ఈ ప్రత్యేక ఆరాటం అంతా హోదా కోసమేనా.. లేక..?

ప్రత్యేక హోదా కోరుతూ రేపు ఆంధ్రా బంద్ కి పిలుపునిచ్చింది వైకాపా పార్టీ. రేపు రక్షా బంధన్ కనుక బంద్ ని వాయిదా వేసుకోమని ప్రజలు కోరుతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలపై ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ స్పందిస్తూ “రేపటి బందే రాష్ట్రానికి రక్షాబంధన్ వంటిది. కనుక ప్రత్యేక హోదా కోసం చేస్తున్న ఈ బంద్ కి అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు. కానీ ఇంతకాలం ప్రత్యేక హోదా ఊసే ఎత్తని వైకాపా ఇప్పుడు దానిపై ఎందుకు అకస్మాత్తుగా శ్రద్ధ చూపిస్తోంది? అనే సందేహం కలగడం సహజం. రాహుల్ గాంధీ అనంతపురం పర్యటనకు వచ్చినప్పుడు ఈ అంశంపై వైకాపా పోరాటమే చేయడం లేదని, ఆ పార్టీ కంటే తమ పార్టీయే బాగా పోరాడుతోందని చెప్పిన తరువాతే జగన్ అప్రమత్తమయ్యి డిల్లీ వెళ్లి ప్రత్యేక దీక్ష చేసి వచ్చారు.

అంటే ప్రత్యేక హోదా కోసం కాక, కాంగ్రెస్ పార్టీ కంటే తన పార్టీ ఎక్కడ వెనకబడిపోతుందో అనే ఆందోళనతోనే ఆయన దీనిపై పోరాటం ఆరంభించినట్లు స్పష్టమవుతోంది. కానీ తమ పోరాటం రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకేనని వైకాప నేతలు చెపుకొంటున్నారు. ఇప్పటికే దీనికోసం తిరుపతి, నెల్లూరు, గుడివాడ పట్టణాలలో ముగ్గురు ఆత్మహత్యలు చేసుకొన్నారు. ఈరోజు కర్నూలులో లోకేష్ అనే మరొక యువకుడు మరణించినట్లు సమాచారం. ప్రత్యేక హోదా గురించి ఎంతగా రభస జరిగితే అంతగా ఆత్మహత్యలు కూడా పెరుగుతున్నాయనే సంగతి అర్ధమవుతోంది. అటువంటప్పుడు వైకాపా రేపు రాష్ట్ర బంద్ కి పిలుపునివ్వడం సమంజసమా? అని పునరాలోచించుకొంటే బాగుంటుంది.

కానీ ఆ పార్టీ అధ్యక్షుడు తమ బంద్ ని ఎవరయినా అడ్డుకొంటే చరిత్ర హీనులు అవుతారని చెపుతున్నారు. ప్రత్యేక హోదా సాధించేవరకు తమ పార్టీ పోరాడుతుందని, తమ పోరాటంతో చంద్రబాబు నాయుడునే కాదు ఆయన బాబు (తండ్రి) కూడా దిగివస్తారు. ప్రత్యేక హోదా కోసం ప్రజలు బలిదానాలు చేసుకొంటున్నా ఆయన కేంద్రంలో తన ఇద్దరు మంత్రుల చేత రాజీనామాలు చేయించడం లేదని విమర్శించారు. ప్రత్యేక హోదా సాధించలేని చంద్రబాబు నాయుడు హోదా ప్యాకేజీ ఏదయినా ఒకటేనని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

జగన్ మాటలను వింటే ఆయన మొదలుపెట్టిన ఈ ప్రత్యేక పోరాటం హోదా కోసం కాక తన రాజకీయ ప్రత్యర్ధి చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేసుకొని చేస్తున్న పోరాటమని స్పష్టమవుతోంది. నిజానికి ఈ అంశం కేంద్రం పరిధిలో ఉంది కనుక ఆయన చంద్రబాబు నాయుడు కంటే ముందుగా కేంద్రప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోడీని, రాష్ట్రానికి తప్పకుండా ప్రత్యేక హోదా ఇస్తామని పదేపదే చెప్పిన వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్, సుజనా చౌదరిలను గట్టిగా నిలదీయాలి. కానీ జగన్ తన విమర్శలన్నీ చంద్రబాబు నాయుడుకే పరిమితం చేయడం గమనిస్తే జగన్ లక్ష్యం ప్రత్యేక హోదా సాధించడం కాదు, ఆ అంశంతో చంద్రబాబు నాయుడుని దెబ్బతీయడమే నని స్పష్టం అవుతోంది. జగన్ ఇద్దరు తెదేపా కేంద్రమంత్రుల రాజీనామాల గురించి ప్రస్తావించడం గమనిస్తే, ఈ ప్రత్యేక అంశాన్ని అడ్డుపెట్టుకొని తెదేపా-బీజేపీల స్నేహాన్ని దెబ్బ తీయాలని ఇంకా ప్రయత్నిస్తున్నట్లే అర్ధమవుతోంది.

ఇదివరకు రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు కూడా జగన్ సమైక్యాంధ్ర ఉద్యమాలు చేసారు. ఒకపక్క రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయిపోతున్నా దానిని ఏవిధంగా అడ్డుకోవాలో ప్రయత్నించకుండా, రాష్ట్ర విభజన తరువాత జరిగే సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు తన పార్టీకి అఖండ మెజార్టీతో గెలిపిస్తే తను రాష్ట్రం విడిపోకుండా చక్రం తిప్పుతానని చెప్పుకొన్నారు. ఒకసారి రాష్ట్ర విభజన జరిగిపోయిన తరువాత దానిని ఆయన మళ్ళీ ఏవిధంగా కలుపుతామని హామీ ఇచ్చారో తెలియదు కానీ ఎన్నికలు మొదలవగానే తన సమైక్యాంధ్ర ఉద్యమాన్ని పక్కనపడేశారు. కనుక ఇప్పుడు మొదలుపెట్టిన ప్రత్యేక హోదాపై పోరాటం కూడా తనకు, తన పార్టీకి లబ్ది చేకూర్చుతున్నంత వరకే నడిపించవచ్చును.

ఈవిధంగా ఆయన తన పార్టీకి రాజకీయ మైలేజీ సాధించేందుకు, ప్రత్యర్ధి చంద్రబాబు నాయుడుపై పగ తీర్చుకోనేందుకే ఈ ప్రత్యేక హోదా పోరాటాలు చేస్తున్నప్పుడు, అటువంటి రాజకీయ పార్టీలు, నేతలు చేస్తున్న రాష్ట్ర బంద్ లో ప్రజలు ఎందుకు పాల్గొనాలి? రాజకీయ పార్టీలు ఆడుకొంటున్న ఈ రాజకీయ చదరంగంలో మునికోటి, లక్ష్మయ్య, ఉదయ్ భాను, లోకేష్ వంటి సామాన్యులు పావులుగా మారి ప్రాణాలు పోగొట్టుకోవడం ఎందుకు? ప్రజలూ ఆలోచించాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close