అసలు అనని విషయాన్ని అన్నట్లుగా చూపించి తన సినిమా నటిగా ఉన్న టాలెంట్ మొత్తాన్ని రోజా చూపిస్తున్నారు. కానీ అది ఎబ్బెట్టుగా మారిపోతోంది. ఏడుపులు, పెడబొబ్బలతో ఆమె సాక్షి టీవీలో ప్రతిభ చూపిస్తున్నారు. ఎందుకు అలా ఎడుస్తున్నారో .. వైసీపీ నేతలు ఎందుకు గాలి భానుప్రకాష్ పై ఆరోపణలు చేస్తున్నారో మాత్రం ఇదంతా చూస్తున్న వారికి ఆర్థం కావడం లేదు. ఎందుకంటే గాలి భానుప్రకాష్ ఏమన్నారో మాత్రం చెప్పడం లేదు. ఆయన అన్న వీడియోను ఎవరూ చూపించడం లేదు.
గాలి భానుప్రకాష్ తన వ్యక్తిత్వాన్ని కించ పరిచేలా రెండువేల రూపాయలకు అన్ని పనులు చేస్తారని అన్నారని రోజా ఆరోపిస్తున్నారు. అలా అని ఉంటే ఆ వీడియోను వైరల్ చేసి ఉండేవారు. కానీ జగన్ మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ లో కూడా.. గాలి భాను ప్రకాష్ అన్నాడని చెబుతున్న మాటల వీడియోలేదు. జగన్ రెడ్డి బట్ట కాల్చి ముఖం వేసిన చందంగా.. గాలి భానుప్రకాష్… అదన్నారు ఇదన్నారు అని.. చాలా పొడుగాటి ట్వీట్ పెట్టారు. కానీ అసలేమన్నారో వీడియో ఆధారం పెట్టలేదు. ఒక్క జగత్ కాదు.. సాక్షి మీడియా..రోజా కూడా అంతే. నోటి మాటలతో ఆరోపణలు చేసి డ్రామాలు రక్తికట్టిస్తున్నారు కానీ నిజంగా గాలి భానుప్రకాష్ ఏమన్నారో మాత్రం చెప్పడం లేదు.
గాలి భానుప్రకాష్.. రోజా వ్యక్తిత్వం గురించి చెప్పలేదు. ఒకప్పుడు ఇంటికి రెండు వేల రూపాయల అద్దెలు కట్టుకోలేకపోయేవారని చెప్పారు. అలాంటిది ఇప్పుడువేల కోట్లు సంపాదించాలని ఆరోపించారు. కానీ రోజా మాత్రం.. పట్టాభివ్యవహారంలో జగన్ రెడ్డి మాదిరి.. తన వ్యక్తిత్వంపై తానే నిందలేసుకుని ఏడుస్తున్నారు. ప్రజలు ఇలాంటి రాజకీయ డ్రామాలు చూసి చూసి స్పందించడం మానేశారు. రోజా విషయంలో అసలు ఎవరికీ సానుభూతి రాదు. తన ట్రాక్ రికార్డ్ అలాంటిది. అయినా సరే తమ ప్రయత్నాలు తాము చేయాలన్నట్లుగా డ్రామాలాడుతున్నారు. డ్రామా పార్టీ అనే పేరును కొనసాగించుకుంటున్నారు.
వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని.. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ఏమన్నాడో స్పష్టంగా వీడియో ఉంది. అందరూ ఆ వీడియోను చూశారు. కానీ భానుప్రకాష్ వీడియోను వైసీపీ ఎందుకు షేర్ చేయడం లేదో.. ఆరోపణలు మాత్రమే ఎందుకు చేస్తున్నారో సులువుగా అర్థం చేసుకోవచ్చు.