వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు , వైసీపీ మీడియా, సోషల్ మీడియా గత కొద్ది రోజులుగా ఉద్దేశపూర్వకంగా తిరుమల తిరుపతి దేవస్థానాలపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి ముందు ఉండి ఈ దాడి చేయిస్తున్నారు. గోవుల మరణం దగ్గర నుంచి ఫేక్ వార్తలతో అదే పనిగా అలజడి రేపే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన తీరుతో.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఒక్క సారిగా భగ్గుమన్నారు. పది కోట్ల రూపాయలకు పరువు నష్టం వేయడమే కాదు.. ఇలా టీటీడీపై .. ఫేక్ ఆరోపణలు చేస్తున్న వారు భక్తిని నిరూపించుకోవాలని సవాల్ చేశారు.
దేవునిపై భక్తి ఉంటే అలా దోచుకునేవారా ?
వైసీపీ నేతలకు దేవునిపై భక్తి లేదు. వారు ఆరాధించే దేవుడు వేరే ఉంటాడు. అది బహిరంగరహస్యం. కానీ వారి సంపాదనకు టీటీడీ అవసరం అన్నట్లుగా వాడుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కల్తీ నెయ్యి దగ్గర నుంచి టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్ వరకూ ఏ చిన్న దాన్నీ వదిలి పెట్టలేదు. చివరికి కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి ఎన్నికల ఖర్చుల కోసం కమిషన్లు తీసుకున్నారు. వైసీపీ నేతలు చేసిన దోపిడీ విజిలెన్స్ దర్యాప్తులో స్పష్టమయింది. కరుణాకర్ రెడ్డి .. నక్సలైట్ గ్రూపుల్లో పని చేసిన వ్యక్తి. ఆయన భావజాలం చాలా బలంగా ఉంటుంది. కేవలం దోచుకోవడానికే.. ఆయన దేవుడిపై నమ్మకం పేరుతో వేషాలేస్తున్నారు.
తప్పుడు ప్రచారాలతో టీటీడీ ప్రతిష్ట దెబ్బతీసే వ్యూహం
టీటీడీపై ఎప్పుడూ తప్పుడు ప్రచారాల వ్యూహమే పాటిస్తున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పింక్ డైమండ్, పోటులో తవ్వకాల పేరుతో చేసిన తప్పుడు ప్రచారం అంతా ఇంతా కాదు. ఇప్పుడు కూడా అదే వ్యహం పాటిస్తున్నారు. ప్రజల్ని గందరగోళ పరిచి.. తిరుమలపై తప్పుడు ప్రచారం చేసి.. హిందూత్వంపై ప్రజల్లో నమ్మకం తగ్గించాలని వారి కుట్రలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతీ దానికి కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో కుట్ర జరుగుతోంది. అన్యమత ఉద్యోగుల్ని బదిలీ చేయడమో.. వీఆర్ఎస్ ఇవ్వడమో చేస్తామని ప్రకటించినప్పటి నుండి ఈ దాడి ఎక్కువ అయింది. అలాంటి వారిని అడ్డం పెట్టుకుని భూమన ఈ ఫేక్ దాడిచేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హిందూత్వాన్ని కించ పరిచి మతమార్పిళ్లు పెంచే వ్యూహం
వైసీపీకి కన్వర్టర్ క్రిస్టియన్లు ఓటు బ్యాంక్ గా ఉన్నారు. వారి శాతాన్ని పెంచుకుంటే తప్ప తమకు రాజకీయంగా మేలు జరగదని అనుకుంటున్నారు. అందుకే తిరుమలను టార్గెట్ చేసుకున్నారన్న అనుమానాలు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో మత మార్పిడి మాఫియాలను కట్టడి చేయడానికి ప్రభుత్వం అంతర్గతంగా చర్యలు తీసుకుంది. గిరిజనుల్లోనూ మత మార్పిళ్లను నిరోధించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో హిందూత్వంపై జరుగుతున్న పకడ్బందీ ఫేక్ దాడులు ఏ మాత్రం యాధృచ్చికం కాదని.. పక్కా కుట్ర అని అర్థం చేసుకోవచ్చంటున్నారు.