జగన్ రెడ్డి తన ఊరేగింపు పిచ్చితో మరో పార్టీ నాయకుడి ప్రాణాలు పోవడానికి కారణం అయ్యారు. జోగి రమేష్ ను పరామర్శిస్తానని మధ్యాహ్నం తాడేపల్లి నుంచి బయలుదేరిన ఆయన.. మెల్లగా రోడ్ షో చేసుకుంటూ ఇబ్రహీంపట్నం చేసుకున్నారు. ఈ లోపే ఆ ర్యాలీతో పాటు వచ్చి.. మధ్యలో తొక్కిసలాటకు గురై.. పూర్తిగా అలసిపోయిన రాంబాబు అనే పార్టీ నేత స్పృహతప్పి పడిపోయారు. ఆయనను ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయాడు. ఆయన చిల్లకల్లు వైసీపీ గ్రామ అధ్యక్షుడిగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
జగన్ రెడ్డి ఊరేగింపు కోసం మూడు రోజుల ముందు నుంచీ సన్నాహాలు చేస్తున్నారు. కృష్ణా జిల్లాలోని అందరు వైసీపీ గ్రామస్థాయి నేతలకూ పదే పదే మెసెజులు పంపి రావాల్సిందేనని స్పష్టం చేశారు. ఇతర ప్రాంతాల నేతల్ని .. కార్యకర్తల్ని తీసుకొచ్చారు. ఆయన కోసం జగన్ ఎగబడుతున్నట్లుగా షో చేసుకుంటూ.. స్టేజ్ షోలు చేస్తూ..ఆయన ఉగేరింపు కొనసాగించారు. చివరికి చిల్లకల్లు వైసీపీ నేత రాంబాబు చనిపోయారు. ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది.
మరో వైపు ఈ యాత్రలో డ్రామాలు ఓ రేంజ్ లో ఉండేలా చేసుకున్నారు. విధ్వంసం సృష్టిస్తామనే పోస్టర్ల దగ్గర నుంచి .. కొంత మంది చేతులు కోసుకుని జగన్ పోస్టర్లకు.. ఇతర నేతల పోస్టర్లకు రక్తం బొట్లు పెట్టడం వరకూ చాలా చేశారు. ఈ మానసిక వికారాన్ని పెద్ద గొప్ప పనులుగా వైసీపీ నేతలు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇలాంటి సైకోతనం ఉన్న వారితో కలిసి ఊరేగింపు చేస్తూ జనాల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు జగన్ అండ్ టీం.

