ప్రభుత్వంపై నమ్మకం లేదని వైఎస్ వివేకా కుమార్తె పిటిషన్..!

వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత .. హైకోర్టులో పిటిషన్ వేశారు. తన తండ్రి హత్య కేసులో ఏపీ పోలీసుల విచారణపై నమ్మకం లేదని.. సీబీఐకి ఇవ్వాలని అందులో కోరారు. ఇప్పటికే వివేకా భార్య కూడా.. సీబీఐకి అప్పగించాలని పిటిషన్ వేసి ఉన్నారు. అలాగే.. కుట్ర పూరితంగా.. వివేకా హత్య కేసును.. రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి వాడుకుంటున్నారంటూ.. ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవిలు కూడా.. హైకోర్టులో పిటిషన్లు వేసి ఉన్నారు. వీరందరికి తోడుగా.. కొత్తగా సునీత కూడా.. పిటిషన్ వేశారు. దీంతో.. జగన్ కుటుంబం.. వివేకా హత్య కేసు విషయంపై.. వివాదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

వైఎస్ వివేకా హత్య జరిగినప్పుడు.. ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఆ సమయంలో టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయ విమర్శలు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో.. వైఎస్ వివేకా కుమార్తె సునీత, తన భర్తతో కలిసి పలుమార్లు మీడియా సమావేశాలు నిర్వహించారు. పోలీసుల విచారణపై నమ్మకం లేదని.. సీబీఐకి ఇవ్వాలని వాదించారు. ఎన్నికల సంఘానికి కూడా పిటిషన్ పెట్టుకున్నారు. ఎన్నికలు ముగిసి.. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వారు సైలెంటయిపోయారు. వివేకా హత్య కేసు విచారణలో అసలు ఏమీ తేలకపోతూండటం.. విచారణాధికారుల్ని ప్రభుత్వం పదే పదే మార్చడంతో… కేసు విషయంలో రాజకీయ దుమారం కూడా రేగింది.

అసలు నిందితుల్ని వదిలేసి.. రాజకీయ ప్రత్యర్థులకు నోటీసులు ఇచ్చి.. హడావుడి చేస్తూండటంతో.. కేసు తప్పుదోవ పడుతుందన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో.. ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి సీబీఐ విచారణ కోసం హైకోర్టులో పిటిషన్లు వేశారు. అన్న సీఎంగా ఉన్నప్పటికీ.. సీబీఐ విచారణ కోరుతూ.. సునీత హైకోర్టులో పిటిషన్ వేయడంతో.. కుటుంబసభ్యుల మధ్య కూడా సఖ్యత లేదన్న వాదన వినిపిస్తోంది. తన తండ్రిని హత్య చేసిన వారిని.. ఉపేక్షిస్తున్నారన్న అనుమానం.. సునీతలో ఉందని అంటున్నారు. కేసును పీటముడి వేయడానికా అన్నట్లుగా.. పోలీసులు పదిహేను వందల మందికిపైగా అనుమానితులన్నట్లుగా హైకోర్టుకు తెలిపారు. ఇప్పుడు సునీత పిటిషన్ హాట్ టాపిక్ అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com