క్యాడర్‌ దివాలా – క్షేత్ర స్థాయిలో వైసీపీలో స్తబ్దత !?

వైసీపీ పరిస్థితి క్షేత్ర స్థాయిలో దారుణంగా మారిపోతోంది. ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం పార్టీ పెద్దలను నమ్ముకుని పూర్తి స్థాయిలో దివాల తీశారు. పార్టీ కోసం పదేళ్లు కష్టపడి.. ఖర్చు పెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చాక… మన ప్లేట్లో మన బిర్యానీ పెట్టకపోతే.. బిర్యానీ ఆశచూపి ఉన్నది కూడా ఖర్చు పెట్టించారు. దీంతో ఆ పార్టీ క్యాడర్ ఇప్పుడు నిరాశా నిస్పృహల్లో ఉంది. పార్టీ కార్యక్రమాలు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.

నామినేటెడ్ పోస్టులంటూ బిస్కెట్లు విసిరే ప్రయత్నం చేసినా కనిపించని స్పందన

ఇటీవల నామినేటెడ్ పోస్టుల భర్తీ అంటూ నేతలకు బిస్కెట్లు వేసే ప్రయత్నం చేశారు. పార్టీ కార్యక్రమాలను హుషారుగా ఎవరు ప్రజల్లోకి తీసుకెళ్తారో వారికే పదవులు ఇస్తామని సంకేతాలు పంపారు. అసలు ఎలాంటి స్పందన లేకపోవడంతో.. చివరికి పాత వారికే కంటిన్యూ చేస్తామని చెబుతున్నారు. నిజానికి ఆ నామినేటెడ్ పోస్టుల వల్ల పైసా ప్రయోజనం లేదు. జీతం ఇవ్వరు. కుర్చీ ఉండదు. కనీసం గుర్తించే వారుకూడా ఉండరు. పేరుకు మాత్రమే పదవి. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వారే కనీసం లాబీయింగ్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు పదవులు అంటగట్టి పార్టీకోసం ఖర్చు పెట్టించి ఉన్నది కూడా నాకేస్తారేమోన్న భయంతో చాలా మంది పదవులకు ముందుకు రావడం లేు.

గ్రామాల్లో పార్టీ కార్యక్రమాలు చేపట్టే వారే కరవు !

గ్రామాల్లో వైసీపీ కార్యక్రమాలు చేపట్టే వారే కరవయ్యారు. ప్రభుత్వ ప్రయోజనం పొందుతున్న నేతలు ఎవరైనా గ్రామాల్లో ఉంటే.. అలాంటి గ్రామాల్లో కొన్ని చోట్ల తూతూ మంత్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ పరమైన కార్యక్రమాలు దాదాపుగా అసలు చేయడం లేదు . వైఎస్ జయంతి, వర్థంతులు.. పార్టీ ఆవిర్భావాలు వంటివి కూడా చేయడం లేదు. అధికారంలోకి వచ్చిన కొత్తలో ఊళ్లలో ఎక్కడ చూసినా వైసీపీ ఫ్లెక్సీలు కనిపించేవి. ఇప్పుడు డబ్బులు దండగనుకుంటున్న క్యాడర్ సైలెంట్ గా ఉంటున్నారు.

ఏదైనా వాలంటీర్లు, గ్రామ వారు సచివాలయ సిబ్బందే !

వైసీపీక్యాడర్ చేయాల్సిన పనిని వాలంటీర్లు, గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో చేయిస్తున్నారు. దీంతో వైసీపీ క్యాడర్ పార్టీతో డిటాచ్ అయిపోయింది. తమకు ఏమీ ప్రయోజనం లేదన్న భావనకు వస్తున్నారు. ఇలా కనీసం ఇరవై శాతం మంది క్యాడర్ దూరమయి ఉంటారని వైసీపీ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. మరో వైపు టీడీపీ తరపున కార్యక్రమాలు యాక్టివ్ గా జరుగుతున్నాయి. ఇటీవల పంచాయతీ ఉపఎన్నికల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపించిందని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మ‌రో జాతిర‌త్నాలు అవుతుందా?

ఈమ‌ధ్యకాలంలో చిన్న సినిమాలు మ్యాజిక్ చేస్తున్నాయి. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా వ‌చ్చి, వ‌సూళ్లు కొల్ల‌గొట్టి వెళ్తున్నాయి. `మ్యాడ్‌` టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, పాట‌లూ చూస్తుంటే.. ఇందులోనూ ఏదో విష‌యం ఉంద‌న్న భ‌రోసా క‌లుగుతోంది. సంగీత్‌...

చైతన్య : నిజమే మాస్టారూ – వై ఏపీ నీడ్స్ బటన్ రెడ్డి ?

వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని జగన్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. ఆంధ్రాకు ఆయన అవసరం ఏంటి అనే చర్చ ప్రజల్లో పెట్టబోతున్నారు. ఇది నెగెటివ్ టోన్ లో ఉంది. అయినా...

ఈ సారి కూడా మోదీకి కేసీఆర్ స్వాగతం చెప్పలేరు !

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఐదుగురు వైద్యుల బృందంతో చికిత్స అందిస్తున్నట్లుగా మంత్రి కేటీఆర్ తెలిపారు. వారం రోజులుగా జ్వరం, దగ్గుతో కేసీఆర్ బాధపడుతున్నారు. ఒకటి, రెండు రోజులకు తగ్గిపోయే...

టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ అని మర్చిపోతున్న కేటీఆర్ !

కేటీఆర్ ఇంకా తెలంగాణ రాష్ట్ర సమితిలోనే ఉన్నారు. భారత రాష్ట్ర సమితి వరకూ వెళ్లలేదు. అందరితో పాటు తాను కూడా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటికీ... అలా అనుకోవడం లేదు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close