ఏపీలో ఏం జరిగినా కులం, మతం అంటూ రెచ్చగొట్టే రాజకీయాలకు వైసీపీ పాల్పడుతోంది. వ్యక్తిగత వివాదాలతో జరిగిన హత్యను వైసీపీ ఎంత పెద్ద ఇష్యూ చేసిందో అందరూ చూశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని వందల హత్యలు జరిగాయి. ఒక్కటి అయినా ఇలా కుల పరంగా వివాదం జరగలేదు. ఎందుకంటే ఇక్కడ రాజకీయమే కీలక పాత్ర. వైసీపీనే ఈ స్ట్రాటజీని అమలు చేస్తోంది. ఎక్కడైనా హత్య, శవం దొరికితే ముందుగా ఎలాంటి రాజకీయాలు చేయవచ్చే ప్లాన్ చేసుకుని వెంటనే రంగంలోకి దిగిపోతుంది. వైసీపీ ప్లాన్లను అడ్డుకోవడం .. పరిపాలనలో ఉన్న టీడీపీ నేతలకు సమస్యగా మారుతోంది.ఎందుకంటే వారి ప్రయారిటీ .. వైసీపీని కనిపెట్టుకుని ఉండటం కాదు. ప్రజలకు మంచి చేయడం. కానీ ఇప్పుడు వైసీపీపైనా ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం వచ్చి పడింది.
ప్రజా సమస్యలు లేకపోవడం వల్లనే కులాలు, మతాలు
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు .. ఎపుడూ ప్రజల్లో ఓ ఆందోళన ఉండేది. రేపేంటి అన్న ప్రశ్న వచ్చేది. ఏ వర్గమూ ప్రశాంతంగా ఉండేది కాదు. అప్పుడు అవే సమస్యలు. ప్రజలకు కులాలు, మతాలు సమస్యలు కాదు. బతుకే సమస్య. అలాంటి పాలన అందించిన జగన్ రెడ్డి.. ప్రజలందర్నీ బతికి ఉంటే బలుసాకు తిని బతకవచ్చని భయంతో బతికేలా పరిపాలన చేశారు. అప్పటికి ఇప్పటికీ తేడా కనిపిస్తోంది. ఇప్పుడు అంతా ప్రశాంతంగా ఉంది. అందుకే వైసీపీ ప్రజల తీరికను అర్థం చేసుకుని.., కులాలతో రాజకీయం ప్రారంభించింది. ఏం జరిగినా కులమంటూ రాజకీయం చేస్తోంది.
వైసీపీ కూడా ఖాళీగా ఉండటం వల్లే ఇదంతా!
వైసీపీ కూడా ఖాళీగా ఉంది. ప్రతిపక్ష హోదా లేదని.. అసెంబ్లీకి పోవడం లేదంటే.. వారు రాజకీయాలు చేయడం లేదని కాదు. అంతర్గతంగా వారు చేసే కుట్ర రాజకీయాలపై గతంలోనే స్పష్టత ఉంది. అంతకు మించి వారు కుట్రలు చేస్తారని తెలుసు. వైసీపీలో ఎవరూ తీరికగా లేరు. జగన్ రెడ్డి మనస్థత్వానికి తగ్గట్లుగా రాక్షసత్వంతో కూడిన ప్రణాళికలు అమలు చేసేందుకు చాలా పెద్ద బడ్జెట్తోనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా చేయడానికి టీడీపీనే అవకాశం కల్పిస్తోంది. ఎందుకంటే.. వారికి ఏ పనీ లేకుండా చేసి..తీరికగా ఉండేలా చేస్తున్నారు. అలా కాకుండా.. ఐదు సంవత్సరాల పాటు వారు చేసిన పనుల కారణంగా.. పరుగులు పెట్టించే ప్రయత్నాలు చేసి..బిజీగా ఉంచితేనే వారి కుట్రలకు చెక్ పడుతుంది.
వైసీపీని పరుగులు పెట్టించాల్సిన సమయం
వైసీపీ చేసే కుట్ర రాజకీయాలకు ఎప్పటికప్పుడు చెక్ పెట్టుకుంటూ పోవడం.. వివరణలు ఇచ్చుకుంటూ పోవడం కన్నా.. అసలు వారి ప్రయత్నాలు చేయకుండా ఉంచేలా చేయడం బెటర్. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ఓ కన్ను వేయాల్సిన అవసరం కనిపిస్తోంది. కుట్ర రాజకీయాలకు కీలకంగా మారే నలుగురు ఐదుగురు ముఖ్యుల్ని పట్టుకుని .. సరైన ట్రీట్ మెంట్ ఇవ్వడమే కాదు.. తప్పుడు ప్రచారాలు చేసే వారికి భయం పుట్టించేలా చేయగలిగితే..చాలా వరకూ సమస్య పరిష్కారం అవుతుంది. లీలా చేయాలంటే.. వారందరికీ.. ఈ కుట్రలు చేసే సమయం లేకుండా.. పని పెట్టాలి. అది ప్రభుత్వం.. కూటమి చేతుల్లో ఉంది. ఆ పని ఎలా ఉండాలంటే.. వారు బయట కనిపించేందుకు కూడా అవకాశం ఉండనంత పని కల్పించాల్సి ఉంది.