వైసీపీ లీడర్, రామ్ గోపాల్ వర్మ మిత్రుడు.. వ్యూహం సినీ నిర్మాత దాసరి కిరణ్ .. తనది వైసీపీ రక్తమేనని నిరూపించుకున్నారు. ఇంత కాలం తనకు చాలా మంది పెద్దలు తెలుసని చెప్పి ఎవర్నీ బయటపడకుండా బెదిరించి కాలం గడిపారు కానీ ఇప్పుడు అందరూ బయటకు వస్తున్నారు. తమ వద్ద డబ్బులు తీసుకుని అడిగితే బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదుచేశారు.
ఐదున్నర కోట్లు అప్పు తీసుకుని తిరిగి ఇవ్వాలని అడిగితే దాడి చేయించారని ఆయన ఆయన సమీప బంధువులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన మా దగ్గర తీసుకున్నారంటే.. మా దగ్గర తీసుకున్నారని చాలా మంది పోలీసుల వద్దకు వస్తున్నారు. తనఖాగా ఆస్తులు పెడతాం.. అప్పులు ఇవ్వాలని అడుగుతారు. డబ్బులు ఇచ్చాక వారికి చెల్లని అగ్రిమెంట్ ఇస్తారు. ఆ తర్వాత ఆ ఆస్తులను అమ్మేస్తారు. అది తెలిసి అప్పులిచ్చిన వాళ్లు అడిగితే..తనకు చాలా మంది తెలుసని బెదిరిస్తారు. ఇలా మరో ఇద్దరు విజయవాడ పోలీసుల్ని ఆశ్రయించారు.
దాసరి కిరణ్ ఇప్పటికే రిమాండ్ లో ఉన్నారు. ఆయన బాధితులంతా వరుసగా పోలీస్ స్టేషన్ కు వస్తున్నారు. ఆయన వ్యూహం సినిమాలు నిర్మించి నిండా మునిగారు. ఆ సినిమాలు తీసినందుకు నిండా మునిగారు. ప్రభుత్వం తరపున జగన్ రెడ్డి ఎంత ఇచ్చారో తెలియదు. కానీ ఆయన అప్పుల పాలై జైలు పాలయ్యారు. ఇంకా ఎంత మంది బయటకు వస్తారో కానీ.. తన దాకా రాకూడదని.. ఆర్జీవీని మాత్రం అనుకుంటూ ఉండవచ్చు.