సింగిల్ సింహం అంటూ ఎలివేషన్లు ఇచ్చుకుంటూ ఇప్పుడు కలసి వచ్చే పార్టీలను కలుపుకుంటామంటూ వైసీపీ ప్రకటనలు చేస్తోంది. పన్నెండో తేదీన ర్యాలీలు చేయాలని నిర్ణయించారు. ఆ ర్యాలీల్లో ఇతర పార్టీలను కూడా కలుపుకోవాలనుకుంటున్నారు. ఆ పార్టీలు ఏవి అంటే.. జడ శ్రవణ్ పార్టీల్లాంటివి. ఆయన పార్టీ ఉందో లేదో ఆయనకే తెలియదు. ఆయన పార్టీని కూడా కలుపుకుని ర్యాలీలు చేస్తారట.
ఇక ఆమ్ ఆద్మీ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు, బోడె రామచంద్ర యాదవ్ పార్టీ కూడా ఉన్నాయి. వీటిని కూడా కలుపుకోవాలనకుంటున్నారు. కానీ ఈ పార్టీలకు కనీస బలం లేకపోయినా ఆ పార్టీలు కూడా జగన్ రెడ్డితో కలిసేందుకు సిద్ధంగా లేవు. ఒక్క జడ శ్రవణ్ మాత్రమే సిద్ధంగా ఉన్నారు. ఆయన టార్గెట్లు వేరు. ఆయన స్వయంగా పోటీ చేస్తే 70 ఓట్లు కూడా రాలేదు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడానికి ఆయన తన శక్తిని ధారపోస్తున్నారు కాబట్టి సజ్జల ఫండింగ్ ఇచ్చేందుకు రెడీగా ఉంటారు. మిగతా పార్టీలకు ఫండింగ్ ఇచ్చినా రావు.
బీజేపీతో అంటకాగుతున్న జగన్ రెడ్డితో కలవడం కన్నా ఊరుకున్నంత ఉత్తమం మరొకటి ఉండదని కమ్యూనిస్టు పార్టీలు అనుకుంటాయి. రామచంద్రయాదవ్..జగన్ కు పోటీగా ఎదగాలనుకుంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ జెండాలు కొనుగోలు చేసి..తమ పార్టీ కార్యకర్తలోనే వైసీపీ మోయించుకోవాల్సి ఉంటుంది. అంటే.. వైసీపీలో పొత్తులకు సిద్ధం అన్నా కూడా దగ్గరకు వచ్చే పార్టీలు చాలా పరిమితంగా ఉన్నాయి. అయినా సజ్జల మాత్రం తమకూ ఓ కూటమి ఉందని నమ్మించాలనుకుంటున్నారు. ఆయనకు ఉన్న బెస్ట్ ఆప్షన్ ఒకటే.. కాంగ్రెస్ కూటమిలో చేరిపోవడం. దాన్ని మాత్రం పరిశీలించడం లేదు.