“కన్నా”కూ టీడీపీ లింకులు అంటగట్టేస్తున్న వైసీపీ..!

కన్నా లక్ష్మినారాయణను టీడీపీ ఏజెంట్‌గా ప్రచారం చేయడం ప్రారంభించింది.. వైసీపీ. ఆ పార్టీ అధికార మీడియా సాక్షి. ఆ పార్టీ నేతలు.. కన్నాకు టీడీపీతో లింక్ పెట్టి… విమర్శలు చేయడం.. దాన్ని ప్రత్యేక కథనాల రూపంలో.. సాక్షి ప్రసారం చేయడం కామన్‌గా మారిపోతోంది. కన్నా లక్ష్మినారాయణపై ఆంధ్రప్రదశ్ అధికార పార్ట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇసుక విధానం దగ్గర్నుంచి పోలీసుల పాలన వరకూ.. కన్నా లక్ష్మినారాయణ తన విమర్శలను ఏ మాత్రం.. కంట్రోల్ లో ఉంచుకోవడం లేదు. ఇతర బీజేపీ నేతల్లో కొంత మందికి… జగన్మోహన్ రెడ్డిపై సానుభూతి ఉంది. వారు పెద్దగా మాట్లాడటం లేదు. కానీ.. కన్నా మాత్రం ఏపీ బీజేపీ అధ్యక్షుడి హోదాలో.. తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఈ విషయం అధికార పార్టీకి మింగుడు పడటం లేదు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేస్తున్న విమర్శలనే… కన్నా లక్ష్మినారాయణ చేస్తున్నారని.. ఆయన స్క్రిప్ట్ టీడీపీ ఆఫీసు దగ్గర్నుంచి వస్తోందా.. అని వైసీపీ నేతలు ప్రత్యేకంగా ప్రెస్‌మీట్లు పెట్టి మరీ విమర్శలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం… కన్నా లక్ష్మినారాయణ గవర్నర్ .. బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి.. ఏపీ సర్కార్ పై ఫిర్యాదు చేశారు. ఇసుక కొరత లేకుండా.. ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. కొన్ని లక్షల మంది ఉపాధి కోల్పోయారని.. ప్రభుత్వ నిర్వాకం వల్ల వారంతా ఆకలితో అలమటిస్తున్నారని విమర్శించారు. ఇలా గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం… వైసీపీకి నచ్చలేదు. చంద్రబాబు చేస్తున్న ఆరోపణలనే… కన్నా చేస్తున్నారని.. ఎదురుదాడి ప్రారంభించారు. కానీ.. కన్నా చేసిన ఆరోపణలు.. నిజమో కాదో మాత్రం చెప్పడానికి అంగీకరించలేదు.

నిజానికి కన్నా లక్ష్మినారాయణకు… చంద్రబాబు అంటే.. ఎంత అయిష్టతో.. ఆయన రాజకీయాలను పరిశీలించేవారికి సులువుగనే అర్థం అవుతుంది. చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేయడంలో కన్నా ముందుండేవారు. ఎన్నికలకు ముందు… వైసీపీలో చేరేందుకు కన్నా సిద్ధమయ్యారు. అమిత్ షా జోక్యం చేసుకోవడంతో ఆగిపోయారు. ఇప్పుడు.. బీజేపీ విధానం ప్రకారం… వైసీపీ తప్పుల్ని ఎత్తి చూపుతూండటంతో.. కన్నా.. వైసీపీకి కంటగింపుగా మారారు. పదవిని కాపాడుకోవడానికి తంటాలు పడుతున్నారని సెటైర్లు ప్రారంభించారు. మొత్తానికి.. వైసీపీని ఎవరు విమర్శించినా.. వారిని టీడీపీ ఖాతాలో వైసేయడం.. వైసీపీకి కామన్‌గా మారిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ బెంగళూర్ టూర్.. కథేంటి?

ఇప్పటికే ఇండియా కూటమికి చేరువయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం గుప్పుమంటోన్న నేపథ్యంలో జగన్ బెంగళూర్ పర్యటన సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే హడావిడిగా బెంగళూర్ నుంచి వచ్చి..ఆపై ఢిల్లీ ధర్నా అని చెప్పి...అక్కడి...

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close