పవన్ కల్యాణ్ రాజోలు పర్యటనలో ఓ వైసీపీ కార్యకర్త చొరబడటమే కాకుండా పవన్ కల్యాణ్‌కు అత్యంత సన్నిహితంగా ఉంటూ అనుమానాస్పదంగా వ్యవహరించాడు. పవన్ పర్యటన పూర్తయిన తర్వాత ఈ విషయాన్ని గుర్తించారు. వెంటనే కోనసీమ జిల్లా ఎస్పీ దృష్టికి విషయం తీసుకెళ్లారు. అతను ఎవరు.. ఎందుకు పవన్ కార్యాక్రమంలోకి చొరబడ్డాడు.. ఎందుకు రెక్కీ చేశాడన్న అంశాలను గుర్తించాలని కోరారు. దీంతో పోలీసులు వెంటనే ఈ అంశంపై ఆరా తీస్తున్నారు.
సాధారణంగా పవన్ కల్యాణ్ పర్యటనలో పూర్తి స్థాయి ప్రోటోకాల్ ఉంటుంది. పాసులు ఉన్నవారు మాత్రమే పవన్ కు సమీపంగా వెళ్లగలరు. అయితే ఈ వ్యక్తి ఎలా పవన్ కల్యాణ్ తో పాటు సన్నిహితంగా ఎలా ఉన్నాడో తెలియాల్సి ఉంది. ప్రాథమికంగా అతన్ని.. వైసీపీలో చురుకుగా ఉండే కార్యకర్తగా గుర్తించారు. పోలీసులు అతని గురించి ఆరా తీస్తున్నారు. పవన్ కల్యాణ్‌కు అత్యంత సమీపంగా ఎలా వెళ్లగలిగాడు.. ఎవరైనా ప్రత్యేకంగా పంపించారా అన్న అంశాలపై ఆరా తీస్తున్నారు. అతని ఉద్దేశాన్ని.. కాల్ రికార్డులను కూడా పరిశీలించే అవకాశం ఉంది.
ఇాలా పవన్ కల్యాణ్ పర్యటనలో అపరిచితుల హడావుడి ఇది మొదటి సారి కాదు. గతంలో ఓ సారి మన్యం పర్యటనకు వెళ్లిప్పుడు ఓ వ్యక్తి ఐపీఎస్ పేరుతో హడావుడి చేశాడు. పవన్ కల్యాణ్ పర్యటన అయిపోయిన తర్వాతనే అతను నకిలీ ఐపీఎస్ అని గుర్తించారు. అతను ఐపీఎస్‌నని మోసాలు చేస్తూంటాడు.. పవన్ కల్యాణ్ పర్యటనలో పాల్గొని నిజమైన ఐపీఎస్‌గా ఫోజులు కొట్టి మరిన్ని మోసాలు చేయాలనుకున్నాడు. కానీ పోలీసులు గుర్తించారు. ఇప్పుడు రాజోలు వైసీపీ కార్యకర్తం ఏం చేయాలనుకున్నాడో పోలీసులు తేల్చనున్నారు.