రాజకీయాల్లో ఒక్క శాతం అయినా నిజాయితీ లేకుండా ప్రజల్ని మభ్యపెట్టి.. పనులు పూర్తి చేద్దామనుకునే కాలం పోయి చాలా రోజులు అయింది. రోజులు మారాయి. ఇప్పుడు ప్రజలకు చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఎదుటి పార్టీపై వ్యతిరేకతతో .. తమ అభిమాన పార్టీ ఏం చెప్పినా నమ్మే పరిస్థితుల్లో లేరు. కానీ వైసీపీ ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతోంది. తమ పార్టీ క్యాడర్ అంతా..తాము ఏది చెబితే అది నమ్మేసే గొర్రెలని తీర్మానించుకుంది. అందుకే.. కళ్ల ముందు కనిపించే నిజాల్ని కూడా అబద్దాలుగా ప్రచారం చేస్తూ.. రాజకీయం చేస్తోంది. దానికి మెడికల్ కాలేజీల ఇష్యూనే ఊదాహరణ.
కట్టని మెడికల్ కాలేజీల్ని కట్టినట్లుగా ప్రచారం చేసుకుంటున్న జగన్
జగన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీల్ని కట్టాలనుకున్నాడు. అనుకోవడానికి ఏముంది.. చాలా మంది అనుకుంటారు. ఆయన రెండో సారి ముఖ్యమంత్రి కావాలని అనుకున్నాడు. అవలేకపోయాడు. అలా పదిహేడు మెడికల్ కాలేజీల్ని కట్టాలనుకున్నాడు. కానీ కట్టలేదు. భవనాలు కడితేనే సరిపోదు ఆ కాలేజీల్ని నిర్వహించడానికి నిధులు కావాలి.. అందుకే అసలు కట్టనే లేదు. పునాదులు వేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో ఆగిపోయాయి.కానీ జగన్ రెడ్డి తాను కట్టేశానని చెప్పుకుంటున్నారు. వైసీపీ దాన్ని డుం..డుం.. డుం అని డబ్బా కొడుతూ ప్రచారంచేస్తోంది.
PPP అంటే ప్రైవేటీకరణ అని ఫేక్ ప్రచారం
ప్రైవేటీకరణ అంటే పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్.. ప్రభుత్వ వాటా ప్రభుత్వానికి ఉంటుంది. రూల్స్ అన్నీ ప్రభుత్వం పెడుతుంది. భవనాలు, నిర్వహణ మాత్రం టెండర్ దక్కించుకున్నవారు చేస్తారు. ఫ్రీ సీట్లు విద్యార్థులకు అలాగే ఉంటాయి. ఒక్క రూల్ కూడా మారదు. కానీ జగన్ రెడ్డి ఫేక్ రాజకీయంలో.. ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారన్న ఓ పిచ్చి నమ్మకంతో కట్టేశానని.. అమ్మేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. ఇవి కళ్ల ముందు ఉండేవి కావా?. ఇలాంటి వాటిలో ఎలా అబద్దాలతో..ఫేక్ రాజకీయాలు చేయగలరు ?. వైసీపీకి మాత్రమే ఇది సాధ్యం.
ప్రజల్ని తక్కువ అంచనా వేయడం ఆపేయాలి!
వైసీపీ ప్రజల్ని తక్కువ అంచనా వేసి.. వారు గొర్రెలని అనుకోవడం మానేసినప్పుడు మాత్రమే వారి రాజకీయంలో కాస్త అయినా నిజాయితీ వస్తుంది. లేకపోతే ప్రజలతో టచ్ లేకుండా రాజకీయాలు నడుస్తాయి. మెడికల్ కాలేజీల వ్యవహారంలో ప్రజలు ఏమనుకుంటున్నారో.. వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారం ఫలితం ఏమిటో ఆ పార్టీ కాస్త ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంటే క్లారిటీ వస్తుంది. కానీ అలాంటి అలవాటు లేని పార్టీ వైసీపీ. తాము అనుకున్నదే రాజకీయం అనుకుంటూ ఉంటారు ఆ పార్టీ పెద్దలు. అందుకే అలా కొనసాగిస్తున్నారు.