వైఎస్ రాజారెడ్డి .. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారుసడని వైఎస్ షర్మిల తేల్చేశారు. ఎన్ని కుక్కలు మొరిగినా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడు కాకుండడా పోరని అన్నారు. తన కుమారుడికి రాజారెడ్డి అని పేరు పెట్టింది వైఎస్సేనన్నారు. అప్పుడే తన కుమారుడ్ని చూసి వైసీపీకి భయమెందుకని ప్రశ్నించారు. జగన్ రెడ్డి .. మోదీకి దత్తపుత్రుడని.. అందుకే సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలియచేయలేదన్నారు.
వైఎస్ రాజారెడ్డిని రాజకీయాల్లోకి తేవాలనుకుంటున్న షర్మిల.. ఇప్పుడిప్పుడే తనతో పాటు రాజకీయ పర్యటనలకు తీసుకెళ్తున్నారు. ఇటీవల కర్నూలులో ఉల్లి మార్కెట్ ను సందర్శించడానికి వెళ్లినప్పుడు తీసుకెళ్లారు. దాంతో వైసీపీ ఫ్యాన్స్ ..సోషల్ మీడియా కార్యకర్తలు మరోసారి వైఎస్ షర్మిలను టార్గెట్ చేశారు. షర్మిల ఇంటి పేరు వైఎస్ కాదని.. అంటున్నారు. కుమారుడికి ఇంటి పేరుగా.. తండ్రి ఇంటి పేరు వస్తుందని.. రాజారెడ్డికి .. వైఎస్ రాజారెడ్డి పేరు ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు.
ఇలాంటి విమర్శలు చాలా ఉన్నాయి. జగన్ రెడ్డికి ప్రత్యామ్నాయం అవుతాడని జరుగుతున్న ప్రచారంతో ఆయనను ముందుగానే టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. షర్మిల తన కుమారుడ్ని.. వైఎస్ అసలైన వారసుడిగా ప్రొజెక్ట్ చేయడానికి.. జగన్.. బీజేపీతో సన్నిహితంగా ఉండటాన్ని ఉపయోగించుకుంటున్నారు.