కాంగ్రెస్‌ను ‘పిల్ల టీడీపీ’ అంటున్న పిల్ల కాంగ్రెస్

హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిననాటినుంచి తెలుగుదేశం నేతలు ఆ పార్టీకి ‘పిల్లకాంగ్రెస్’ అని నిక్ నేమ్ పెట్టి ఎద్దేవా చేస్తుండటం తెలిసిందే. అంటే వాళ్ళర్థం కాంగ్రెస్ పార్టీనుంచి పుట్టిన పార్టీ అని. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. వైసీపీ నేతలు కాంగ్రెస్‌ను పిల్ల టీడీపీ అని సంబోధించటం మొదలు పెట్టారు. వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఇవాళ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ బతుకంతా పిల్ల టీడీపీలా బతకటమేనని అన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి ఆంధ్రప్రదేశ్ పర్యటనపై స్పందిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించటంవల్లే రైతు ఆత్మహత్యలు పెరిగాయని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని రాహుల్ ఏపీలో పర్యటిస్తారని ప్రశ్నించారు. దివంగత వైఎస్సార్ పేరును ఛార్జిషీట్‌లో చేర్చిన విషయాన్ని మర్చిపోయారా అని అడిగారు. కాంగ్రెస్ తమ ఓటుబ్యాంకును టీడీపీకి మళ్ళించిందని ఆరోపించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

ఆయన 20 మంది ఎమ్మెల్యేలతో వచ్చేత్తా అంటే కేసీఆరే వద్దన్నారట !

కాంగ్రెస్ ప్రభుత్వం తన దయా దాక్షిణ్యాల మీదనే ఆధారపడి ఉందని అంటున్నారు కేసీఆర్. ఎందుకంటే ఇరవై మంది ఎమ్మెల్యేలను తీసుకుని వచ్చే ఓ సీనియర్ నేత .. కేసీఆర్ తో టచ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close