనకు వైద్యం అందించే విషయంలోనే కాదు.. వైద్య నివేదిక...

టీవీ9 ప్రాథమిక నివేదిక.. ఆర్ఆర్ఆర్‌కి సొరియాసిస్..!

రఘురామకృష్ణరాజు కాళ్లకు ఉన్న దెబ్బల గురించి టెస్టులు చేసి నివేదిక ఇవ్వాలని సీఐడీ కోర్టు.. హైకోర్టులు ఆదేశించాయి. వైద్యులు నివేదికల కోసం.. కోర్టు ఇచ్చిన సమయం దాటి మరీ టెస్టులు చేస్తున్నారు. నివేదికలు...

రేవంత్‌కు పోలీసులే అలా ప్రచారం చేసి పెడతారు..!

హైదరాబాద్‌లో రూ. ఐదు రూపాయల భోజన కేంద్రాలయిన అన్నపూర్ణ క్యాంటీన్లు కొనసాగుతాయని మీడియాకు సమాచారం ఇచ్చిన తెలంగాణ సర్కార్.. నిజానికి ఆపేసింది. దాంతో పేదలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చాలా చోట్ల టీఆర్ఎస్...

HOT NEWS

[X] Close
[X] Close