మా సినిమాలో లాజిక్కులు చూడొద్దు.. కామెడీని మాత్రమే చూడండని ఇటీవల కొన్ని సినిమాల దర్శక నిర్మాతలు ముందుగానే ప్రేక్షకుల్ని ప్రిపేర్ చేస్తున్నారు. ఎందుకంటే ఇలా ఎలా జరుగుతుందని ప్రేక్షకులు వ్యతిరేకంగా అనుకోకుండా.. ముందుగానే చెబుతూంటారన్నమాట. సినిమాలో ఏదైనా చేయవచ్చు..జరగవచ్చు అన్న కాన్సెప్ట్ అమలు చేస్తారు. వైసీపీ కూడా అంతే. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు..చేయవచ్చు అని సీన్లు రెడీ చేసుకుంటారు ఎన్ని కోడికత్తి,గులకరాళ్ల దగ్గర నుంచి నిన్న సింగయ్య భార్యతో చెప్పించిన అబద్దాల వరకూ అన్నీ స్క్రిప్టులే.
తప్పు మీద తప్పు చేస్తున్న వైసీపీ
దళిత కార్యకర్తను నిర్దాక్షిణ్యంగా జగన్ రెడ్డి కారుతో తొక్కించి చంపేశారన్నది కళ్ల ముందు ఉన్న నిజం. దాన్ని తొక్కిపెట్టారు. ఎవరో ఓ అవినాష్ అనుచరుడ్ని ఇరికించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసులు నిజంగా నమ్మారో లేకపోతే.. వాళ్ల గ్రిడ్ లో ఉండి జగన్ ను కాపాడటానికి ప్రయత్నించారో కానీ.. ఆ కారుదే తప్పని ఎఫ్ఐఆర్ పెట్టేసి క్లోజ్ చేయసేయబోయారు. చివరికి ఐదు రోజుల తర్వాత వీడియోలు బయటకు రావడంతో .. జగన్ రెడ్డి కారే తొక్కేసిందని తేలింది. ఐదు రోజుల పాటు కనీసం జగన్ రెడ్డి అయినా తన కారు కిందే పడ్డాడని అంగీకరించలేదు. మొత్తం బయటకు వచ్చిన తర్వాత వివేకా హత్యకేసులో ఎలా అయితే చంద్రబాబుపై నిందలేశారో… ఇప్పుడు సింగయ్య భార్య తో అలాగే కథలు నడిపించడం ప్రారంభించారు. చేసింది తప్పు..దాన్ని కప్పి పుచ్చుకోవడానికి మరిన్ని తప్పులు చేస్తున్నారు.
అచ్చం వివేకా హత్య కేసు స్టోరీనే మళ్లీ !
వివేకానందరెడ్డిని అడ్డంగా నరికి చంపేసి.. గుండెపోటు, రక్తపు వాంతులు అని ప్రచారం చేశారు. వివేకా కుమార్తె పోస్టుమార్టం చేయించాలని పట్టుబట్టకపోతే అది కూడా లేకుండా పూడ్చి పెట్టేసి సాక్ష్యాలను సమాధి చేసేవారు. చివరికి బయటపడే సరికి.. చంద్రబాబు చంపేయించారని అడ్డగోలు ప్రచారం చేశారు. సేమ్ స్టోరీని సింగయ్య విషయంలో రిపీట్ చేస్తున్నారు. సింగయ్య కుటుంబం పేదరికాన్ని అడ్డం పెట్టుకుని మరికొంత సొమ్ము ఇచ్చి ఆమెను పావుగా వాడుకున్నారు. జగన్ రెడ్డి రాజకీయంలో పేదల్ని మింగేసిన తాను బలపడేదే ఎక్కువ. జగన్ రెడ్డిని అభిమానించి సర్వం కోల్పోయిన ఆ కుటుంబానికి మరో దారి లేకుండా పోయింది.
ఆమెతో అలా చెప్పించిన వారిపై కుట్ర కేసులు పెట్టాలి !
జగన్ రెడ్డిపై ఇప్పుడు కుట్ర కేసులు కూడా పెట్టవచ్చు. సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారని.. కోర్టులో నిరూపించవచ్చు. ఆ సింగయ్య కుటుంబసభ్యులకు ఎంతెంతో డబ్బులు ఇచ్చారో వెంగళాయపాలెం మొత్తం చెప్పుకుంటోంది. గుంటూరు అంతా జగన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని కళ్లారా చూస్తోంది. ఈ వ్యవహారంలో తప్పు మీద తప్పు చేసి కుట్రలు చేస్తున్న జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ పై కేసులు పెట్టకపోతే వారి కుట్రలు అంతకంతకూ పెరుగుతూ ఉంటాయి. నిన్న వివేకా కేసులో ఇదే కథ చెప్పి.. సింగయ్య కేసులోనూ అదే కథ చెబుతున్నారు. రేపు మరో కేసులోనూ అదే కథ చెబుతారు.