వైసీపీ అసెంబ్లీ బహిష్కరణ ?

వైసీపీ అధినేత జగన్ రెడ్డి దేశం మొత్తం తన వైపు తిరిగి చూసేలా నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. గెలిచిన ఎమ్మెల్యేలతో సహ సహా తమపార్టీ తరపున ఎవరూ అసెంబ్లీకి వెళ్లకూడదని. .. అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం తీసుకోవాలని ఆయన యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వరని.. అవమానించడమే లక్ష్యంగా పెట్టుకుంటారని… ప్రజాస్వామ్య యుతంగా అసెంబ్లీ జరుగుతుందన్న నమ్మకం లేదన్న కారణాన్ని ఆయన చెప్పే అవకాశం ఉంది.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు 24వ తేదీ నుంచి జరగనున్నాయి. 22వ తేదీన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. మామూలుగా అయితే విస్తృత స్థాయి సమావేశం అవసరం లేదు. గెలిచిన ఎమ్మెల్యేలతో ఎల్పీ భేటీ నిర్వహించి నాయకుడ్ని ఎన్నుకుంటారు. ఇప్పటి వరకూ అలాంటి ఆలోచన చేయలేదు. నేరుగా విస్తృత స్థాయి సమావేశానికి పిలుపునిచ్చారు. అంటే ఖచ్చితంగా అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.

గతంలో కూడాజగన్ ఓ సారి అసెంబ్లీ బ హిష్కరణ నిర్ణయం తీసుకున్నారు. అసలు కారణం తాను పాదయాత్రలో ఉంటే ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకూడదన్న ఉద్దేశం. ప్రచారం చేసుకుంది మాత్రం… ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయకపోవడానికి నిరసన. అప్పుడు కూడా ఇలా విస్తృత స్థాయి సమావేశాన్ని లోటస్ పాండ్‌లో నిర్వహించి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కూడా అదే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

అయితే శాసనమండలిలో బలం ఉన్నందున.. మండలికి మాత్రం ఎమ్మెల్సీలు హాజరవుతారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీ ఉద్యోగ సంఘం నేతలు ఎక్కడ ?

వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు వాయిస్ లేకుండా చేసింది. ఉద్యోగ సంఘం నేతల్ని ఉద్యోగుల వాయిస్ కాకుండా తమ వాయిస్ వినిపించేలా చేయడంతో ఇప్పుడు ప్రభుత్వం మారడంతో వారికి నోరు పెగలడం...

తననూ లెక్కేసుకోవాలంటున్న రమణదీక్షితులు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి రమణదీక్షితులుఓ విన్నపం చేశారు. సోషల్ మీడియాలో ఈ విన్నపం చేసుకున్నారు. గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నింటినీ లిస్టవుట్ చేసుకుని తీసేయాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి.. ఆ...

ఫ్లాష్ బ్యాక్‌: జ‌మున‌ని ఎందుకు బ్యాన్ చేశారు?

కొన్నేళ్ల క్రితం ప్ర‌కాష్‌రాజ్‌ని 'మా' అసోసియేష‌న్ బ్యాన్ చేసిన సంగ‌తి ఇప్ప‌టికీ ఏదో ఓ సంద‌ర్భంలో త‌ల‌చుకొంటుంటాం. ఆ త‌ర‌వాత ఏ న‌టుడ్నీ అలా బ్యాన్ చేయ‌లేదు. కానీ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే......

టీడీపీ క్యాడర్‌పై కేసుల ఎత్తివేత !

జగన్ రెడ్డి జమానాలో ఎఫ్ఐఆర్‌ల విప్లవం నడిచింది. నిజమైన రౌడీలు, ఖునీకోరులు హాయిగా తిరుగుతూంటే... టీడీపీ కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియాపోస్టులు పెట్టినా వేధింపులు ఎదుర్కొన్నారు. కేసుల పాలయ్యారు. టీడీపీ అధికారంలోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close